...
...
Next Story

Ruchaka Rajayogam: మేష రాశిలో కుజుడి సంచారం.. రుచక రాజయోగంతో ఆ 3 రాశులకు తిరుగుండదు.. అదృష్టం మీ వెంటే!

Ruchaka Rajayogam: గ్రహాల సేనాధిపతి కుజుడు మేష రాశిలోకి ప్రవేశించబోతున్నారు. దీని వల్ల అత్యంత శక్తివంతమైన 'రుచక రాజయోగం' ఏర్పడనుంది. ఈ గ్రహ గమనం వల్ల మేషం, మిథునం, వృశ్చిక రాశుల వారికి అపారమైన ధనలాభం, వృత్తిలో పురోగతి కలగనున్నాయి.

Published on: Apr 23, 2026, 09:30:27 IST
Advertisement

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు విపరీతమైన ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ధైర్యం, శక్తి, భూమి, వివాదాలకు కారకుడైన అంగారకుడు (కుజుడు) రాశి మార్పు చెందుతున్నప్పుడు దాని ప్రభావం ద్వాదశ రాశులపై బలంగా ఉంటుంది. ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్న కుజుడు, త్వరలోనే తన స్వక్షేత్రమైన మేష రాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు.

మేష రాశిలోకి కుజుడు

Ruchaka Rajayogam: మేష రాశిలో కుజుడి సంచారం.. రుచక రాజయోగంతో ఆ 3 రాశులకు తిరుగుండదు
Ruchaka Rajayogam: మేష రాశిలో కుజుడి సంచారం.. రుచక రాజయోగంతో ఆ 3 రాశులకు తిరుగుండదు

హిందూ పంచాంగం ప్రకారం, 2026 మే 11వ తేదీ మధ్యాహ్నం 12:47 గంటలకు కుజుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. జూన్ 20 వరకు ఆయన అక్కడే ఉంటారు. కుజుడు తన సొంత రాశిలోకి రావడం వల్ల జ్యోతిషశాస్త్రంలో పంచమహాపురుష యోగాలలో ఒకటైన 'రుచక రాజయోగం' ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల కొన్ని రాశుల జాతకులు ఊహించని విజయాలను అందుకోబోతున్నారు. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇవే..

1.మేష రాశి: రాజయోగం మీ సొంతం

కుజుడు మేష రాశిలోనే సంచరిస్తుండటంతో, ఈ రాశి వారికి కాలం బంగారుమయంగా మారనుంది. కుజుడు ఈ రాశికి అధిపతి కావడం వల్ల దీని ప్రభావం రెట్టింపు ఉంటుంది.

ఆస్తుల కొనుగోలు: చాలా కాలంగా వాయిదా పడుతున్న భూమి లేదా వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది.

పెట్టుబడులు: స్టాక్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం.

ప్రేమ జీవితం: మీ పార్ట్‌నర్‌తో గొడవలు సర్దుమణిగి, రొమాంటిక్ డేట్‌లకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ బంధం మరింత బలోపేతం అవుతుంది.

2.మిథున రాశి: ఉద్యోగంలో ప్రమోషన్, కొత్త ఆదాయం

వృత్తి జీవితం: ఉద్యోగస్తులకు ఆఫీసులో ప్రశంసలు లభిస్తాయి. కొత్త బాధ్యతలు చేపడతారు. వ్యాపారవేత్తలు భారీ లాభాలను గడిస్తారు.

కుటుంబం: ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. ఒంటరిగా ఉన్న వారికి తమకు నచ్చిన భాగస్వామి దొరికే అవకాశం ఉంది.

జాగ్రత్త: వివాహితులు తమ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.

3.వృశ్చిక రాశి: ధన వర్షం.. ఆత్మవిశ్వాసం

వృశ్చిక రాశికి కూడా కుజుడే అధిపతి. మేష రాశిలోకి కుజుడి ప్రవేశం వీరికి వరంగా మారనుంది.

ఆర్థిక లాభం: నిలిచిపోయిన బకాయిలు వసూలవుతాయి. అదనపు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.

కెరీర్: కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. కొత్త ప్రాజెక్టులు మీ దరికి వస్తాయి.

సలహా: జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే ప్రమాదం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకుని ఓపికగా వ్యవహరించడం శ్రేయస్కరం.

కుజుడు మేష రాశిలో ఉన్నప్పుడు మనిషిలో పట్టుదల, కార్యదక్షత పెరుగుతాయి. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే కెరీర్‌లో స్థిరపడొచ్చు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks