...
...
Next Story

May Horoscope 2026: మేషరాశితో పాటు ఈ 3 రాశులకు మే నెలలో విపరీతమైన అదృష్టం.. అన్ని రంగాలలో పురోగతి!

May Horoscope 2026: మే నెలలో కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు ఉండబోతోంది. బుధుడు, కుజుడు, శుక్రుడు, సూర్యుడు వాటి సంచారాల్లో మార్పు చేయనున్నారు. ఇది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులని తీసుకువస్తుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం అనేక విధాలగా లాభాలు పొందబోతున్నారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు?

Published on: Apr 22, 2026, 13:30:26 IST
Advertisement

May Horoscope 2026: ప్రతి నెలా కూడా కొన్ని ముఖ్య గ్రహాల సంచారంలో మార్పులు చూస్తూ ఉంటాం. మే నెలలో కూడా కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో అనేక మార్పులు రాబోతున్నాయి. కొన్ని గ్రహాల సంచారాల వలన రాజయోగాలు కూడా ఏర్పడడం చూస్తూ ఉంటాం. మే నెలలో చూసినట్లయితే, బుధుడు మేష రాశిలో అస్తమిస్తాడు. అలాగే కుజుడు సొంత రాశి అయిన మేష రాశిలోకి అడుగు పెడతాడు. శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. నెల మధ్యలో సూర్యుడు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అలాగే బుధుడు వృషభ రాశిలో ఉదయిస్తాడు.

May Horoscope 2026: మేషరాశితో పాటు ఈ 3 రాశులకు మే నెలలో విపరీతమైన అదృష్టం (pinterest)
May Horoscope 2026: మేషరాశితో పాటు ఈ 3 రాశులకు మే నెలలో విపరీతమైన అదృష్టం (pinterest)

ఆ తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు రావడంతో 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఆర్థికపరంగా కలిసి వస్తుంది. కెరీర్‌లో సక్సెస్‌ని చూస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా బాగా కలిసి వస్తుంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరనేది ఇప్పుడు చూద్దాం.

మే నెలలో ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం.. ఈ అదృష్ట రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి

1.మేష రాశి:

మేష రాశి వారికి మే 2026 బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. ఆర్థికపరంగా ప్రయోజనాలు ఉంటాయి. మతపరమైన ప్రదేశాలకు వెళ్తారు. కాంపిటేటివ్ పరీక్షల్లో కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మీ కష్టానికి తగ్గ ఫలితం చూస్తారు. పని ప్రదేశంలో సానుకూల మార్పులు ఉంటాయి.

2.వృషభ రాశి:

వృషభ రాశి వారికి మే నెలలో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారస్తులకు కూడా ఇదే శుభ సమయం. కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి కూడా ఈ రాశి వారికి అదృష్ట సమయం. రిలేషన్‌షిప్ బాగుంటుంది. ఈ నెలలో మీరు చాలా ట్రిప్పులు వేస్తారు.

3.సింహ రాశి:

ఈ రాశి వారికి కూడా మే నెలలో బాగుంటుంది. మీ భాగస్వామి సపోర్ట్ మీకు ఉంటుంది. అది మీకు పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా కూడా కలిసి వచ్చేలా చేస్తుంది. మీ భాగస్వామి నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్‌ను పొందుతారు. పెండింగ్‌లో ఉన్న టాస్కులను ఈ రాశి వారు పూర్తి చేస్తారు. కోర్టు కేసులు కూడా పరిష్కారం అవుతాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks