...
...
Next Story

Late Marriage Remedies: జాతకంలో ఈ దోషాల వలన పెళ్ళి ఆలస్యం అవుంతుంది.. కారణాలు, పరిష్కారాలు తెలుసుకోండి!

Late Marriage Remedies: ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించాలని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు కొన్ని దోషాల వలన పెళ్లి కుదరదు. జాతకంలో ఇలాంటి పరిస్థితులు ఉంటే పెళ్లి విషయంలో ఇబ్బందులు వస్తాయి. రాహువు, కేతువు, కుజుడు, శని వలన కూడా ఆటంకాలు ఉండొచ్చు. అలాంటప్పుడు కొన్ని పరిహారాలను పాటించాలి.

Published on: Apr 7, 2026, 15:30:25 IST
Advertisement

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. కానీ కొంత మంది ప్రేమించిన వ్యక్తికి దూరమైపోవడం, ఎంతో కాలం నుంచి ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరకపోవడం వంటి పరిస్థితులు చూస్తూ ఉంటారు. కొన్ని జ్యోతిష్య కారణాల వలన ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చు. పెళ్లి కుదరకపోవడం లేదా పెళ్లి విషయంలో పదే పదే ఏదో ఒక ఆటంకం రావడం, పెళ్లి ఆలస్యం అవ్వడం వంటివి చూస్తున్నట్లయితే, ఇది కచ్చితంగా మీరు తెలుసుకోవాలి.

Late Marriage Remedies: జాతకంలో ఈ దోషాల వలన పెళ్ళి ఆలస్యం అవుంతుంది (pinterest)
Late Marriage Remedies: జాతకంలో ఈ దోషాల వలన పెళ్ళి ఆలస్యం అవుంతుంది (pinterest)

చాలా సార్లు కొంత మందికి పెళ్లి ఆలస్యం అవుతూ ఉంటుంది. జ్యోతిష్యం ప్రకారం గ్రహాల స్థానం బట్టి ప్రతి మనిషిపై ప్రభావం పడుతుంది. అలాంటప్పుడు కొన్ని పరిహారాలను పాటించడం ప్రయోజనకరంగా ఉంటుంది. సరిగ్గా పరిహారాలను పాటించినట్లయితే కోరుకున్న వ్యక్తి జీవితంలోకి వస్తారు. పెళ్లికి సంబంధించిన ఆటంకాలు, సమస్యలు తొలగిపోతాయి.

అసలు ఎందుకు పెళ్లి ఆలస్యం అవుతుంది?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే జాతకంలో ఏడవ ఇల్లు పెళ్లికి సంబంధించినది. శని, కుజుడు, రాహువు లేదా కేతువు ఈ స్థానంలో ఉన్నట్లయితే పెళ్లిలో ఆటంకాలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. రిలేషన్‌షిప్‌లో కూడా ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా శని ప్రభావం వలన చాలా మంది పెళ్లిళ్లు ఆలస్యం అవుతాయి.

ఏడవ ఇంట్లో శని ఉన్నట్లయితే పెళ్లి చాలా ఆలస్యం అవుతుంది. అలాగే బలహీనమైన లేదా సరికాని స్థానాల్లో శుక్రుడు, గురువు, కుజుడు ఉన్నట్లయితే పెళ్లిలో ఆటంకాలు వస్తాయి. ముఖ్యంగా మగవారి జాతకంలో ఇలా ఉన్నట్లయితే పెళ్లి చాలా ఆలస్యం అవుతుంది. కుజ దోషం వలన కూడా పెళ్లిళ్లు ఆలస్యం అవుతాయి. కుజుడు జాతకంలో ఒకటి, నాలుగు, ఏడు, ఎనిమిది, 12వ స్థానంలో ఉన్నట్లయితే పెళ్లిళ్లు బాగా ఆలస్యం అవుతాయి.

పెళ్లిలో అడ్డంకులు తొలగి, పెళ్లి త్వరగా జరగాలంటే ఏమి చేయాలి?

జాతకంలో గురువు స్థానాన్ని బలపరచడానికి పసుపు రంగు వస్తువులను దానం చేయండి. అరటి పండ్లు, పసుపు వంటివి దానం చేయొచ్చు. దీంతో పెళ్లిలో ఉన్న ఆటంకాలు, సమస్యలు తొలగిపోతాయి.

ఒకవేళ శని కారణంగా పెళ్లి ఆలస్యం అవుతున్నట్లయితే, ఆవాల నూనెతో దీపం వెలిగించి శనివారం నాడు రావి చెట్టు కింద దీపాన్ని దానం చేయండి. దీంతో శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే అవసరమైన వారికి సహాయం చేయడం వలన కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. అడ్డంకులు, ఆటంకాలు తొలగిపోతాయి.

ఎక్కువ కాలం నుంచి పెళ్లి అవ్వక ఇబ్బంది పడుతున్నట్లయితే జ్యోతిష నిపుణుల సలహా తీసుకుని జాతకాన్ని చూపించుకోండి. పండితులు చెప్పిన పరిహారాలను పాటిస్తే కూడా ఇబ్బందులు, ఆటంకాలు తొలగిపోతాయి. కళ్యాణం జరుగుతుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe