Lucky Zodiac Signs: అత్తింటి దశ మార్చే అదృష్ట రాశి అమ్మాయిలు వీరే! పెళ్లయ్యాక ఐశ్వర్యం తాండవించాల్సిందే..

Lucky Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొందరు అమ్మాయిలు అడుగుపెట్టిన వేళావిశేషం వల్ల అత్తింటికి అపారమైన అదృష్టం కలుగుతుంది. ముఖ్యంగా సింహ, మేష, కన్య వంటి 5 రాశుల అమ్మాయిలు అత్తారింట్లో అడుగు పెట్టగానే అక్కడ ఉన్న దారిద్య్రం తొలగిపోయి, సిరిసంపదలు వెల్లివిరుస్తాయి.

Published on: Apr 23, 2026, 15:00:12 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Lucky Zodiac Signs: మనకి మొత్తం 12 రాశులు ఉన్నాయి. రాశుల ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి పేరు, ప్రవర్తన ఎలా ఉన్నాయో తెలుసుకోవడంతో పాటు, భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు.

Lucky Zodiac Signs: అత్తింటి దశ మార్చే అదృష్ట రాశి అమ్మాయిలు వీరే! (pinterest)
Lucky Zodiac Signs: అత్తింటి దశ మార్చే అదృష్ట రాశి అమ్మాయిలు వీరే! (pinterest)

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అనేక మార్పులు వస్తూ ఉంటాయి. ఈ రాశుల అమ్మాయిల్లో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. వీరి వెంటే అదృష్టం ఉంటుంది. ముఖ్యంగా పుట్టింట్లో అదృష్టాన్ని పంచకపోయినా, అత్తింటి వారికి మాత్రం ఈ రాశుల వారు వెలుగులను తీసుకువస్తారు. అత్తవారింటికి అడుగు పెట్టగానే ఈ రాశుల అమ్మాయిల కష్టాలు తీరిపోతాయి. ఐశ్వర్యం కూడా పెరుగుతుంది. మరి అదృష్ట రాశులు ఎవరో, ఈ రాశులలో మీరు ఒకరేమో చూసుకోండి.

అత్తింటికి వెళ్లగానే ఈ రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది.. కష్టాలు తొలగిపోయి, ఐశ్వర్యం కలుగుతుంది

1.సింహ రాశి:

సింహ రాశి అమ్మాయిలు అత్తవారింటికి అడుగుపెట్టగానే ఆ ఇల్లు కళకళలాడుతుంది. ఈ రాశి అమ్మాయిలు అత్తవారిని గౌరవించడమే కాదు, కుటుంబ పరువు కోసం దేనికైనా సిద్ధంగా ఉంటారు. పేరు, ప్రతిష్టలను తీసుకువస్తారు. అత్తింటి వారికి అదృష్టాన్ని కూడా తీసుకువస్తారు. పెళ్లి తర్వాత ఈ రాశి అమ్మాయిల సంపద కూడా పెరుగుతుంది. ఈ రాశి అమ్మాయిల్లో నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

2.మేష రాశి:

మేష రాశి అమ్మాయిలు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. వీరు అత్తవారింటికి అడుగు పెట్టిన తర్వాత వారి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రాశి అమ్మాయిలకు సోమరితనం కూడా ఉండదు. కష్టపడి పని చేస్తారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కూడా నిరంతరం శ్రమిస్తారు. వీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.

3.కన్యా రాశి:

కన్యా రాశి అమ్మాయిల అదృష్టం కూడా పెళ్లి తర్వాత ఒక్కసారిగా మారిపోతుంది. ఈ రాశి అమ్మాయిలు ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోగలరు. ఇంటిని బాగా చక్కదిద్దుతారు. అలాగే ఈ రాశి అమ్మాయిలు ఏ ఇంటికి అయితే అడుగు పెడతారో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. దరిద్రం తొలగిపోయి ఆనందంగా ఉంటారు.

4.మకర రాశి:

మకర రాశి అమ్మాయిలు క్రమశిక్షణతో ఉంటారు. బాధ్యతలను మోయడంలో వీరు తర్వాతే ఎవరైనా. అత్తింటి వారికి ఈ రాశి అమ్మాయిలు అదృష్టాన్ని తీసుకువస్తారు. అత్తింటిని కూడా సొంత కుటుంబంలా భావిస్తారు. అందరితో ఇట్టే కలిసిపోతారు. వీరి అడుగుతో ఒక్కసారిగా అత్తింటి వారి దశ మారిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అత్తింటి వారికి బాగా లాభాలు కూడా కలుగుతాయి.

5.కుంభ రాశి:

కుంభ రాశి వారు చాలా తెలివైన వారు, ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఈ రాశి అమ్మాయిలు ఎలా పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయో అర్థం చేసుకోగలరు. డబ్బును బాగా పొదుపు చేస్తారు. బాగా డబ్బును సంపాదిస్తారు. వీరి రాకతో ఒక్కసారిగా అత్తింటి వారి పరిస్థితి మారిపోతుంది. అదృష్టం, సంపదతో నిండిపోతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More