జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, ఒక వ్యక్తి స్వభావం, భవిష్యత్తు గ్రహాల కదలిక ఆధారంగా ఉంటుంది. అంతేకాకుండా, పుట్టిన తేదీ ప్రకారం కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. హిందూ క్యాలెండర్ ప్రకారం నెలలో 30 రోజులు ఉంటాయి. తిథుల ప్రకారం చూసినట్లయితే మొత్తం 15 తిథులు ఉంటాయి. ఏ తిథి ఆధారంగా కూడా అనేక విషయాలను చెప్పవచ్చు. మరి మీరు పుట్టిన తిథి ప్రకారం మీరు ఎలాంటి వారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే పూర్తి వివరాలు ఇదిగో.
మీ పుట్టిన తిథి ప్రకారం మీరు ఎలాంటి వారో తెలుసుకోండి:
పాడ్యమి:

పాడ్యమి నాడు పుట్టిన వారు ఎక్కువగా సౌకర్యవంతమైన, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అయితే ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే మంచిది. ఎక్కువ ప్రతికూల ఆలోచనలు ఉంటే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
విదియ:
విదియ నాడు పుట్టిన వారు చాలా ధైర్యవంతులు. ఎంతో శక్తి కలిగి ఉంటారు. శుభ్రత విషయంలో కాస్త అశ్రద్ధగా ఉంటారు.
తదియ:
తదియ నాడు పుట్టిన వారు మానసికంగా ప్రశాంతంగా ఉండలేరు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉంటారు, విశ్రాంతి తీసుకోరు. కాస్త కోపంతో ఉండడం వల్ల గొడవలు జరుగుతాయి. దీని ప్రభావం ఆర్థిక పరిస్థితిపై కూడా పడుతుంది.
చవితి:
చవితి నాడు పుట్టిన వారు అందరితో ఇట్టే కలిసిపోతారు. ప్రేమతో ఉంటారు. మంచి సంతానంతో జీవిస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. వీరు చాలా పాపులర్ అవుతారు.
పంచమి:
పంచమి నాడు పుట్టిన వారు తల్లిదండ్రులకు చాలా విలువ ఇస్తారు. ఓర్పు, సేవా గుణం ఎక్కువగా ఉంటుంది. జీవితాన్ని సంతోషంగా గడుపుతారు.
షష్ఠి:
షష్ఠి నాడు పుట్టిన వారు ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. వివిధ దేశాలు తిరుగుతారు. ఆహార ప్రియులు కూడా.
సప్తమి:
సప్తమి నాడు పుట్టిన వారు చాలా బ్రైట్‌గా ఉంటారు. అదృష్టవంతులు. సమాజంలో గౌరవం, మర్యాదలు సంపాదిస్తారు.
అష్టమి:
{{/usCountry}}సప్తమి నాడు పుట్టిన వారు చాలా బ్రైట్‌గా ఉంటారు. అదృష్టవంతులు. సమాజంలో గౌరవం, మర్యాదలు సంపాదిస్తారు.
అష్టమి:
{{/usCountry}}అష్టమి నాడు పుట్టిన వారు అందరితో ప్రేమగా ఉంటారు. ఏ పని అయినా పర్ఫెక్ట్‌గా పూర్తి చేయడానికి ఇష్టపడతారు. నిజాయితీగా ఉంటారు.
నవమి:
నవమి నాడు పుట్టిన వారు విజ్ఞానవంతులు. దైవభక్తి ఎక్కువ. కుటుంబానికి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. అందర్నీ బాగా చూసుకుంటారు.
దశమి:
దశమి నాడు పుట్టిన వారు ప్రభుత్వ సంబంధిత లాభాలను పొందుతారు. స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటారు. ఉన్నదాంట్లో సంతోషంగా జీవించడం తెలుసు.
ఏకాదశి:
ఏకాదశి నాడు పుట్టిన వారు భక్తి పరులు. జీవితం సంతోషంగా, సమతుల్యంగా ఉంటుంది. వీరి వ్యక్తిత్వం అందర్నీ ఆకట్టుకుంటుంది.
ద్వాదశి:
ద్వాదశి నాడు పుట్టిన వారు తెలివైన వారు. ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. దేశ విదేశాలు చూడాలనుకుంటారు.
త్రయోదశి:
త్రయోదశి నాడు పుట్టిన వారు కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు. అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు.
చతుర్దశి:
చతుర్దశి నాడు పుట్టిన వారు నిజాయితీగా మాట్లాడుతారు. ధైర్యంగా ఉంటారు. సమాజంలో గౌరవం పొందుతారు. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు.
పౌర్ణమి:
పౌర్ణమి నాడు పుట్టిన వారు తెలివైన వారు. సంతోషంగా జీవిస్తారు. మంచి ఆహారాన్ని ఇష్టపడతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.
అమావాస్య:
అమావాస్య నాడు పుట్టిన వారు ధైర్యవంతులు. పనులను రహస్యంగా పూర్తి చేస్తారు. అప్పుడప్పుడు కాస్త చిరాకు చూపిస్తారు.