సింహరాశిలోకి అంగారకుడు.. ఈ రాశుల వారికి ధనలాభం, ఉద్యోగ అవకాశాలు, ప్రేమికులకు శుభవార్తలు!
గ్రహాల సంచారంలో మార్పులు 12 రాశుల జీవితాలపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 12 రాత్రి 8:06 గంటలకు కుజుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నట్లు కథనం పేర్కొంది.
గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి గ్రహాల సంచారం కారణంగా శుభ ఫలితాలు కలిగితే, ఒక్కోసారి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్రహాల కదలిక మానవ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది.

భూమికి పుత్రుడిగా, శక్తికి, సాహసానికి ప్రత్యేకంగా ఉండే అగ్నితత్వ గ్రహం కుజుడి సంచారం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. నవంబర్ 12 రాత్రి 8:06కి కుజుడు సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు.
సింహ రాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడి రాశిలోకి కుజుడు అడుగుపెట్టడంతో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో కొన్ని రాశుల వారు భారీగా లాభాలను పొందుతారు. మరి అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.
సింహరాశిలోకి కుజుడు.. ఈ రాశుల వారికి భారీగా లాభాలు
మేష రాశి:
మేష రాశికి అధిపతి కుజుడు. ఈ సమయంలో ఈ రాశి వారు భారీగా లాభాలను పొందుతారు. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. క్లిష్టమైన నిర్ణయాలను కూడా సులువుగా తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.
విద్యార్థులకు, ఉద్యోగులకు శుభ సమయం. ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న టాస్కులను కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.
మిథున రాశి:
ఈ రాశి వారు కూడా శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి వారికి భారీగా కలిసి వస్తుంది. లక్ష్యాలను సాధించడంలో గ్రహాల గమనం అద్భుతంగా సహకరిస్తుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది.
నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వృత్తిపరంగానే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా శుభవార్తలను వింటారు. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్లకు ప్రేమ వివాహం నిశ్చయమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
సింహ రాశి:
సింహ రాశి వారికి కూడా ఇది అద్భుతమైన సమయం అని చెప్పొచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారు భారీగా లాభాలను పొందుతారు. కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అద్భుతమైన అవకాశం కనబడుతోంది.
చాలా కాలంగా ప్రయాణాలు వాయిదా పడుతున్నట్లయితే, ఆకస్మిక ప్రయాణాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఉన్నవారు కార్యాలయంలో సత్తా చాటుకోవడానికి, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందడానికి ఇది సరైన సమయం. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయమని చెప్పొచ్చు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


