Guru Pushya Yogam: ఈరోజు గంగా సప్తమి వేళ గురు పుష్య యోగం.. అరుదైన అదృష్టం.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు!

Guru Pushya Yogam: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత పవిత్రమైన 'గురు పుష్య యోగం' ఈరోజు (ఏప్రిల్ 23, 2026) వచ్చింది. గంగా సప్తమి వంటి పర్వదినం కూడా తోడవడంతో దీని శక్తి రెట్టింపు అయింది. ఈ అరుదైన యోగం వల్ల ధనుస్సు, మేషం, కర్కాటక, సింహ రాశుల వారికి ధన యోగంతో పాటు కెరీర్‌లో భారీ మార్పులు రానున్నాయి.

Published on: Apr 23, 2026, 10:01:07 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గురు పుష్య యోగం అనేది చాలా శక్తివంతమైన యోగం. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా ముఖ్యమైన యోగాలలో ఇది కూడా ఒకటి. ఈ ప్రత్యేకమైన యోగం గురువారం పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు వస్తుంది. ఇది అనంతమైన సంపదను తీసుకురావడానికి సహాయపడుతుంది. కొన్ని ముఖ్యమైన పనులను మొదలుపెట్టడానికి కూడా ఇది చాలా మంచిది.

Guru Pushya Yogam: ఈరోజు గంగా సప్తమి వేళ గురు పుష్య యోగం.. అరుదైన అదృష్టం (pinterest)
Guru Pushya Yogam: ఈరోజు గంగా సప్తమి వేళ గురు పుష్య యోగం.. అరుదైన అదృష్టం (pinterest)

గురు పుష్య యోగం

ఈ యోగం వలన ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి. సక్సెస్‌ను అందుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్లు చేస్తే బాగా కలిసి వస్తుంది. అలాగే అదృష్టం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈరోజు గురు పుష్య యోగం ఉండడం చాలా విశేషమైనది. ఈరోజు గురువారం, పుష్యమి నక్షత్రంతో పాటు గంగా సప్తమి కూడా ఉంది. ఈ ఏడాది గురు పుష్య యోగం మళ్లీ మే 21, జూన్ 18న రాబోతున్నాయి. ఈరోజు గురు పుష్య యోగం ఏ రాశుల వారికి కలిసి రాబోతోంది, ఎవరికి విపరీతమైన అదృష్టం, సంపద కలుగుతాయో ఇప్పుడే తెలుసుకుందాం. మరి ఈ అదృష్ట రాశుల్లో మీరు ఉన్నారేమో చూసుకోండి.

ఈరోజు గురు పుష్య యోగం.. నాలుగు రాశుల వారికి విపరీతమైన లాభాలు:

1.ధనుస్సు రాశి:

ధనుస్సు రాశి వారికి ఈ యోగం చాలా శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఆర్థిక పరంగా కూడా ఈ రాశి వారికి కలిసి రాబోతోంది. ఆర్థిక స్థిరత్వాన్ని చూస్తారు. ఈ రాశికి అధిపతి గురువు కావడంతో, ఈ యోగం వలన ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. పెండింగ్‌లో ఉన్న టాస్కులు కూడా పూర్తవుతాయి. అదృష్టం కూడా మీ వెంటనే ఉంటుంది.

2.మేష రాశి:

మేష రాశి వారికి ఈ రోజు గురు పుష్య యోగం సానుకూల మార్పులను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కావాల్సిన ముఖ్యమైన వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన ప్రాజెక్టులను కూడా సమయానికి పూర్తిచేస్తారు. కొత్త ప్రాజెక్టులను చేపట్టే అవకాశం కూడా ఉంది.

3.కర్కాటక రాశి:

ఈరోజు కర్కాటక రాశి వారికి గురు పుష్య యోగం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారు ఆర్థిక పరంగా లాభాలను పొందుతారు. సానుకూల మార్పులను చూస్తారు. ఉద్యోగస్తులకు కూడా ఇది శుభ సమయం. ఈ యోగంతో చంద్రుడికి సంబంధం ఉంటుంది కాబట్టి, ఈ రాశి వారు మానసిక ప్రశాంతతను కూడా పొందుతారు.

4.సింహ రాశి:

సింహ రాశి వారు గురు పుష్య యోగం వలన సక్సెస్‌ను అందుకుంటారు. గౌరవాన్ని పొందుతారు. సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం కూడా పెరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఈ సమయంలో పెరుగుతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More