దసరా పండుగలో మహానవమి, విజయదశమి ఎందుకు ప్రత్యేకం? తెలుసుకోవాల్సిన విషయాలివే!

శరన్నవరాత్రుల్లో మహానవమి, విజయదశమి రోజులకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. మహానవమి నాడు అమ్మవారిని మహిషాసుర మర్దిని రూపంలో ఆరాధించి, పిండివంటలు, చెరకు గడలు, గారెలు, చక్కెర పొంగలి వంటి నైవేద్యాలను సమర్పిస్తారు.  

Published on: Oct 19, 2026, 08:32:38 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తొమ్మిది రోజులు పాటు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటాము. అందులో 9వ రోజు మహా నవమి. శరన్నవరాత్రులలో ప్రధానమైనది. మహానవమి రోజు అమ్మవారిని ఆరాధించాలి. ఈ తొమ్మిది రోజులు పూజలు చేయలేని వారు సప్తమి నుంచి మూడు రోజులపాటు పూజలు చేస్తారు. అది కూడా కుదరకపోతే మహానవమి రోజున అమ్మవారిని ఆరాధిస్తారు. విజయదశమి పునః పూజ మాత్రమే చేయాలి. నవమి రోజు పూజ చేస్తేనే దశమి రోజు పునః పూజను చేయాలి.

దసరా పండుగలో మహానవమి, విజయదశమి ఎందుకు ప్రత్యేకం? తెలుసుకోవాల్సిన విషయాలివే! (AI)
దసరా పండుగలో మహానవమి, విజయదశమి ఎందుకు ప్రత్యేకం? తెలుసుకోవాల్సిన విషయాలివే! (AI)

మహానవమి విశిష్టత

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా దేవీ నవరాత్రుల ఉత్సవాలను జరుపుకుంటాము. నవరాత్రుల్లో చివరి రోజు శుక్ల నవమిని మహానవమి అంటారు. మహానవమి నాడు అమ్మవారికి ఇష్టమైన పిండివంటలతో పాటు చెరకు గడలను కూడా నైవేద్యంగా సమర్పిస్తారు.

తెలంగాణలో బతుకమ్మ పూజ

తెలంగాణలో మహానవమి నాడు బతుకమ్మ పూజ చేస్తారు. అలాగే సరస్వతీ ఉద్యాపన చేయడం జరుగుతుంది. కేరళ రాష్ట్రంలో నవమి నాడు ఆయుధ పూజ చేస్తారు.

మహానవమి నాడు ఆలయాలు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయి ఉంటాయి. ఉజ్జయిని, కలకత్తా, విజయవాడ వంటి ప్రాంతాల్లో ఉన్న కనకదుర్గ ఆలయాలకు దూరదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు.

మహిషాసుర మర్దిని రూపం

ఈరోజు అమ్మవారిని మహిషాసుర మర్దిని రూపంలో ఆరాధించాలి. మహిషాసురుడు అనే రాక్షసుడి కారణంగా తీవ్రమైన కష్టాలు పడుతున్న దేవతలు, మహిషాసురుడిపై కోపంతో తమ శరీరాల్లోంచి దివ్య తేజస్సులను బయటకు ప్రసరింపజేశారు.

తర్వాత ఆ తేజస్సులన్నీ ఒక దివ్య తేజోమూర్తిగా ఆవిర్భవించడం జరిగింది. ఆ స్వరూపానికి దేవతలు ఆయుధాలను సమర్పించారు. హిమవంతుడు సింహాన్ని ఆమెకు వాహనంగా ఇవ్వడం జరిగింది.

సింహ వాహనంపై ఆ శక్తి మహిషాసురుడి సేనాధిపతులైన శిక్షుడు మొదలైన రాక్షసులను సంహరించి, చివరిగా మహిషాసురుడిని కూడా సంహరిస్తుంది. ఆ తర్వాత ఆ దేవి స్వరూపంతో ఇంద్రకీలాద్రిపై వెలసిందని పురాణాలు తెలుపుతున్నాయి.

ఈరోజు ఏ రంగు పూలు, ఏ రంగు వస్త్రాలు సమర్పించాలి?

ఈరోజు అమ్మవారికి ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని సమర్పించి, వివిధ రకాల పూలతో పూజిస్తే మంచిదని భావిస్తారు. నైవేద్యంగా గారెలు, చక్కెర పొంగలి సమర్పించాలి.

చివరి రోజు విజయదశమి నాడు మహా సంతోషంగా సాగుతుంది. చెడును జయించిన మంచిని విజయవంతంగా జరుపుకుంటాము కనుక దీనిని విజయదశమి అంటారు. కొన్ని ప్రాంతాల్లో విజయదశమిని అపరాజిత దశమి అని కూడా అంటారు.

దశమి నాడు శమీ పూజ

అర్జునుని గాండీవంతో పాటు పాండవుల ఆయుధాలు అన్నీ కూడా శమీ వృక్షంలో దాచడం జరిగింది... అలానే రాముడు కూడా విజయయాత్రకు బయలుదేరేటప్పుడు జమ్మి పూజ చేస్తాడు. విజయదశమి రోజు శమీ పూజ చేస్తే విజయాలు చేకూరుతాయని, మంచి జరుగుతుందని నమ్మకం.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More