గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పులు చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు గ్రహాల సంచారంలో మార్పుల కారణంగా శుభ ఫలితాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. మరి కొన్నిసార్లు శుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి నెలా కూడా గ్రహాల సంచారంలో మార్పులు రావడం మనం చూస్తూ ఉంటాం.
నవ పంచమ రాజయోగం

మార్చి నెలలో చాలా శక్తివంతమైన నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఇది సూర్యుడు, గురువుల కారణంగా ఏర్పడనుంది. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశుల వారి కెరీర్, ఆర్థిక పరిస్థితుల్లో భారీ మార్పులు వస్తాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. అదృష్టం కూడా వెతుక్కుంటూ వస్తుంది. పురోగతిని చూస్తారు. సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. ఇలా ఒక్కటి కాదు, అనేక లాభాలు కలుగుతాయి.
మార్చి 5న నవపంచమ రాజయోగం, ఈ రాశులకు విపరీతమైన అదృష్టం
ఈ శక్తివంతమైన రాజయోగం కొన్ని రాశుల వారి జీవితాన్నే మార్చేయబోతోంది. ఇది సూర్యుడు, గురువుల కారణంగా ఏర్పడుతుంది. సూర్యుడు, గురువు మార్చి 5న ఒకదానికొకటి 120 డిగ్రీల కోణంలో ఉండడంతో ఈ రాజయోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారి అదృష్టం మారిపోతోంది. మరి ఏ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతారు? ఈ యోగంతో ఏ రాశుల వారి జీవితం ఒక్కసారిగా మారుతుందో తెలుసుకుందాం. ఆ అదృష్ట రాశుల్లో మీరు ఉన్నారేమో చూసుకోండి.
1.మేష రాశి
మేష రాశి వారికి నవ పంచమ రాజయోగం బాగా కలిసి రాబోతోంది. సూర్య, గురువుల కలయికతో ఏర్పడే ఈ రాజయోగం మీ అదృష్టాన్ని పెంచుతుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కూడా ఇది అద్భుతమైన సమయం. విదేశీ ప్రయాణాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. పని ప్రదేశంలో మీ పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో ఎక్కువ లాభాలు ఉంటాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. వైవాహిక జీవితంలో ప్రశాంతత, సంతోషం పెరుగుతాయి.
2.సింహ రాశి
{{/usCountry}}మేష రాశి వారికి నవ పంచమ రాజయోగం బాగా కలిసి రాబోతోంది. సూర్య, గురువుల కలయికతో ఏర్పడే ఈ రాజయోగం మీ అదృష్టాన్ని పెంచుతుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కూడా ఇది అద్భుతమైన సమయం. విదేశీ ప్రయాణాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. పని ప్రదేశంలో మీ పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో ఎక్కువ లాభాలు ఉంటాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. వైవాహిక జీవితంలో ప్రశాంతత, సంతోషం పెరుగుతాయి.
2.సింహ రాశి
{{/usCountry}}సింహ రాశి వారికి మార్చిలో ఏర్పడే నవ పంచమ రాజయోగం వివిధ లాభాలను కలిగిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం. పూర్వికుల నుంచి ఆస్తిని పొందుతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
3.వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు ఈ సమయంలో ఆనందంగా ఉంటారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు మీ చేతికి వస్తుంది. చాలా కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి ఈ సమయం ఉపశమనం కలిగిస్తుంది. ఊహించని విధంగా ఆర్థిక లాభాలు వస్తాయి. పాత ఇన్వెస్ట్మెంట్ల నుంచి డబ్బు అందుతుంది.
4.ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి ఈ రాజయోగం అద్భుతంగా మారిపోతుంది. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మతపరమైన కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది.
5.మీన రాశి
మీన రాశి వారికి ఈ రెండు ప్రధాన గ్రహాల కారణంగా ఏర్పడే ఈ యోగం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. విద్యార్థులకు కూడా మంచి మార్పులను తీసుకొస్తుంది. కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఇది శుభ సమయం. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. ఇలా మొత్తం మీద ఈ శుభయోగంతో అనేక మార్పులను చూస్తారు.