Most Attractive Rasis: ఆకర్షణీయమైన వ్యక్తిత్వం.. వీరు పుట్టుకతోనే లక్కీ! శుక్రుడి ప్రభావం ఉన్న రాశులివే

జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడి అనుగ్రహం ఉన్నవారు జీవితంలో సుఖసంతోషాలతో పాటు సమాజంలో ప్రత్యేక గుర్తింపును పొందుతారు. వీరి వ్యక్తిత్వం, ప్రవర్తన ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటాయి.

Published on: Jun 24, 2026 12:30 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. గ్రహాల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉన్నాయో చెప్పడంతో పాటు, భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలను చెప్పడానికి వీలవుతుంది.

Most Attractive Rasis: ఆకర్షణీయమైన వ్యక్తిత్వం.. వీరు పుట్టుకతోనే లక్కీ! శుక్రుడి ప్రభావం ఉన్న రాశులివే (pinterest)
Most Attractive Rasis: ఆకర్షణీయమైన వ్యక్తిత్వం.. వీరు పుట్టుకతోనే లక్కీ! శుక్రుడి ప్రభావం ఉన్న రాశులివే (pinterest)

గ్రహాలన్నింటిలో శుక్రుడు శుభప్రదమైన గ్రహం. మనిషి జీవితంలో సుఖాలు, విలాసాలు, ఆకర్షణ, వ్యక్తిత్వం ఎంతో ఉంటాయి. జాతకంలో శుక్రుడి స్థానం బలంగా ఉంటే, ఆ వ్యక్తికి సమాజంలో గుర్తింపు కూడా ఉంటుంది. ఎదుటివారిని ఆకర్షించే నేర్పు, ప్రేమ సంబంధాల్లో గాఢత వీరి సొంతం. కొన్ని రాశులపై శుక్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ఈ రాశుల వారు పుట్టుకతోనే అదృష్టవంతులు.. శుక్రుడి ప్రభావంతో ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు

1.వృషభ రాశి, తులా రాశి

ఈ రెండు రాశులకు అధిపతి కూడా శుక్రుడే. ఈ రాశుల వారు సహజంగా ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వినయంగా ఉంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా వారి ప్రవర్తన చాలా బాగుంటుంది. ఇతరులు కూడా వీరిని బాగా ఇష్టపడతారు.

ప్రేమ, వైవాహిక జీవితంలో నిజాయితీగా ఉంటారు. భాగస్వామికి పూర్తి అంకితభావంతో ఉంటారు. జీవిత భాగస్వామి నుంచి వీరికి అపారమైన ప్రేమ, గౌరవం లభిస్తాయి. అలాగే సమాజంలో వీరి మాట చెల్లుతుంది. అందరినీ ప్రభావితం చేసే శక్తి వీరిలో ఉంటుంది.

2.కన్యా రాశి

కన్యా రాశి వారి వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది. అందంలోనే కాదు, తెలివితేటల్లో కూడా పేరు పొందుతారు. అద్భుతమైన వాక్చాతుర్యం ఉంటుంది. మాటలతో ఎదుటివారి మనసును ఈజీగా గెలుచుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో ఎంతో బాధ్యతగా ఉంటారు. నమ్మకస్తులు.

వీరు వృత్తి, వ్యాపార రంగాల్లో బాగా రాణించగలరు. పైకి సాదాసీదాగా కనిపించినా, సహజసిద్ధమైన ఆకర్షణ ఇతరులను అయస్కాంతంలా ఆకట్టుకుంటుంది. శుక్రుడి అనుగ్రహంతో ఈ రాశుల వారు కేవలం బాహ్య సౌందర్యంతోనే కాదు, అంతర్గత విజ్ఞానంతో కూడా బాగా రాణించగలరు.

రాశి వారైనా సరే, తమ ప్రవర్తనను చక్కదిద్దుకోవాలంటే శుక్రుడి సానుకూల ఫలితాలను పొందేందుకు ప్రయత్నించాలి. అలా చేస్తే శుక్రుడి నుంచి సానుకూల ఫలితాలను చూడొచ్చు.

శుక్రుడి సానుకూల ఫలితాల కోసం ఏం చేయాలి?

తమ ప్రవర్తనను చక్కదిద్దుకోవడంతో పాటు, నిపుణుల సలహాతో శుక్రుడి అనుగ్రహం కోసం పరిహారాలు పాటించవచ్చు.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More