...
...
Next Story

Mokshada Ekadashi Vrata Katha: మోక్షద ఏకాదశి వేళ చదువుకోవాల్సిన వ్రత కథ.. ఇలా చేస్తే పూర్వీకులకు విముక్తి కలుగుతుంది!

ఈరోజే మోక్షద ఏకాదశి. విష్ణువుని ఆరాధిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. ఉపవాసం ఉంటే కూడా ఎన్నో ఎక్కువ రెట్లు ఫలితాన్ని పొందవచ్చు. విష్ణువుని భక్తితో ఆరాధిస్తే పాపాలన్నీ తొలగిపోతాయి. కర్మ బంధాల నుంచి విముక్తి కలుగుతుంది. మోక్షద ఏకాదశి ఉపవాస కథను చదివినా, విన్నా వారికి వాజపేయ యజ్ఞం ఫలం లభిస్తుంది.

Published on: Dec 1, 2025, 10:30:16 IST
Advertisement

మోక్షద ఏకాదశి 2025: ఈరోజే మోక్షద ఏకాదశి. ఈరోజు విష్ణువుని ఆరాధిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. ఉపవాసం ఉంటే కూడా ఎన్నో ఎక్కువ రెట్లు ఫలితాన్ని పొందవచ్చు. మహావిష్ణువుని ఈరోజు భక్తి శుద్ధతో ఆరాధిస్తే పాపాలన్నీ తొలగిపోతాయి. గత జన్మలో కర్మ బంధాల నుంచి విముక్తి కలుగుతుంది. మోక్షదా ఏకాదశి నాడు “ఓం నమో భగవతే వాసుదేవాయ” మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని జపిస్తే భయాలన్నీ కూడా తొలగిపోతాయి.

మోక్షద ఏకాదశి వ్రత కథ
మోక్షద ఏకాదశి వ్రత కథ

జీవితంలో సానుకూల శక్తి కలిగి బాగుంటుంది. వృత్తిపరంగా కూడా కలిసి వస్తుంది. విజయాన్ని అందుకోవచ్చు. అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అలాగే మంత్రాన్ని జపిస్తే ఆధ్యాత్మిక బలం కలుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. శత్రువుల కష్టాల నుంచి కూడా బయటపడవచ్చు. క్రమం తప్పకుండా ఈ మంత్రాన్ని జపిస్తే వ్యక్తిగత వృద్ధి కూడా ఉంటుంది. పైగా ఈరోజు గీతా జయంతి కూడా కాబట్టి విష్ణువుని ఖచ్చితంగా పూజించండి. అలాగే భగవద్గీత పారాయణ చేస్తే కూడా చక్కటి ఫలితాన్ని చూడొచ్చు.

మోక్షద ఏకాదశి వ్రత కథ

ఒకప్పుడు, చంపక నగరంలో వైఖానసుడు అనే రాజు ఉండేవాడు. ఒక రోజు రాజు తన పూర్వీకులు నరకంలో అనేక ఇబ్బందులు పడుతుండడాన్ని కలలో చూశాడు. వారందరినీ ఈ స్థితిలో చూసి రాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఉదయాన్నే బ్రాహ్మణులను పిలిచి తనకు వచ్చిన కల మొత్తం చెప్పాడు. వారితో మాట్లాడుతూ నా పూర్వీకులు నరకంలో బాధలు పడడాన్ని నేను చూశాను. పైగా వారు నన్ను ఈ నరకం నుండి రక్షించంమని అన్నారు అని రాజు వారితో చెప్పాడు.

రాజు ముని వద్దకు వెళ్లి నమస్కరించి అతనికి అంతా చెప్పాడు. రాజు ఇలా అన్నాడు, "గురుదేవా! నీ దయతో, నా రాజ్యం సురక్షితంగా ఉంది. కానీ నా పూర్వీకులు నరకంలో ఉన్నారని నేను కలలో చూసాను; అందుచేత ఏ పుణ్యం వల్ల వాళ్ళు అందులో నుంచి విముక్తి పొందుతారో చెప్పండి అని అనగా.. రాజు చెప్పిన మాట విన్న మహర్షి రాజుతో ఇలా అన్నాడు: "మహారాజా! మీరందరూ మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో మోక్షద ఉపవాసం పాటించాలి. దాని పుణ్యం పూర్వీకులకు ఇవ్వాలి.

నరకం నుండి విముక్తి

ఆ పుణ్యం వల్ల వారు నరకం నుండి రక్షింపబడతారు. మార్గశిర మాసం వచ్చినప్పుడు, రాజు ఋషి మాటల ప్రకారం మోక్షద ఏకాదశి రోజున ఉపవాసం చేశాడు. తండ్రితో పాటు తన పుణ్యాన్ని తన పూర్వికులందరికీ ఇచ్చాడు. రాజు తండ్రి, అతని పూర్వీకులు నరకం నుండి విముక్తి పొందారు. అందుకే ఇంతటి మహిమగల మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే పాపాలు తొలగి, మరణానంతరం మోక్షం పొందుతాడు. ఈ ఉపవాస కథను ఎవరు చదివినా, విన్నా వారికి వాజపేయ యజ్ఞం ఫలం లభిస్తుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe