ఆకాశంలో గ్రహాల గమనం మానవ జీవితాలపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా మనసుకుకారకుడైన చంద్రుడు తన రాశిని మారుస్తూ అక్టోబర్ 4, 2026 సాయంత్రం 6:32 గంటలకు కర్కాటక రాశిలోకి ప్రవేశించారు. ఇప్పటికే ఆ రాశిలో గురుడు, కుజుడు సంచరిస్తుండటంతో అరుదైన త్రిగ్రహ కూటమి ఏర్పడింది. కర్కాటక రాశికి స్వయంగా చంద్రుడే అధిపతి కావడం, అందులోనూ నీచ భంగం లేని రీతిలో కుజుడు సంచారంలో ఉండటం ఈ యోగానికి మరింత విశేషమైన శక్తిని ఇస్తోంది.

ఈ అద్భుత గ్రహ సంచారం వల్ల ఏర్పడిన గజకేసరి మరియు లక్ష్మీ రాజయోగాల ప్రభావం ద్వాదశ రాశులపై ఏ విధంగా ఉండనుందో తెలుసుకుందాం "చంద్ర, కుజులు కలిసి లక్ష్మీ యోగాన్ని, చంద్ర, గురువులు కలిసి గజకేసరి యోగాన్ని ఏర్పరచడం మానవళికి అత్యంత లాభదాయకంగా ఉందని చెప్పచ్చు.
మేష రాశి: ఈ కాలంలో మీకు భూమి, ఇల్లు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది.
వృషభ రాశి: మీ పరాక్రమం పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ సంచలన విజయం సాధిస్తారు. సోదరుల సహకారం లభిస్తుంది.
మిథున రాశి: మీ మాటతీరుతోనే అసాధ్యమైన పనులను సులువుగా సుసాధ్యం చేసుకుంటారు. వ్యాపారంలో ధనలాభం కలగడంతో పాటు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
కర్కాటక రాశి: మీ సొంత రాశిలోనే ఈ రాజయోగాలు ఏర్పడటంతో జీవితంలో సరికొత్త మలుపులు తిరుగుతాయి. కొత్త ప్రేమ సంబంధాలు చిగురిస్తాయి. పాత బంధాలు మరింత పరిపక్వత చెందుతాయి. అదృష్టం పూర్తిగా వెన్నంటి ఉంటుంది.
సింహ రాశి: ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. అయితే ఈ ఖర్చులు ఎక్కువగా శుభకార్యాల నిమిత్తం జరుగుతాయి.
కన్య రాశి: ఆదాయ మార్గాలు రెట్టింపు అవుతాయి. పాత మార్గాల ద్వారా కూడా నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. తీర్థయాత్రలు లేదా విహారయాత్రలు చేసే సూచనలున్నాయి.
{{/usCountry}}కన్య రాశి: ఆదాయ మార్గాలు రెట్టింపు అవుతాయి. పాత మార్గాల ద్వారా కూడా నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. తీర్థయాత్రలు లేదా విహారయాత్రలు చేసే సూచనలున్నాయి.
{{/usCountry}}తులా రాశి: వ్యాపార రంగంలో కొత్త సంబంధాలు ఏర్పడతాయి. ప్రభుత్వ లేదా అధికార వర్గాల నుంచి ఊహించని మద్దతు లభిస్తుంది. తండ్రి గారి ద్వారా ఆర్థిక లబ్ధి పొందుతారు.
వృశ్చిక రాశి: అదృష్టం పూర్తిగా మీ వైపు ఉంటుంది. విదేశీ ప్రయాణాలు లేదా దూరపు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ధార్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు.
ధనుస్సు రాశి: కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనవసర రిస్క్‌లకు దూరంగా ఉంటూ ఈ కాలాన్ని జాగ్రత్తగా దాటాలి.
మకర రాశి: పెళ్లి ప్రయత్నాలు సానుకూలమవుతాయి. జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పదోన్నతులు, అధికారుల ప్రశంసలు లభిస్తాయి.
కుంభ రాశి: మీ శత్రువులు సైతం మీతో మిత్రుల వలె ప్రవర్తిస్తారు. విజ్ఞానం పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులు మెండుగా లభిస్తాయి.
మీన రాశి: విద్యార్థులకు ఇది స్వర్ణయుగమని చెప్పవచ్చు. చదువులో బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు, సంతానానికి సంబంధించిన విషయాలలో గొప్ప మానసిక ప్రశాంతత దక్కుతుంది.