చిత్తా నక్షత్రంలోకి సూర్యుడు - అక్టోబర్ 24 వరకు ఈ 4 రాశుల వారికి అదృష్టం, కుబేర యోగం!
గ్రహాల అధిపతి సూర్యుడు అంగారకుడికి చెందిన చిత్తా నక్షత్రంలోకి ప్రవేశించనున్నారు. ఈ నక్షత్ర మార్పుతో నాలుగు రాశుల వారికి విశేష ఆర్థిక లాభాలు, సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి.
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు, నక్షత్ర పరివర్తనకు అత్యంత ప్రాధాన్యత ఉంది. నవగ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు ప్రస్తుతం కన్యారాశిలో సంచరిస్తున్నారు. రాబోయే 11వ తేదీన సూర్యుడు తన నక్షత్రాన్ని మార్చుకుని, అంగారకుడి పాలనలో ఉండే చిత్తా నక్షత్రంలోకి ప్రవేశించనున్నారు.

హిందూ క్యాలెండర్, పంచాంగ గణనాల ప్రకారం….. సూర్య భగవానుడు అక్టోబర్ 24 మధ్యాహ్నం వరకు ఈ చిత్తా నక్షత్రంలోనే కొనసాగుతారు. జ్యోతిష్య నిపుణుల ప్రకారం సూర్యుడు జాతకంలో శుభ స్థానంలో ఉంటే వ్యక్తికి సమాజంలో అనూహ్యమైన పేరు, ప్రఖ్యాతలు, రాజయోగం, వర్చస్సు లభిస్తాయి. తన మిత్ర గ్రహమైన అంగారకుడి నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల మానసిక ధైర్యం, ఉత్సాహం పెరుగుతాయని ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ వివరించారు. ఈ నక్షత్ర సంచారం వల్ల కొంత దూకుడు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, నాలుగు నిర్దిష్ట రాశుల వారికి ఇది సువర్ణకాలాన్ని తెచ్చిపెడుతుందని ఆయన స్పష్టం చేశారు.
మేష రాశి :
కుజుడి నక్షత్రంలో సూర్యుని సంచారం మేష రాశి వారికి అత్యంత లాభదాయకంగా మారనుంది. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాలనైనా, సవాళ్లనైనా మీరు ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. ఆటంకాలు తొలగిపోయి మీ అదృష్టం వెలిగిపోతుంది. ఆర్థికంగా కలిసివచ్చే సమయం ఇది.
కర్కాటక రాశి :
ఉద్యోగస్తులకు మరియు వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆఫీసులో పైఅధికారులు, తోటి ఉద్యోగుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం మీ సొంతమవుతుంది. కెరీర్‌లో పదోన్నతులు, వేతన పెంపు పొందే సూచనలు స్పష్టంగా ఉన్నాయి.
ధనుస్సు రాశి :
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ సమయంలో ఊహించని శుభవార్తలు వింటారు. సంతానానికి సంబంధించిన పురోగతి, వార్తలు మనస్సుకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి నూతన పెట్టుబడులు కలసివస్తాయి.
మీన రాశి :
మీన రాశి వారికి ఈ నక్షత్ర మార్పు అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. పెద్దగా శ్రమ పడకుండానే అనుకున్న పనులను వేగంగా పూర్తి చేస్తారు. సుదీర్ఘకాలంగా వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. సంపద పెరిగి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

