మీనరాశిలో కుజ, సూర్య, శని గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఈ 3 రాశుల వారికి ఊహించని లాభాలు!
ఏప్రిల్ 2న కుజుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ సూర్య, శని గ్రహాలతో సంయోగం ఏర్పడుతుంది. ఈ మూడు గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి అద్భుతమైన లాభాలను తీసుకు రాబోతోంది. ఆస్తులను కొనుగోలు చేస్తారు. కెరీర్‌లో సక్సెస్‌ను చూస్తారు. కష్టమైన పనులను కూడా చురుకుగా పూర్తి చేస్తారు.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేయడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఏప్రిల్ 2న త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. ఇది సూర్య, కుజ, శని గ్రహాల కలయిక వలన ఏర్పడుతుంది. ఈ త్రిగ్రాహి యోగం మీనరాశిలో ఏర్పడబోతోంది. మీన రాశిలో త్రిగ్రాహి యోగం వలన కొన్ని రాశుల వారు అనేక విధాలుగా లాభాలను పొందబోతున్నారు.

మూడు గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం
ఏప్రిల్ 2న కుజుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ సూర్య, శని గ్రహాలతో సంయోగం ఏర్పడుతుంది. ఈ మూడు గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి అద్భుతమైన లాభాలను తీసుకు రాబోతోంది. ఆస్తులను కొనుగోలు చేస్తారు. కెరీర్‌లో సక్సెస్‌ను చూస్తారు. కష్టమైన పనులను కూడా చురుకుగా పూర్తి చేస్తారు. మరి ఏ రాశుల వారు ఈ యోగంతో శుభ ఫలితాలను పొందబోతున్నారో ఇప్పుడు చూసేద్దాం.
ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 14 వరకు త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి ఊహించని లాభాలు
ఈ మూడు గ్రహాల కలయిక ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 14 వరకు ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక పరంగా లాభాలు, అదృష్టం పెరగడంతో పాటు అనేక విధాలుగా ఈ రాశుల వారికి కలిసి రాబోతుంది. మరి ఆ అదృష్ట రాశులలో మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి.
మేష రాశి:
మేష రాశి వారికి ఈ త్రిగ్రాహి యోగం బాగా కలిసి రాబోతోంది. మూడు గ్రహాల కలయిక ఈ రాశి వారికి అనేక విధాలుగా లాభాలను తీసుకొస్తుంది. కెరీర్‌లో సక్సెస్‌ను చూస్తారు. నిరుద్యోగులు ఉద్యోగాలను పొందే అవకాశం ఉంది. ఆర్థికపరంగా కూడా ఈ రాశి వారు లాభాలను పొందుతారు. అనేక విధాలుగా కలిసి వస్తుంది.
మీన రాశి:
మీన రాశి వారికి కూడా ఈ త్రిగ్రాహి యోగం అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి కెరీర్, వ్యాపారంలో అనేక లాభాలు వస్తాయి. కొత్త ఉద్యోగాన్ని పొందుతారు. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కష్టమైన పనులను కూడా చురుకుగా పూర్తి చేస్తారు. అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి కూడా ఇది అద్భుతమైన ఫలితాలను తీసుకొస్తుంది. ఈ త్రిగ్రాహి యోగం ఈ రాశి వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. పెండింగ్‌లో ఉన్న టాస్కులు పూర్తవుతాయి. ఆస్తులను కొనుగోలు చేస్తారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి కూడా త్రిగ్రాహి యోగంతో బాగా కలిసి వస్తుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


