నేటి నుంచే బుధుడి తిరోగమనం - ఈ 3 రాశులకు అదృష్ట యోగం!
బుధ గ్రహం నేటి నుండి కర్కాటక రాశిలో తిరోగమనం (వక్ర) చెందబోతున్నాడు. ఈ బుధ వక్ర చలనంతో పలు రాశుల వారికి అద్భుతమైన ఆర్థిక లాభాలు, పురోగతి కలగనున్నాయి.
నవగ్రహాలలో రాకుమారుడిగా, బుద్ధి కారకుడిగా పిలిచే బుధ గ్రహం తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు. నేటి నుంచే బుధుడు తిరోగమనంలోకి (వక్ర) వెళ్తున్నాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం….. ఏదైనా ఒక గ్రహం వక్రమార్గంలో ప్రయాణించినప్పుడు (తిరోగమనం చెందినప్పుడు) దాని ప్రభావం అన్ని రాశులపై భిన్నంగా ఉంటుంది. ఈ మార్పు వల్ల కొన్ని రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా మారితే, మరికొన్ని రాశుల వారు కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

చంద్రుడికి అధిపతి అయిన కర్కాటక రాశిలో బుధుడు తిరోగమనం చెందుతున్నాడు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ తమ అంతర్ దృష్టిని, మనస్సాక్షిని నమ్మి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ మనస్సు ఏం చెబుతోందో గమనించి, మీ భావోద్వేగాలను, బంధుత్వాలను బ్యాలెన్స్ చేసుకోవడం ఎంతో ముఖ్యం.
సాధారణంగా ఏదైనా ఒక గ్రహం తిరోగమనం చెందినప్పుడు, అది మీ జీవితంలో కొంచెం విరామం (బ్రేక్) ఇచ్చి.. మీరు ఇప్పటివరకు ఏం చేశారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే విషయాలను తిరిగి సమీక్షించుకునేలా చేస్తుంది. జ్యోతిష్యశాస్త్రంలో బుధ గ్రహం ఆలోచనా విధానం, గ్రహణ శక్తి, తార్కిక సామర్థ్యం (లాజిక్) మరియు కమ్యూనికేషన్‌కు కారకుడిగా వ్యవహరిస్తాడు. మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, మీ మాటతీరు ఎలా ఉంది, మీ తర్కం ఎలా పనిచేస్తోంది అనే విషయాలను ఈ కాలంలో బుధుడు నియంత్రిస్తాడు.
ప్రముఖ జ్యోతిష్కుడు నరేంద్ర ఉపాధ్యాయ్ అందించిన వివరాల ప్రకారం.. కర్కాటక రాశిలో బుధుడి తిరోగమన చలనం వల్ల ఈ క్రింది 3 రాశుల వారికి అత్యంత అద్భుతమైన ఫలితాలు లభించనున్నాయి.
1. మేష రాశి:
మేష రాశి వారికి ఈ బుధ వక్ర చలనం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పదోన్నతులు లేదా మంచి గుర్తింపు లభిస్తుంది. మీలో నిర్ణయం తీసుకునే సామర్థ్యం మునుపటి కంటే చాలా మెరుగ్గా మారుతుంది. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఇకపోతే సుదీర్ఘకాలంగా ప్రభుత్వ ఉద్యోగం (Government Job) కోసం రాత్రింబగళ్లు కష్టపడుతూ, ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది; అనుకున్న విజయాన్ని సాధిస్తారు.
2. కర్కాటక రాశి:
బుధుడు మీ సొంత రాశిలోనే తిరోగమనం చెందుతున్నందున….. దీని ప్రభావం మీపై స్పష్టంగా కనిపిస్తుంది. మీ ఆదాయ మార్గాలు మునుపటి కంటే చాలా బాగుంటాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన బకాయిలు వసూలై, భవిష్యత్తులో మీకు ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. మీలో లాజికల్ గా ఆలోచించే తార్కిక సామర్థ్యం పెరుగుతుంది. సమాజంలో, కుటుంబంలో మీ విలువ పెరగడం వల్ల మొత్తంగా ఈ కాలంలో మీరు మానసికంగా ఎంతో ఉల్లాసంగా, మంచి అనుభూతిని పొందుతారు.
3. వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి అదృష్టం పూర్తిగా కలిసి వస్తుంది. అదృష్ట నక్షత్రాల మద్దతు వల్ల మీరు ఏ పని ప్రారంభించినా అది విజయవంతంగా పూర్తవుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు అనేక విధాలుగా మేలు జరుగుతుంది; అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. మీ ఆర్థిక పరిస్థితి మునుపెన్నడూ లేనంత బలంగా మారుతుంది. భవిష్యత్తు ప్రణాళికలలో మంచి విజయాలు సాధిస్తారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

