చంద్ర–కుజ–గురు కలయికతో మహాయోగాలు.. ఈ రాశులకు బంపర్ ప్రయోజనాలు!
అక్టోబర్ 4, 2026 సాయంత్రం చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో, అక్కడే సంచరిస్తున్న గురుడు, కుజుడితో కలిసి త్రిగ్రహ కూటమి ఏర్పడిందని ఈ జ్యోతిష్య విశ్లేషణ చెబుతోంది. చంద్ర–గురువుల కలయికను గజకేసరి యోగంగా, చంద్ర–కుజుల కలయికను లక్ష్మీ యోగంగా పేర్కొంటున్నారు.
ఆకాశంలో గ్రహాల గమనం మానవ జీవితాలపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా మనసుకుకారకుడైన చంద్రుడు తన రాశిని మారుస్తూ అక్టోబర్ 4, 2026 సాయంత్రం 6:32 గంటలకు కర్కాటక రాశిలోకి ప్రవేశించారు. ఇప్పటికే ఆ రాశిలో గురుడు, కుజుడు సంచరిస్తుండటంతో అరుదైన త్రిగ్రహ కూటమి ఏర్పడింది. కర్కాటక రాశికి స్వయంగా చంద్రుడే అధిపతి కావడం, అందులోనూ నీచ భంగం లేని రీతిలో కుజుడు సంచారంలో ఉండటం ఈ యోగానికి మరింత విశేషమైన శక్తిని ఇస్తోంది.

ఈ అద్భుత గ్రహ సంచారం వల్ల ఏర్పడిన గజకేసరి మరియు లక్ష్మీ రాజయోగాల ప్రభావం ద్వాదశ రాశులపై ఏ విధంగా ఉండనుందో తెలుసుకుందాం "చంద్ర, కుజులు కలిసి లక్ష్మీ యోగాన్ని, చంద్ర, గురువులు కలిసి గజకేసరి యోగాన్ని ఏర్పరచడం మానవళికి అత్యంత లాభదాయకంగా ఉందని చెప్పచ్చు.
మేష రాశి: ఈ కాలంలో మీకు భూమి, ఇల్లు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది.
వృషభ రాశి: మీ పరాక్రమం పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ సంచలన విజయం సాధిస్తారు. సోదరుల సహకారం లభిస్తుంది.
మిథున రాశి: మీ మాటతీరుతోనే అసాధ్యమైన పనులను సులువుగా సుసాధ్యం చేసుకుంటారు. వ్యాపారంలో ధనలాభం కలగడంతో పాటు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
కర్కాటక రాశి: మీ సొంత రాశిలోనే ఈ రాజయోగాలు ఏర్పడటంతో జీవితంలో సరికొత్త మలుపులు తిరుగుతాయి. కొత్త ప్రేమ సంబంధాలు చిగురిస్తాయి. పాత బంధాలు మరింత పరిపక్వత చెందుతాయి. అదృష్టం పూర్తిగా వెన్నంటి ఉంటుంది.
సింహ రాశి: ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. అయితే ఈ ఖర్చులు ఎక్కువగా శుభకార్యాల నిమిత్తం జరుగుతాయి.
కన్య రాశి: ఆదాయ మార్గాలు రెట్టింపు అవుతాయి. పాత మార్గాల ద్వారా కూడా నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. తీర్థయాత్రలు లేదా విహారయాత్రలు చేసే సూచనలున్నాయి.
తులా రాశి: వ్యాపార రంగంలో కొత్త సంబంధాలు ఏర్పడతాయి. ప్రభుత్వ లేదా అధికార వర్గాల నుంచి ఊహించని మద్దతు లభిస్తుంది. తండ్రి గారి ద్వారా ఆర్థిక లబ్ధి పొందుతారు.
వృశ్చిక రాశి: అదృష్టం పూర్తిగా మీ వైపు ఉంటుంది. విదేశీ ప్రయాణాలు లేదా దూరపు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ధార్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు.
ధనుస్సు రాశి: కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనవసర రిస్క్‌లకు దూరంగా ఉంటూ ఈ కాలాన్ని జాగ్రత్తగా దాటాలి.
మకర రాశి: పెళ్లి ప్రయత్నాలు సానుకూలమవుతాయి. జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పదోన్నతులు, అధికారుల ప్రశంసలు లభిస్తాయి.
కుంభ రాశి: మీ శత్రువులు సైతం మీతో మిత్రుల వలె ప్రవర్తిస్తారు. విజ్ఞానం పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులు మెండుగా లభిస్తాయి.
మీన రాశి: విద్యార్థులకు ఇది స్వర్ణయుగమని చెప్పవచ్చు. చదువులో బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు, సంతానానికి సంబంధించిన విషయాలలో గొప్ప మానసిక ప్రశాంతత దక్కుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


