తొమ్మిది రోజులు పాటు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటాము. అందులో 9వ రోజు మహా నవమి. శరన్నవరాత్రులలో ప్రధానమైనది. మహానవమి రోజు అమ్మవారిని ఆరాధించాలి. ఈ తొమ్మిది రోజులు పూజలు చేయలేని వారు సప్తమి నుంచి మూడు రోజులపాటు పూజలు చేస్తారు. అది కూడా కుదరకపోతే మహానవమి రోజున అమ్మవారిని ఆరాధిస్తారు. విజయదశమి పునః పూజ మాత్రమే చేయాలి. నవమి రోజు పూజ చేస్తేనే దశమి రోజు పునః పూజను చేయాలి.
మహానవమి విశిష్టత

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా దేవీ నవరాత్రుల ఉత్సవాలను జరుపుకుంటాము. నవరాత్రుల్లో చివరి రోజు శుక్ల నవమిని మహానవమి అంటారు. మహానవమి నాడు అమ్మవారికి ఇష్టమైన పిండివంటలతో పాటు చెరకు గడలను కూడా నైవేద్యంగా సమర్పిస్తారు.
తెలంగాణలో బతుకమ్మ పూజ
తెలంగాణలో మహానవమి నాడు బతుకమ్మ పూజ చేస్తారు. అలాగే సరస్వతీ ఉద్యాపన చేయడం జరుగుతుంది. కేరళ రాష్ట్రంలో నవమి నాడు ఆయుధ పూజ చేస్తారు.
మహానవమి నాడు ఆలయాలు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయి ఉంటాయి. ఉజ్జయిని, కలకత్తా, విజయవాడ వంటి ప్రాంతాల్లో ఉన్న కనకదుర్గ ఆలయాలకు దూరదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు.
మహిషాసుర మర్దిని రూపం
ఈరోజు అమ్మవారిని మహిషాసుర మర్దిని రూపంలో ఆరాధించాలి. మహిషాసురుడు అనే రాక్షసుడి కారణంగా తీవ్రమైన కష్టాలు పడుతున్న దేవతలు, మహిషాసురుడిపై కోపంతో తమ శరీరాల్లోంచి దివ్య తేజస్సులను బయటకు ప్రసరింపజేశారు.
తర్వాత ఆ తేజస్సులన్నీ ఒక దివ్య తేజోమూర్తిగా ఆవిర్భవించడం జరిగింది. ఆ స్వరూపానికి దేవతలు ఆయుధాలను సమర్పించారు. హిమవంతుడు సింహాన్ని ఆమెకు వాహనంగా ఇవ్వడం జరిగింది.
సింహ వాహనంపై ఆ శక్తి మహిషాసురుడి సేనాధిపతులైన శిక్షుడు మొదలైన రాక్షసులను సంహరించి, చివరిగా మహిషాసురుడిని కూడా సంహరిస్తుంది. ఆ తర్వాత ఆ దేవి స్వరూపంతో ఇంద్రకీలాద్రిపై వెలసిందని పురాణాలు తెలుపుతున్నాయి.
ఈరోజు ఏ రంగు పూలు, ఏ రంగు వస్త్రాలు సమర్పించాలి?
{{/usCountry}}సింహ వాహనంపై ఆ శక్తి మహిషాసురుడి సేనాధిపతులైన శిక్షుడు మొదలైన రాక్షసులను సంహరించి, చివరిగా మహిషాసురుడిని కూడా సంహరిస్తుంది. ఆ తర్వాత ఆ దేవి స్వరూపంతో ఇంద్రకీలాద్రిపై వెలసిందని పురాణాలు తెలుపుతున్నాయి.
ఈరోజు ఏ రంగు పూలు, ఏ రంగు వస్త్రాలు సమర్పించాలి?
{{/usCountry}}ఈరోజు అమ్మవారికి ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని సమర్పించి, వివిధ రకాల పూలతో పూజిస్తే మంచిదని భావిస్తారు. నైవేద్యంగా గారెలు, చక్కెర పొంగలి సమర్పించాలి.
చివరి రోజు విజయదశమి నాడు మహా సంతోషంగా సాగుతుంది. చెడును జయించిన మంచిని విజయవంతంగా జరుపుకుంటాము కనుక దీనిని విజయదశమి అంటారు. కొన్ని ప్రాంతాల్లో విజయదశమిని అపరాజిత దశమి అని కూడా అంటారు.
దశమి నాడు శమీ పూజ
అర్జునుని గాండీవంతో పాటు పాండవుల ఆయుధాలు అన్నీ కూడా శమీ వృక్షంలో దాచడం జరిగింది... అలానే రాముడు కూడా విజయయాత్రకు బయలుదేరేటప్పుడు జమ్మి పూజ చేస్తాడు. విజయదశమి రోజు శమీ పూజ చేస్తే విజయాలు చేకూరుతాయని, మంచి జరుగుతుందని నమ్మకం.