Budhaditya Rajayogam: మేష రాశిలో బుధాదిత్య రాజయోగం.. ఏప్రిల్ 30 నుంచి ఈ మూడు రాశుల వారికి డబ్బే డబ్బు!
Budhaditya Rajayogam: సూర్యుడు, బుధ గ్రహాల కలయికతో అత్యంత శక్తివంతమైన 'బుధాదిత్య రాజయోగం' మేష రాశిలో ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఏప్రిల్ 30 నుంచి కొన్ని రాశుల వారికి అదృష్టం వరించడమే కాకుండా, ఆర్థికంగా ఊహించని లాభాలు కలగనున్నాయి.
Budhaditya Rajayogam: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం మానవ జీవితాలపై లోతైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా గ్రహాల రాజు సూర్యుడు, గ్రహాల యువరాజుగా భావించే బుధుడు ఒకే రాశిలో కలిసినప్పుడు 'బుధాదిత్య రాజయోగం' ఏర్పడుతుంది. సాధారణంగా జాతక చక్రంలో ఈ రెండు గ్రహాలు కలిసి ఉంటే ఆ వ్యక్తికి సమాజంలో గౌరవం, అపారమైన మేధస్సు, వృత్తిరీత్యా అద్భుతమైన విజయాలు లభిస్తాయి.

ప్రస్తుతం సూర్యుడు తన ఉచ్ఛ రాశి అయిన మేష రాశిలో సంచరిస్తుండగా, త్వరలోనే బుధుడు కూడా అదే రాశిలోకి ప్రవేశించనున్నారు. 2026, ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 06:55 గంటలకు బుధుడు మేష రాశిలోకి అడుగుపెడతారు. మే 15 వరకు ఈ రెండు గ్రహాల సంయోగం కొనసాగుతుంది. కుజుడి ఆధిపత్యంలో ఉండే మేష రాశిలో ఈ రాజయోగం ఏర్పడటం వల్ల మూడు రాశుల జాతకుల జాతకం ఒక్కసారిగా మారిపోనుంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరో ఇప్పుడే తెలుసుకుందాం.
బుధాదిత్య రాజయోగం.. ఈ రాశులకు గొప్ప వరం
1.మేష రాశి
ఈ రాజయోగం మేష రాశిలోనే ఏర్పడుతుండటంతో, ఈ రాశి వారికి ఇది స్వర్ణయుగమనే చెప్పాలి. ముఖ్యంగా నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ మీ స్నేహితులు, ఆత్మీయుల సహకారం మెండుగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి.
ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. జీవిత భాగస్వామితో గడుపుతున్న సమయం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. పాత మనస్పర్థలు తొలగిపోయి బంధం బలపడుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని లాభాల బాట పడతారు.
2.కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ గ్రహాల సంచారం రాజయోగ సమాన ఫలితాలను అందిస్తుంది. మీరు గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తలు ఈ సమయంలో అందుతాయి.
స్టాక్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్‌లో చిన్నపాటి పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. భవిష్యత్తులో ఇవి భారీ లాభాలను తెచ్చిపెడతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు మీ నిర్ణయాలకు ఉంటుంది. ఆఫీసులో మీ పనితీరుకు పైఅధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి.
3.సింహ రాశి
సింహ రాశికి అధిపతి సూర్యుడు. తన మిత్ర గ్రహమైన బుధుడితో కలిసి మేష రాశిలో సంచరించడం వల్ల సింహ రాశి జాతకులకు అన్ని రంగాల్లోనూ సక్సెస్ లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన కాలం. మీరు పడే ప్రతి కష్టానికి రెట్టింపు ఫలితం ఉంటుంది.
గత కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. రాజకీయ లేదా సామాజిక రంగాల్లో ఉన్న వారికి పదవీ యోగం పట్టే అవకాశం ఉంది.
ఈ పరిహారాలు పాటిస్తే మంచిది
"బుధాదిత్య రాజయోగం సమయంలో బుద్ధి బలంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం పఠించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


