సూర్య, గురువుల కేంద్ర దృష్టి యోగం.. ఈ రాశులకు సమస్యలు.. జాగ్రత్త సుమా!
గ్రహాల సంయోగం వలన కొన్నిసార్లు శుభ ఫలితాలు కలిగితే కొన్నిసార్లు అశుభ ఫలితాలు కలుగుతాయి. ఏప్రిల్ 9న సూర్యుడు, గురువు 90 డిగ్రీల దూరంలో ఉంటారు. ఈ సమయంలో కేంద్ర దృష్టి యోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి సమస్యలను తీసుకొస్తుంది. మరి ఏ రాశి వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాలి?
కొన్ని కొన్ని సార్లు గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు, గ్రహాల సంయోగాన్ని కూడా చూస్తూ ఉంటాం. మరో మూడు రోజుల్లో, అంటే ఏప్రిల్ 9న, సూర్యుడు, గురువు 90 డిగ్రీలలో ఉంటారు. ఇది కేంద్ర దృష్టి యోగానికి దారి తీస్తుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితంలో మార్పులు జరగబోతున్నాయి. ఈ యోగం 12 రాశుల వారిపై ప్రభావం చూపించినా, కొన్ని రాశుల వారు సమస్యలతో బాధ పడచ్చు. మరి కేంద్ర యోగం ఏ రాశి వారికి ఇబ్బందులను తీసుకు రాబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

సూర్యుడు ఆత్మవిశ్వాసం, అధికారం, ప్రతిష్ట, ఆరోగ్యం, నాయకత్వం, ప్రభుత్వ సంబంధాలు మొదలైన వాటికి కారకుడు. గురువు జ్ఞానం, విద్య, సంపద, ఐశ్వర్యం, ధర్మం, ఆధ్యాత్మికత, వివాహం, అదృష్టం వంటి వాటికి కారకుడు. ఈ రెండు గ్రహాలు 90 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు ఈ కేంద్ర దృష్టి యోగం ఏర్పడుతుంది. ఇది ఏప్రిల్ 9న వస్తోంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశులకు సమస్యలు ఏర్పడ్డాయి. మరి ఈ సమయంలో ఏ రాశులకు సమస్యలు రానున్నాయి చూద్దాం.
సూర్య, గురువుల కేంద్ర దృష్టి యోగం.. ఈ రాశుల వారికి చిన్నపాటి సమస్యలు
1.మేష రాశి:
మేష రాశి వారికి ఈ సమయంలో ఇబ్బందులు ఉండచ్చు. ఈ యోగంతో ఈ రాశి వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. కోపం కాస్త పెరిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యమైన డాక్యుమెంట్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రశాంతంగా పనిచేస్తే మాత్రం సానుకూల మార్పులను చూడొచ్చు.
2.వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ సమయంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు గ్రహాల సంయోగం వలన ఏర్పడే యోగం అశుభ ఫలితాలను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అనవసరంగా డబ్బును వృథా చేయకండి. ఎవరికీ డబ్బును అప్పుగా ఇవ్వడం మంచిది కాదు. డబ్బును ఆలోచించి ఖర్చు పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి.
3.సింహ రాశి:
సింహ రాశి వారికి కూడా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ పేరు, ప్రతిష్టలు దెబ్బ తినే అవకాశం ఉంది. కెరీర్‌లో కూడా చిన్నపాటి ఇబ్బందులు వస్తాయి. ప్రశాంతంగా, సహనంతో పని చేస్తే బాగా కలిసి వస్తుంది. సమస్యలను జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి.
4.వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి కూడా చిన్నపాటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. రెగ్యులర్‌గా యోగా, ధ్యానం వంటి వాటిని ఫాలో అవ్వండి.
5.కుంభ రాశి:
కుంభ రాశి వారికి కూడా ఈ యోగం వలన చిన్నపాటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి పెరుగుతుంది. పనిలో అడ్డంకులు ఉండొచ్చు. ఉద్యోగం మారాలని ఆలోచన రావచ్చు. తోబుట్టువులతో కూడా చిన్నపాటి ఇబ్బందులు వస్తాయి. ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


