Mars transit Aries 2026 : జ్యోతిష్య దృక్కోణం నుంచి మే నెల అత్యంత కీలకమైన మార్పులకు వేదిక కాబోతోంది. నవగ్రహాలలో 'సేనాధిపతి'గా, అత్యంత శక్తివంతుడైన గ్రహంగా భావించే అంగారకుడు (కుజుడు) మే 11న తన స్వరాశి అయిన మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జూన్ 21 వరకు అంటే దాదాపు 41 రోజుల పాటు అంగారకుడు ఇదే రాశిలో ఉంటాడు.

నిప్పు కణికలాంటి అంగారకుడు తన సొంత రాశిలోకి వచ్చినప్పుడు అతని శక్తి రెట్టింపు అవుతుంది. అయితే…. ఈ శక్తి అందరికీ సానుకూల ఫలితాలను ఇవ్వదు. ముఖ్యంగా నాలుగు రాశుల వారిపై ఈ సంచార ప్రభావం ప్రతికూలంగా ఉండే అవకాశం ఉందని జ్యోతిష్య గణాంకాలు చెబుతున్నాయి.
ఈ 4 రాశులపై ప్రతికూల ప్రభావం:
- కర్కాటక రాశి : ఈ రాశి వారికి మే 11 నుండి జూన్ 21 వరకు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా కార్యాలయాల్లో సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. చిన్నపాటి వాగ్వాదం కూడా మీ ఉద్యోగానికి లేదా పై అధికారులతో ఉన్న సంబంధాలకు ముప్పు తెచ్చిపెట్టవచ్చు. అనవసరమైన ఆలోచనలతో ప్రశాంతతను పాడుచేసుకోకుండా ఉండటం ఉత్తమం.
- తులా రాశి : శుక్రుడు అధిపతిగా ఉన్న తులా రాశి వారికి ఈ సమయంలో వ్యక్తిగత బంధాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య చిన్న విషయాలకే గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులు భాగస్వామ్య ఒప్పందాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలలో స్పష్టత లేకపోతే భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.
- మకర రాశి : శని దేవుడి రాశి అయిన మకర రాశి వారు ఈ 41 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తత అవసరం, లేనిపక్షంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆస్తి తగాదాలు తలెత్తవచ్చు. అనవసర ఖర్చులను నియంత్రించుకోకపోతే ఆర్థిక పరిస్థితి తలకిందులయ్యే ప్రమాదం ఉంది. కుటుంబంలో గందరగోళ వాతావరణం నెలకొనే అవకాశం కనిపిస్తోంది.
- మీన రాశి : బృహస్పతి రాశి అయిన మీన రాశి వారు పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు. ఈ సమయంలో షేర్ మార్కెట్ లేదా ఇతర వ్యాపారాల్లో పెట్టే పెట్టుబడులు నష్టాలను మిగిల్చవచ్చు. మీ మాట తీరు వల్ల ఇతరుల మనసు గాయపడే అవకాశం ఉంది… కాబట్టి సంభాషణలో సంయమనం పాటించండి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వద్దు.
అంగారక దోష నివారణ మార్గాలు:
పైన పేర్కొన్న రాశుల వారు ఆందోళన చెందాల్సిన పనిలేదు. కొన్ని ఆధ్యాత్మిక నివారణల ద్వారా అంగారకుడి ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు…
- జూన్ 21 వరకు ప్రతిరోజూ హనుమంతుడిని ఆరాధించండి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ధైర్యం, శాంతి లభిస్తాయి.
- మంగళవారం నాడు ఎరుపు రంగు వస్తువులను (కందిపప్పు, ఎర్రటి వస్త్రాలు) పేదలకు దానం చేయండి.
- ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.
పైన పేర్కొన్న రాశుల వారు ఆందోళన చెందాల్సిన పనిలేదు. కొన్ని ఆధ్యాత్మిక నివారణల ద్వారా అంగారకుడి ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు…
- జూన్ 21 వరకు ప్రతిరోజూ హనుమంతుడిని ఆరాధించండి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ధైర్యం, శాంతి లభిస్తాయి.
- మంగళవారం నాడు ఎరుపు రంగు వస్తువులను (కందిపప్పు, ఎర్రటి వస్త్రాలు) పేదలకు దానం చేయండి.
- ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.