...
...
Next Story

Lord Hanuman: అష్టసిద్ధి నవనిధి కే దాత.. హనుమంతుడి అష్ట సిద్ధులు, నవ నిధులు.. భక్తులకు లభించే ఆ అపార శక్తుల రహస్యమేంటి?

Lord Hanuman: "అష్ట సిద్ధి నవ నిధి కే దాతా.." అని మనం హనుమాన్ చాలీసాలో చదువుతుంటాం. అసలు ఆ అష్ట సిద్ధులు, నవ నిధులు అంటే ఏమిటి? వీటిని హనుమంతుడు ఎప్పుడు ఉపయోగించాడు? హనుమంతుడికి ఆ శక్తులు ఎలా లభించాయి? వాటి పూర్తి వివరాలు మీకోసం.

Published on: May 12, 2026, 09:35:36 IST
Advertisement

హనుమాన్ చాలీసాలో మనం “అష్టసిద్ధి నవనిధి కే దాత” అనే చదువుతాము. అసలు దాని అర్థం ఏంటి? అసలు అష్టసిద్ధులు, నవనిధులు అంటే ఏంటి? హనుమంతుడికి ఈ శక్తులు ఏ విధంగా లభించాయి? వాటి తాలూకా వివరాలను ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం.

అపారమైన భక్తి, తిరుగులేని శక్తి..

Lord Hanuman: అష్టసిద్ధి నవనిధి కే దాత.. హనుమంతుడి అష్ట సిద్ధులు, నవ నిధులు.. (pinterest)
Lord Hanuman: అష్టసిద్ధి నవనిధి కే దాత.. హనుమంతుడి అష్ట సిద్ధులు, నవ నిధులు.. (pinterest)

హనుమంతుడంటే మొట్టమొదట మనకి గుర్తొచ్చేది ఇవే. హనుమంతుడిని ఆరాధించడం వలన ధైర్యంతో పాటు సకల కార్యసిద్ధి కలుగుతుందని అందరూ నమ్ముతారు. హనుమాన్ చాలీసాలో ''అష్టసిద్ధి నవనిధి కే దాత, అస్ బర్ దీన్ జానకీ మాతా'' అనే పంక్తులు కనిపిస్తాయి. జానకి మాత అంటే సీతాదేవి. సీతాదేవి అనుగ్రహం వలన హనుమంతుడు ఎనిమిది సిద్ధులకు అధిపతి అయ్యాడని ఈ పంక్తుల అర్థం. అయితే ఇప్పుడు సనాతన ధర్మం ప్రకారం ఈ అష్టసిద్ధులు, నవనిధులు ఏవి అనే విషయాన్ని తెలుసుకుందాం.

అష్టసిద్ధులు అంటే ఏంటి? వీటిని హనుమంతుడు ఎప్పుడు ఉపయోగించాడు?

యోగశాస్త్రం ప్రకారం చూసినట్లయితే, సిద్ధులు అంటే అసాధారణమైన శక్తులు. హనుమంతుడు వీటిని ఇష్టానుసారంగా ప్రయోగించగలుగుతాడు. మరి ఇక ఈ అష్టసిద్ధుల గురించి తెలుసుకుందాం.

1.అణిమ:

అణిమ అంటే శరీరాన్ని చిన్న అణువు అంత పరిమాణంలోకి మార్చుకోగలిగే శక్తి. లంకలోకి ప్రవేశించినప్పుడు హనుమంతుడు దీనిని ఉపయోగించాడు.

2.మహిమ:

శరీరాన్ని ఎంత పెద్ద పరిమాణానికైనా విస్తరింపజేసే శక్తిని మహిమ అంటారు. సముద్రాన్ని దాటేటప్పుడు సురస అనే రాక్షసి ముందు ఈ రూపాన్ని హనుమంతుడు ప్రదర్శించాడు.

3.గరిమ:

శరీరాన్ని బాగా బరువుగా మార్చుకోవడమే గరిమ. భూమి కూడా మోయలేనంత బరువుగా హనుమంతుడు ఈ శక్తితో మారగలడు. మహాభారతంలో భీముని గర్వాన్ని అణచివేయడానికి హనుమంతుడు తన తోకను గరిమ సిద్ధితో బరువుగా మార్చేశాడు.

4.లఘిమ:

ఎక్కడికైనా క్షణాల్లో చేరుకోగలగడమే ప్రాప్తి శక్తి. ఈ సిద్ధితో పశు, పక్ష్యాదుల భాషను కూడా అర్థం చేసుకోగలరు.

6.ప్రాకామ్యం:

మనసులో అనుకున్నది సాధించగలగడం, భూమి లోపలికి వెళ్లిపోవడం, ఆకాశంలోకి వెళ్లిపోవడం లాంటివి ఈ శక్తి కిందకి వస్తాయి.

7.ఈశిత్వం:

ఈశిత్వం అంటే దైవత్వ శక్తి. అంటే ప్రకృతిని కూడా అధీనంలోకి తీసుకోగలగడం.

8.వశిత్వం:

ఎవరినైనా వశం చేసుకోగలే శక్తి. ఇంద్రియాలను జయించి పూర్తిగా మనసును అదుపులో ఉంచుకోవడమే ఇది.

నవనిధులు అంటే ఏంటి? భక్తులకు హనుమంతుడు ఏమి ఇవ్వగలడు?

కుబేరుడి దగ్గర ఉండే తొమ్మిది రకాల సంపదలను నవనిధులు అని అంటారు. సీతాదేవి ఇచ్చిన వరంతో హనుమంతుడు వీటిని భక్తులకు ఇవ్వగలడు.

1.మహాపద్మ నిధి:

దీని కారణంగా వంశం గొప్పగా అభివృద్ధి చెందగలదు. సాత్వికమైన సంపద ఇది.

2.పద్మ నిధి:

స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు, రత్నాలు లాంటి సంపద కూడా హనుమాన్ తన భక్తులకు ఇవ్వగలడు.

3.శంఖ నిధి:

శంఖం లాంటి ఐశ్వర్యాన్ని హనుమంతుడు ఇవ్వగలడు.

4.మకర నిధి:

ఆయుధ విజ్ఞానం, అపారమైన ధైర్యాన్ని ఇచ్చే సంపద ఇది.

5.కచ్ఛప నిధి:

భూములు, వాహనాలు వంటి సంపదలను హనుమంతుడు ఈ నిధి ద్వారా భక్తులకు ఇవ్వగలడు.

6.ముకుంద నిధి:

కళలు, సంగీతం, విజ్ఞానంపై పట్టు తీసుకువచ్చే సంపద ఇది.

7.కుంద నిధి:

వ్యాపారాల్లో లాభాలను తీసుకువచ్చే ఐశ్వర్యం.

8.నీల నిధి:

అన్ని రకాల సుఖభోగాలను హనుమంతుడు నీల నిధి ద్వారా భక్తులకు ప్రసాదించగలడు.

9.ఖర్వ నిధి:

శత్రువుల నుంచి రక్షణను కల్పించగలదు. ఎదురులేని విజయాన్ని ఈ నిధి ద్వారా భక్తులకు ప్రసాదించగలడు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe