Khappar Yogam 2026: మే 1 నుంచి కప్పర యోగం ప్రారంభం.. ఈ 4 రాశుల వారికి గడ్డు కాలం! మీరున్నారా?
Khappar Yogam 2026: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మే 1 నుండి జూన్ 29 వరకు ఏర్పడబోతున్న 'కప్పర యోగం' కొన్ని రాశుల వారి జీవితాల్లో తుపాను సృష్టించే అవకాశం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు. ఆ రాశుల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.
Khappar Yogam 2026: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పులు వస్తే, అది ద్వాదశ రాశుల వారి జీవితంలో కూడా అనేక విధమైన మార్పులను తీసుకు వస్తుంది. ఒక్కోసారి ఇది శుభ ఫలితాలను తీసుకొస్తే, ఒక్కోసారి అశుభ ఫలితాలు కలుగుతాయి. త్వరలో కప్పర (Khappar Yogam 2026) యోగం ఏర్పడుతుంది. ఇది మే 1 నుంచి జూన్ 29 వరకు ఉంటుంది. ఈ కప్పర యోగం అనేది సమస్యలను కలిగించే అవకాశం ఉంది.

ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడినప్పటికీ, కొన్ని రాశుల వారు మాత్రం సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం ఈ సమయంలో కొన్ని రాశుల వారు ఊహించని మార్పులను చూస్తారు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కెరీర్‌లో ఇబ్బందులు వంటివి ఉండొచ్చు. మరి ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉంటే మంచిది? ఇప్పుడు తెలుసుకుందాం.
భయంకరమైన కప్పర యోగం.. మే 1 నుంచి రాశుల వారికి సమస్యలు
ఈ యోగం ఎలా ఏర్పడుతుంది?
ఈ యోగం క్రూర గ్రహాలైనటువంటి రాహువు, కేతువు వలన ఏర్పడవచ్చు. లేదా కుజుడు, శని గ్రహాల వలన కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఈ యోగం వలన మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు కూడా ఏర్పడవచ్చు.
భయంకరమైన కప్పర యోగం.. ఈ రాశులు వారు జాగ్రత్తగా ఉంటే మంచిది
1.మిథున రాశి:
ఈ సమయంలో మిథున రాశి వారు ఎత్తుపల్లాలు చూస్తారు. ఇబ్బందులు వస్తాయి. చిన్న చిన్న అపార్థాలు కూడా కలగవచ్చు. సహనంతో వ్యవహరిస్తే మంచిది. ఈ సమయంలో ఈ రాశి వారికి పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. నీరసం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు కచ్చితంగా ప్రణాళిక వేసుకోవడం చాలా అవసరం.
2.కన్య రాశి:
కన్య రాశి వారికి కూడా ఇది చాలా ఒత్తిడిని తీసుకొచ్చే సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు కన్ఫ్యూజన్‌లో ఉంటారు. అనవసరమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థికపరంగా కూడా సమస్యలు ఉండొచ్చు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బును ఆదా చేసుకోవాలి. ఏదైనా ముఖ్యమైన ప్రాజెక్టు ఉంటే బాగా ఆలోచించుకోవాలి. అనవసరంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. చిన్న చిన్న సమస్యలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
3.మకర రాశి:
మకర రాశి వారికి ఇది ఛాలెంజింగ్ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా ఒకటికి పది సార్లు ఆలోచిస్తేనే మంచిది.
4.మీన రాశి:
మీన రాశి వారికి కూడా ఈ సమయంలో ఇబ్బందులు వస్తాయి. అనవసరంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. టెన్షన్ పెరుగుతుంది. ఆర్థికపరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు వద్దు. ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు ఏమి తీసుకోవద్దు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


