కార్తీక మాసానికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కార్తీక మాసం శివకేశవుల ఆరాధనకు అత్యంత పవిత్రమైన కాలంగా చెబుతారు. కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమితో పాటుగా కోటి సోమవారం లాంటి పర్వదినాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. కోటి సోమవారం నాడు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించడం వలన పుణ్యఫలితాలు లభిస్తాయని నమ్ముతారు.

చాలా మంది కోటి సోమవారం అంటే ఏంటి? ఆ రోజు ప్రత్యేకత ఏంటి? అనే విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే అసలు కోటి సోమవారం అంటే ఏంటి? రేపు వచ్చే కోటి సోమవారం విశిష్టత ఏంటి? కోటి సోమవారం నాడు శివుడిని ఏ విధంగా ఆరాధించాలి? వంటి వివరాలను ఇప్పుడే తెలుసుకుందాం.
కోటి సోమవారం అంటే ఏంటి?
కార్తీక మాసంలో వచ్చే పవిత్రమైన పర్వదినాల్లో కోటి సోమవారం ఒకటి. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం కలిసి వచ్చే రోజుకు ఎంతో విశిష్టత ఉంది. కొన్ని పంచాంగ సంప్రదాయాల్లో సప్తమి తిథి, శ్రవణ నక్షత్రం కలయికను కోటి సోమవారంగా చెబుతారు.
ఆ రోజు చేసే అభిషేకాలు, దీపారాధన, ఉపవాసాలు, పూజలు, దానధర్మాలు కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తాయని నమ్ముతారు. అందుకే ఈ పర్వదినాన్ని కోటి సోమవారం అంటారు. ఆ రోజు తప్పకుండా సోమవారమే అవ్వాలని లేదు.
కోటి సోమవారం విశిష్టత
కార్తీక మాసంలో శివారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శివుడికి అభిషేకం చేయడం, బిల్వపత్రాలను సమర్పించడం, దీపారాధన చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. కోటి సోమవారం నాడు పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన పాపవిముక్తి కలుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఐశ్వర్యం కూడా పెరుగుతుంది. ఇలా అనేక విధాలుగా లాభాలను పొందవచ్చని భక్తుల విశ్వాసం.
కోటి సోమవారం నాడు శివుడిని ఎలా పూజించాలి?
శివలింగానికి అభిషేకం చేయాలి. బిల్వపత్రాలను శివుడికి భక్తితో సమర్పించాలి. దీపారాధన చేయాలి. 'ఓం నమః శివాయ' అనే మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపిస్తే మంచిది. అలాగే కోటి సోమవారం నాడు దానధర్మాలు చేస్తే కూడా మంచిది.
{{/usCountry}}శివలింగానికి అభిషేకం చేయాలి. బిల్వపత్రాలను శివుడికి భక్తితో సమర్పించాలి. దీపారాధన చేయాలి. 'ఓం నమః శివాయ' అనే మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపిస్తే మంచిది. అలాగే కోటి సోమవారం నాడు దానధర్మాలు చేస్తే కూడా మంచిది.
{{/usCountry}}కోటి సోమవారం నాడు ఈ ఒక్క పని చేస్తే శివుడి అనుగ్రహం లభిస్తుంది
కోటి సోమవారం నాడు శివుడికి కచ్చితంగా జలాభిషేకం చేయండి. ఇది శివుడికి చాలా ప్రీతికరమైనది.
ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్లి శుద్ధమైన నీటితో అభిషేకం చేయాలి.
అభిషేకం చేసేటప్పుడు 'ఓం నమః శివాయ' అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి.