Mars Rise: మే 2న కుజుడి ఉదయం.. ఈ 3 రాశుల వారికి మహర్దశ మొదలు.. ఇక పట్టిందల్లా బంగారమే!

Mars Rise: మే 2న కుజుడి ఉదయం. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలు మనుషుల జీవిత గమనాన్ని మారుస్తుంటాయి. ముఖ్యంగా మే 2వ తేదీన జరగబోయే కుజుడి ఉదయం కొన్ని రాశుల వారికి అపారమైన ధైర్యాన్ని, సంపదను అందించబోతోంది. ఆ అదృష్ట రాశుల వివరాలు మీకోసం.

Published on: Apr 25, 2026, 11:30:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే గ్రహాల కదలిక చాలా ముఖ్యమైనది. కొన్ని సార్లు గ్రహాల కదలికలో మార్పులు శుభ యోగాలని, అశుభ యోగాలని తీసుకొస్తూ ఉంటాయి. ఒక్కో సారి గ్రహాలు ఉదయించడం, అస్తమించడం కూడా చేస్తాయి. మే 2న చూసినట్లయితే కాస్త ప్రత్యేకత అని చెప్పవచ్చు. మే 2న ఉదయిస్తాడు కుజుడు. ధైర్యం, శక్తి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మొదలైన వాటికి కారకుడు కుజుడు. కుజుడు ఉదయించినప్పుడు కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి రాబోతోంది.

Mars Rise: మే 2న కుజుడి ఉదయం: ఈ 3 రాశుల వారికి మహర్దశ మొదలు
Mars Rise: మే 2న కుజుడి ఉదయం: ఈ 3 రాశుల వారికి మహర్దశ మొదలు

12 రాశుల వారిపై కుజుని ఉదయం ప్రభావితం చూపించబోతోంది. కొన్ని రాశుల వారు సానుకూల మార్పుల్ని, కొత్త అవకాశాలని పొందబోతున్నారు. మరి అదృష్ట రాశులు ఎవరు? అసలు వారికి బాగా కలిసి రాబోతోందా? ఇప్పుడు తెలుసుకుందాం.

మే 2న ఉదయించనున్న కుజుడు.. ఈ రాశుల వారికి శుభ ఘడియలు మొదలు.. విపరీతమైన అదృష్టం కూడా

జ్యోతిష్యలెక్కల ప్రకారం చూసినట్లయితే కుజుడు మే 2 ఉదయం 4:30కి ఉదయిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారిపై తీవ్ర ప్రభావం పడబోతోంది. మరి అదృష్ట రాశుల్లో మీరు ఉన్నారేమో చూసుకోండి.

1.మేష రాశి:

మేష రాశి వారికి శుభ ఫలితాలు కలగబోతున్నాయి. ఎప్పటి నుంచో పూర్తి కాలేకపోయిన టాస్కులను ఈ సమయంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం మెరుగు పడుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు. సానుకూల మార్పులు ఉంటాయి.

2.తులా రాశి:

తుల రాశి వారికి కూడా ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక పరంగా బాగుంటుంది. ఎప్పటి నుంచో ఉన్న ఆర్థిక సమస్యల నుంచి సులువుగా బయట పడతారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఆదాయం పెరుగుతుంది. సానుకూల మార్పుల్ని చూస్తారు. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. సంతోషం కూడా పెరుగుతుంది.

3.వృశ్చిక రాశి:

రాశి వారికి కుజుడు ఉదయం మంచి ఫలితాలను అందిస్తుంది. పాత గొడవలు, సమస్యలు తొలగిపోతాయి. ప్రశాంతంగా ఉంటారు. సానుకూల మార్పులు చూస్తారు. ఈ రాశి వారి ఆదాయం కూడా పెరుగుతుంది. పని ప్రదేశంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువ అవుతుంది. ఇలా అనేక విధాలుగా ఈ రాశి వారు ప్రయోజనాలను పొందుతారు.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More