గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకొస్తుంది. గ్రహాల సంచారంలో మార్పు కారణంగా ఒక్కోసారి శుభ ఫలితాలు కలుగుతాయి. ఒక్కొక్కసారి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఆగస్టు 14, అనగా ఈరోజు ఆకాశంలో అత్యంత కీలకమైన గ్రహగమనం చోటు చేసుకోబోతోంది. సరిగ్గా మధ్యాహ్నం 12:37కి బుధుడు, కుజుడు మధ్య దశాంక యోగం ఏర్పడబోతోంది. ఈ సమయంలో రెండు గ్రహాలు దాదాపు 36 డిగ్రీల కోణంలో ఉండడంతో కొన్ని రాశుల వారికి మాత్రమే శుభ ఫలితాలు కలగబోతున్నాయి.
రెండు గ్రహాల కలయిక
కుజుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నారు. కర్కాటక రాశిలో బుధుడితో పాటు ఉచ్చ స్థితిలో ఉన్న గురువు కూడా కొలువై ఉండడంతో ఈ సంయోగం ప్రాధాన్యత మరింత పెరిగింది.
బుధుడు బుద్ధిశీలత, ఆలోచనలు, వాక్చాతుర్యం, వ్యాపారం మొదలైన వాటికి కారకుడు. కుజుడు సాహసం, అపార శక్తి, సాంకేతిక నైపుణ్యాలు మొదలైన వాటికి నాయకుడు. ఏ పనిని మొదలుపెట్టినా పట్టుదలతో సాధించే తత్వానికి ప్రత్యేకంగా నిలుస్తాడు. ఈ రెండు పెద్ద గ్రహాల ప్రభావంతో ఇప్పుడు కొన్ని రాశుల వారు భారీగా ప్రయోజనాలను పొందబోతున్నారు. ఆ అదృష్ట రాశులు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.
బుధ–కుజ గ్రహాల దశాంక యోగం.. ఈ రాశులకే కెరీర్, వ్యాపారంలో ఊహించని లాభాలు
కన్యా రాశి
కన్యా రాశి వారికి వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆఫీసులో సరికొత్త బాధ్యతలు చేపడతారు. పడే కష్టానికి తగ్గ ఫలితంతో పాటు అధికారుల నుంచి ప్రశంసలు కూడా వస్తాయి. వ్యాపారస్తులకు అద్భుతమైన సమయం. కొత్త లాభాలుగా మలుచుకుంటారు. చురుగ్గా అడుగులు వేస్తే అనుకునే లక్ష్యాలను సులువుగా సాధించొచ్చు.
వృషభ రాశి
{{/usCountry}}కన్యా రాశి వారికి వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆఫీసులో సరికొత్త బాధ్యతలు చేపడతారు. పడే కష్టానికి తగ్గ ఫలితంతో పాటు అధికారుల నుంచి ప్రశంసలు కూడా వస్తాయి. వ్యాపారస్తులకు అద్భుతమైన సమయం. కొత్త లాభాలుగా మలుచుకుంటారు. చురుగ్గా అడుగులు వేస్తే అనుకునే లక్ష్యాలను సులువుగా సాధించొచ్చు.
వృషభ రాశి
{{/usCountry}}వృషభ రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. కమ్యూనికేషన్, మార్కెటింగ్ రంగాల్లో అద్భుతమైన విషయాలను సాధిస్తారు. కొత్త ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. సేల్స్, మీడియా, కంటెంట్ క్రియేషన్, డిజిటల్ వ్యాపారాలు, కన్సల్టింగ్ రంగాల్లో పనిచేస్తున్న వారికి కొత్త ప్రాజెక్టులు వస్తాయి.
సింహ రాశి
సింహ రాశి వారికి కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుంది. కారణంగా అనుకూల ఫలితాలను చూడొచ్చు. నెట్‌వర్క్‌ను విస్తరించొచ్చు. ఆశించిన కోరికలు నెరవేరుతాయి. సానుకూల ఫలితాలను చూస్తారు. విదేశీ కంపెనీలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్, ఐటీ, మీడియా రంగంలో పనిచేసే వారికి ఇది అద్భుతమైన సమయం.
తులా రాశి
తులా రాశి వారికి కూడా ఇది మంచి సమయం. ఆఫర్లు బాగా వస్తాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి కూడా ఇది అద్భుతమైన సమయం. వ్యాపార రంగాల్లో పెద్ద సంస్థలతో కలిసి పనిచేసే సువర్ణ అవకాశాలు లభిస్తాయి. దశాంక యోగం కెరీర్‌లో కూడా మంచి మార్పులను తీసుకొస్తుంది.
మీన రాశి
మీన రాశి వారు ఆస్తులను కొనుగోలు చేస్తారు. విద్యా రంగంలో పురోగతిని చూస్తారు. మీ కలలు నెరవేరుతాయి. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులు భాగస్వాముల సహకారంతో మంచి ఆర్థిక లాభాలను పొందుతారు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఇలా అన్ని విధాలుగా ఈ రాశి వారికి ఈ సమయం కలిసొస్తుంది.