...
...
Next Story

వంటింట్లో ఈ వాస్తు తప్పులు చేస్తే డబ్బు నిలవదు.. వెంటనే సరిచేసుకోండి!

వంటగది ఇంట్లో అత్యంత ముఖ్యమైన ప్రదేశంగా వాస్తు శాస్త్రం పేర్కొంటుంది. కిచెన్ ఫ్లోరింగ్, స్లాబ్, అల్మారాల దిశలు సరైన విధంగా లేకపోతే ఆర్థిక సమస్యలు, ప్రతికూల ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Published on: Aug 7, 2026, 11:00:19 IST
Advertisement

ఇంటిని ఎంత అందంగా కట్టుకున్నప్పటికీ, వాస్తు నియమాలను పాటించకపోతే కుటుంబసభ్యులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా గృహంలో అత్యంత కీలకమైన స్థానం వంటిల్లు (Kitchen). ఇల్లు శుభప్రదంగా ఉండాలంటే అగ్ని మూలంలో కిచెన్ ఉండటమే కాకుండా, దాని నిర్మాణంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

వంటింట్లో ఈ వాస్తు తప్పులు చేస్తే డబ్బు నిలవదు.. వెంటనే సరిచేసుకోండి! (Gemini)
వంటింట్లో ఈ వాస్తు తప్పులు చేస్తే డబ్బు నిలవదు.. వెంటనే సరిచేసుకోండి! (Gemini)

లేదంటే ఎంతటి సంపన్నులైనా ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. వంటింటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వాస్తు, జ్యోతిష్య పరిహారాలు ఇక్కడ తెలుసుకుందాం.

వంటింటి ఫ్లోరింగ్ లో ఉండకూడని లోపాలు

సాధారణంగా వంటగదిని ఆగ్నేయ మూలలో నిర్మించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కిచెన్ సరైన దిశలో ఉన్నప్పటికీ, దాని ఫ్లోరింగ్ లేదా నేల నిర్మాణంలో లోపాలు ఉంటే తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది.

ఇంటిలోని ఇతర భాగాలతో పోలిస్తే వంటింటి నేల అగ్నేయ మూలలో లేదా దక్షిణ దిశ వైపు కిందికి వంగి ఉండకూడదు. ఒకవేళ పొరపాటున అలాంటి వాలు లేదా నిర్మాణం ఉంటే వెంటనే దానిని సరిచేయించుకోవాలి. లేదంటే ఇంట్లోకి ఎంత ధనం వచ్చినా నిలవకుండా నీళ్లలా ఖర్చైపోతుంది.

కిచెన్ స్లాబ్, వస్తువుల సరైన దిశ

వంటగది సరైన దిశలో ఉన్నప్పటికీ, అందులోని స్లాబ్, అల్మారాలు తప్పు దిశలలో నిర్మిస్తే కూడా ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి.

వంటగదిలో గిన్నెలు, పాత్రలు సర్దే అల్మారాలను ఎప్పుడూ దక్షిಣ లేదా పశ్చిమ దిశలో మాత్రమే ఏర్పాటు చేయాలి. అదే విధంగా కిచెన్ లో పెద్ద కిటికీలు ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల గాలి, వెలుతురు ధారాళంగా వచ్చి సానుకూల శక్తి (Positive Energy) ఎల్లప్పుడూ ఇంట్లో నిండి ఉంటుంది.

బుధ దోశ నివారణ

చాలా చిన్న పరిహారమే అయినప్పటికీ ఇది జీవితంపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. పశ్చిమ దిశ శనికి సంబంధించినదిగా భావిస్తారు. వంటగదిలోని పశ్చిమ దిశలో ఒక స్టీలు డబ్బాలో నల్ల నువ్వులను నిల్వ ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆ ప్రాంతంలోని శని దేవుడి ప్రతికూల శక్తి తగ్గి, సానుకూల శక్తి సమతుల్యమవుతుంది. ఇంట్లో ఆర్థిక అసమతుల్యతలు తొలగిపోయి ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks