...
...
Next Story

బుధుడి నక్షత్ర మార్పు - ఈ 4 రాశులవారి జీవితాల్లో గోల్డెన్ డేస్‌కు బాటలు

సెప్టెంబర్ 21న బుధుడు అంగారక గ్రహానికి చెందిన చిత్తా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ గ్రహ మార్పుతో నాలుగు రాశుల జాతకులకు అదృష్టం వరించి ధనలాభం కలుగుతుంది.

Published on: Sep 16, 2026, 07:48:43 IST
Advertisement

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల గ్రహరాజుగా, బుద్ధి మరియు వ్యాపార కారకుడిగా భావించే బుధ దేవుడి సంచారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బుధుడు ప్రతి నెలా తన నక్షత్రాన్ని లేదా రాశిని మారుస్తుంటాడు. జాతకంలో బుధుడి స్థానం అనుకూలంగా ఉంటే, ఆ వ్యక్తికి పట్టపగలే అదృష్టం వరిస్తుంది, సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అదే సమయంలో బుధుడు బలహీన స్థానంలో ఉంటే అనేక ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తలెత్తుతాయి.

బుధ సంచారంతో ఆ 4 రాశులకు తిరుగులేని అదృష్టం!
బుధ సంచారంతో ఆ 4 రాశులకు తిరుగులేని అదృష్టం!

ప్రస్తుతం చంద్రునికి చెందిన హస్త నక్షత్రంలో పయనిస్తున్న బుధుడు, సెప్టెంబర్ 21, 2026న కుజుడు (అంగారకుడు) అధిపతిగా ఉన్న చిత్తా నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సంచారం అక్టోబర్ 1 ఉదయం వరకు కొనసాగుతుంది. ప్రముఖ జ్యోతిష్య పండితుడు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం, కుజ నక్షత్రమైన చిత్తాలోకి బుధుడి ప్రవేశం నాలుగు రాశుల జాతకుల జీవితాల్లో గోల్డెన్ డేస్‌కు బాటలు వేయనుంది. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇవే…

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ నక్షత్ర మార్పు అత్యంత ప్రయోజనకరంగా మారనుంది. దీర్ఘకాలంగా నిలిచిపోయిన రాబడి చేతికి అందుతుంది. ఆర్థికంగా ఒడిదొడుకులు తొలగిపోయి, బ్యాంకు బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు లేదా ప్రస్తుత వ్యాపారాన్ని విస్తరించేందుకు ఇది సరైన సమయం. ప్రతి పనిలోనూ విజయం మీ సొంతమవుతుంది.

సింహ రాశి

సింహ రాశి జాతకులకు బుధుడి సంచారం పూర్తి సానుకూల ఫలితాలను ఇస్తుంది. కాలం మీకు అనుకూలంగా మారడంతో అదృష్టం వెంటే ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం కుదుటపడి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది.

వృశ్చిక రాశి

మకర రాశి వారికి చిత్ర నక్షత్రంలో బుధుడి పయనం ఆశించిన ఫలితాలను ఇస్తుంది. సుదీర్ఘకాలంగా ఉన్న ప్రేమ సంబంధాలు పెళ్లి పీటల వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. కుటుంబంలో ఆనందం, ప్రశాంతత నెలకొంటాయి. ఆర్థిక విషయాల్లోనూ అనుకూలతలు కనిపిస్తాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks