...
...
Next Story

కుజ, చంద్రుల కలయికతో శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగం - ఈ 6 రాశుల వారికి బంపర్ లాభాలు..!

మిథునరాశిలో అంగారకుడు, చంద్రుడి సంయోగంతో శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడింది. ఈ యోగంతో రాబోయే 2 రోజుల్లో 6 రాశుల వారికి అకస్మాత్తుగా బంపర్ ప్రయోజనాలు కలగనున్నాయి.

Published on: Sep 5, 2026, 17:29:17 IST
Advertisement

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి కలయికలకు విశేష ప్రాధాన్యత ఉంది. గ్రహాల సైన్యాధ్యక్షుడైన అంగారకుడు (కుజుడు) మరియు మనస్సుకి కారకుడైన చంద్రుడి జంట అత్యంత శుభప్రదమైనదిగా నిపుణులు భావిస్తారు. ప్రస్తుతం బుధుడి స్వక్షేత్రమైన మిథునరాశిలో కుజుడు కొలువై ఉన్నాడు. ఇదే క్రమంలో, సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం 10:17 గంటలకు చంద్రుడు కూడా మిథునరాశిలోకి ప్రవేశించాడు.

మిథునరాశిలో కుజ, చంద్రుల కలయిక
మిథునరాశిలో కుజ, చంద్రుల కలయిక

మిథునరాశిలో చంద్రుడి ఈ సంచారం సెప్టెంబర్ 7వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇలా ఒకే రాశిలో అంగారకుడు, చంద్రుడు కలవడం వల్ల జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత పవిత్రమైన ‘మహాలక్ష్మి రాజయోగం’ రూపుదిద్దుకుంది.

ఈ శక్తివంతమైన రాజయోగం కారణంగా రాబోయే 2 రోజుల పాటు కొందరికి అపారమైన ఆర్థిక లాభాలు, వ్యాపారంలో అద్భుత పురోగతి లభించనుంది. ప్రసిద్ధ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ మహాలక్ష్మి రాజయోగం ప్రభావంతో విశేష లబ్ధిని పొందుతున్న ఆ 6 అదృష్ట రాశుల వివరాలు ఇక్కడ చూద్దాం….

మేష రాశి:

మేష రాశి అధిపతి అయిన కుజుడు, చంద్రుడితో కలిసి మిథునంలో ఉండటం వల్ల ఈ రాశి వారికి ఎంతో అనుకూలమైన మార్పులు ప్రారంభమవుతాయి. నిలిచిపోయిన పనులు వేగవంతం అవ్వడంతో పాటు సానుకూల ఫలితాలు అందుతాయి.

మిథున రాశి:

స్వయంగా మిథున రాశిలోనే ఈ కలయిక జరుగుతుండటంతో, ఈ రాశి వారికి లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. వ్యాపారంలో భారీ లాభాలు నమోదు కానున్నాయి. ఉద్యోగ, కెరీర్ రంగాల్లో ప్రతిభను చాటుకుని ఉన్నత స్థానాలకు చేరుకుంటారు.

సింహ రాశి:

కన్యా రాశి జాతకులకు ఈ రాజయోగం అద్భుతమైన అవకాశాలను మోసుకొస్తుంది. జీవితంలో పలు శుభవార్తలు వింటారు. సుదీర్ఘకాలంగా ఒంటరిగా ఉన్న వారికి భాగస్వామి లభించే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు భవిష్యత్తుకు దోహదపడతాయి.

ధనుస్సు రాశి:

ధనుస్సు రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం లక్ష్మీ కటాక్షాన్ని అందిస్తుంది. సంతానానికి సంబంధించిన శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా బలోపేతమై, కుటుంబంలో ఆనంద నిలవుతుంది.

మీన రాశి:

మీన రాశి వారికి ఈ గ్రహాల కలయిక ఆరోగ్యం పరంగా ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. పాత అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన, అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks