లక్ష్మీ నారాయణ రాజయోగం: దీపావళి ముందు ఆర్థికంగా కలిసొచ్చే కాలం.. ఈ 4 రాశులకు ధనయోగం!
దీపావళికి ముందు గ్రహాల ప్రత్యేక కలయికతో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడనుందని జ్యోతిష్య విశ్లేషణ పేర్కొంటోంది. సెప్టెంబర్ 28, 2026 నుంచి తులా రాశిలో బుధుడు, శుక్రుడి కలయికతో ఈ యోగం ప్రారంభమవుతుంది.
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి, రాశి మార్పులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. త్వరలో రానున్న దీపావళి పండుగకు ముందు గ్రహాల ప్రత్యేక కలయిక వల్ల అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. ఈసారి దీపావళి నవంబర్ 8న రానుండగా, ఆన్‌లైన్ జ్యోతిష్య నిపుణుల అంచనాల ప్రకారం సెప్టెంబర్ చివరి నాటికి 'లక్ష్మీనారాయణ రాజయోగం' ఆవిర్భవించనుంది. మూడు ప్రధాన గ్రహాల గమనం మరియు వాటి వక్రదృష్టి ఆధారంగా కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనుంది. అలాగే ఇదే సమయంలో రాహువు రాశి మార్పు కూడా జరగబోతుండటంతో జ్యోతిష్య రంగంలో ఈ కాలానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.

లక్ష్మీనారాయణ రాజయోగం ఎప్పుడు ఏర్పడుతుంది?
సౌభాగ్యానికి, సంపదకుకారకులైన శుక్రుడు, బుధుడు తులా రాశిలోకి ప్రవేశించినప్పుడు లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 28 నుంచి ఈ యోగం ప్రారంభం కానుంది. సాధారణంగా ఈ యోగం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. అయితే అక్టోబర్ 3న శుక్రుడు వక్రగతిలోకి మారుతుండటంతో ఈ యోగంలో కొన్ని మార్పులు వస్తాయి. అలాగే అక్టోబర్ 24, 2026న బుధుడు కూడా వక్రమార్గాన్ని పట్టనున్నారు. అయినప్పటికీ, దీపావళికి ముందు వచ్చే ఈ కీలక కాలం వ్యాపారం, ధనార్జన, ఉన్నత విజయాల కోసం ఎదురుచూసే వారికి ఎంతో లాభదాయకంగా మారుతుంది.
కన్యా రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు
కన్యా రాశి వారికి ఈ రాజయోగం ద్వారా భారీగా ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. మీ ఆర్థిక పరిస్థితిలో మెరుగైన వాతావరణం ఏర్పడి, మీ సంపాదనను గరిష్ట స్థాయికి చేర్చుకునే అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అయితే ఎలాంటి పెద్ద పెట్టుబడులు పెట్టేటసపటికైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
వృషభ రాశి వారికి వ్యాపార లాభాలు
వృషభ రాశి వారికి దీపావళి పండుగకు ముందే కీలకమైన వ్యాపార ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. దీనివల్ల మీ వ్యాపారం పుంజుకుంటుంది. అయితే ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా ఎక్కడైనా డబ్బును గుడ్డిగా పెట్టుబడి పెడితే, దాన్ని వెనక్కి తీసుకోవడం కష్టమవుతుంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మీ ఆదాయ ప్రవాహం నిరంతరం కొనసాగుతుంది. ఈ సమయం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది.
మకర రాశి వారికి ధనలాభం
మకర రాశి వారికి ఈ గోచర కాలంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. ఊహించని ధనలాభం కలుగుతుంది.
సింహ రాశికి సానుకూల మార్పులు
మరోవైపు సింహ రాశి వారికి ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ కాలంలో అన్ని విషయాలు సానుకూలంగా సాగిపోతాయి. జీవితంలో నూతన ఉత్సాహం సంతరించుకుంటుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


