...
...
Next Story

పునర్వసు నక్షత్రంలోకి బుధుడు - ఈ 4 రాశులకు లక్కీ డేస్..! ఆగస్టు 8 వరకు తిరుగుండదు

గ్రహాల యువరాజు బుధుడు పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఆగస్టు 8, 2026 వరకు సాగే ఈ సంచారం వల్ల మేషం, కన్య, తుల, మకర రాశుల వారికి అపారమైన ధనలాభం, కెరీర్‌లో భారీ విజయాలు దక్కనున్నాయి.

Published on: Jun 30, 2026, 07:17:32 IST
Advertisement

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల రాకుమారుడిగా, బుద్ధి కారకుడిగా భావించే బుధ గ్రహ కదలికలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. బుధుడు తన రాశిని లేదా నక్షత్రాన్ని మార్చినప్పుడల్లా ఆ ప్రభావం అన్ని రాశుల వారిపై స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం బుధ గ్రహం కర్కాటక రాశిలో ఉంటూ బృహస్పతికి చెందిన పునర్వసు నక్షత్రంలో సంచరిస్తోంది.

పునర్వసు నక్షత్రంలోకి బుధుడు
పునర్వసు నక్షత్రంలోకి బుధుడు

హిందూ క్యాలెండర్ ప్రకారం….. బుధుడు ఆగస్టు 8, 2026 వరకు ఇదే నక్షత్రంలో కొనసాగుతాడు. ఆ తర్వాత శని నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ నేపథ్యంలో రాబోయే 38 రోజుల పాటు బుధుడి నక్షత్ర సంచారం కొన్ని రాశుల వారికి అద్భుతమైన రోజులను తీసుకురానుంది. ఈ కాలంలో నాలుగు రాశుల వారికి ఆకస్మిక ధనలాభంతో పాటు కెరీర్‌లో ఊహించని శుభవార్తలు అందుతాయని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ వివరించారు. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇక్కడ తెలుసుకోండి…

మేష రాశి :

పునర్వసు నక్షత్రంలో బుధుడి సంచారం మేష రాశి వారికి అత్యంత లాభదాయకంగా మారనుంది. మీ కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటాయి. చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారి కల ఈ సమయంలో నెరవేరుతుంది. కొత్త ఆదాయ వనరులు సృష్టించుకోవడంతో పాటు, మీ సంపాదన గణనీయంగా పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి.

కన్యా రాశి :

కన్యా రాశి వారికి ఈ 39 రోజులు వరుస శుభవార్తలు అందుతాయి. బుధ గ్రహ అనుగ్రహం వల్ల ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, వేతన పెంపు వంటి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు భారీగా లాభాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మునుపటికంటే మెరుగ్గా మారుతుంది.

తులా రాశి :

మకర రాశి వారికి బుధ గోచారం వల్ల పట్టిందల్లా బంగారమే కానుంది. గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన పనులు లేదా కోర్టు కేసులు ఈ కాలంలో సజావుగా సాగిపోతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం ఎంతో అనుకూలం. వారు ఆశించిన రంగాల్లో విజయం సాధించి, ఉద్యోగ సమాచారం అందుకునే అవకాశం ఉంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe