శ్రీరాముడి అనుగ్రహం ఈ రాశుల వారిపై ఎప్పుడూ ఉంటుంది.. అందుకే కష్టాలను కూడా సులువుగా దాటేస్తారు!
శ్రీరాముడికి కొన్ని రాశులతో దగ్గర సంబంధం ఉంటుంది. ఈ రాశుల వారు ఎప్పుడూ కూడా శ్రీరాముని అనుగ్రహాన్ని పొందుతారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? శ్రీరాముని అనుగ్రహంతో ఎప్పుడూ సంతోషంగా, కష్టాలు లేకుండా జీవించే రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనకి మొత్తం 12 రాశులు ఉన్నాయి. రాశుల ఆధారంగా అనేక విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా మనిషి తీరు, ప్రవర్తనతో పాటు భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. ప్రతి దేవుడు కూడా ఏదో ఒక రాశిలో జన్మిస్తారని నమ్ముతాము. దేవుళ్లు జన్మించిన రాశుల్లో జన్మించిన మానవులకు ఆ దేవుని ఆశీస్సులు కలుగుతాయని, సంతోషంగా ఉండొచ్చని, వారి అనుగ్రహంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంటారు.

శ్రీరాముడికి కొన్ని రాశులతో దగ్గర సంబంధం ఉంటుంది. ఈ రాశుల వారు ఎప్పుడూ కూడా శ్రీరాముని అనుగ్రహాన్ని పొందుతారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? శ్రీరాముని అనుగ్రహంతో ఎప్పుడూ సంతోషంగా, కష్టాలు లేకుండా జీవించే రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అదృష్ట రాసుల్లో మీరూ ఒకరేమో చూసేయండి.
శ్రీరాముడి అనుగ్రహం ఈ రాశుల వారిపై ఎప్పుడూ ఉంటుంది.. అందుకే కష్టాలు రావు
1.తులా రాశి:
తులా రాశి వారు ఎప్పుడూ శ్రీరాముని అనుగ్రహంతో ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఆర్థికపరంగా లాభాలను పొందుతారు. ఎలాంటి కష్టమైన పరిస్థితులు వచ్చినా సరే వారికి అనుకూలంగా మారతాయి. ఆ రామయ్య దయతో ఎల్లప్పుడూ ఈ రాశి వారు సుఖ సంతోషాలతో ముందుకు వెళ్తారు.
2.కుంభ రాశి:
కుంభ రాశి వారు కూడా శ్రీరాముని అనుగ్రహం కలిగి ఉంటారు. ఈ రాశి వారు కూడా రామయ్య అనుగ్రహంతో అనేక లాభాలను పొందుతారు. కెరీర్ పరంగా విజయాలను అందుకుంటారు. కష్టమైన పరిస్థితుల్లో కూడా లాభాలను పొందుతారు. ఆరోగ్యం కూడా ఎప్పుడూ బాగుంటుంది. ఆనందంగా ఉంటారు.
3.మిథున రాశి:
మిథున రాశి వారికి కూడా రామయ్య అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రాశి వారు ఎప్పుడూ అద్భుతమైన లాభాలను పొందుతారు. అంతేకాదు, సమాజంలో కూడా మంచి పేరు, ప్రతిష్టలను పొందుతారు. మిథున రాశి అంటే శ్రీరాముడికి మహా ప్రీతి.
4.కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారిపై కూడా రామయ్య అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రాశి వారు ఎప్పుడూ అదృష్టాన్ని పొందుతారు. అనేక విజయాలను అందుకుంటారు. ఈ రాశి వారు ఉద్యోగాల్లో కూడా మంచి స్థానాన్ని పొందుతారు. కుటుంబ పరంగా కూడా సంతోషంగా ఉంటారు. రామయ్య అనుగ్రహంతో దేనికి లోటు ఉండదు. సంతోషంగా జీవిస్తారు.
నిరాకరణ: ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము చెప్పుకోము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంఖ్యా నిపుణుడిని సంప్రదించండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


