...
...
Next Story

నవరాత్రుల్లో ప్రతిరోజూ ఈ నియమాలు పాటించండి.. అమ్మవారికి ఇష్టమైన పూలు, మంత్రాలు ఇవే!

దసరా నవరాత్రులు దుర్గాదేవి తొమ్మిది రూపాలను ఆరాధించడానికి అత్యంత విశిష్టమైన రోజులు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారికి ఎర్రటి మందారాలు, గులాబీలు, బంతిపూలు, తామర పూలు వంటి పుష్పాలను సమర్పించవచ్చు. ప్రాంతీయ సంప్రదాయాలను బట్టి పూల సమర్పణలో మార్పులు ఉంటాయి.

Published on: Oct 12, 2026, 11:00:36 IST
Advertisement

దసరా నవరాత్రులు చాలా విశేషమైన, పవిత్రమైన రోజులు. ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో దుర్గాదేవి తొమ్మిది రూపాల్లో పూజలు చేస్తారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు.

నవరాత్రుల్లో ప్రతిరోజూ ఈ నియమాలు పాటించండి.. అమ్మవారికి ఇష్టమైన పూలు, మంత్రాలు ఇవే! (AI)
నవరాత్రుల్లో ప్రతిరోజూ ఈ నియమాలు పాటించండి.. అమ్మవారికి ఇష్టమైన పూలు, మంత్రాలు ఇవే! (AI)

ఒక్కో రోజు ఒక్కో అమ్మవారి రూపంలో అలంకరణ చేసి, పూలను సమర్పించి, మంత్రాలను జపించాలి. హిందూ సంప్రదాయంలో ఈ నవరాత్రులు చాలా విశేషమైనవి. నవరాత్రుల్లో అమ్మవారికి ఏ పూలను సమర్పించాలి? ఎలాంటి పరిహారాలను పాటించాలి? ప్రతి రోజూ చదువుకోవాల్సిన మంత్రాలు ఏవనేవి ఇప్పుడు తెలుసుకుందాం.

అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూలు ఇవి.. వీటితో ఆరాధించేటప్పుడు కచ్చితంగా సమర్పించండి

అమ్మవారి పూజలో పూలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎర్రటి మందారాలు, గులాబీలు, బంతిపూలు, తామర పూలు ఇలా రకరకాల పూలతో అమ్మవారిని ఆరాధించడం మంచిది. ఒక్కో అమ్మవారి రూపానికి సమర్పించే పూలు ప్రాంతీయ సంప్రదాయాన్ని బట్టి మారొచ్చు.

తెల్లటి పూలు: కొన్ని దేవతా రూపాల పూజల్లో కచ్చితంగా తెల్లటి పూలను సమర్పిస్తారు. ఈ పూలను సమర్పించడం వలన ప్రశాంతత, పవిత్రత కలుగుతాయి.

తామర పూలు: లక్ష్మీదేవి ఆరాధనలో తామర పూలను సమర్పించడం మంచిది.

బంతి పూలు: అమ్మవారి అలంకరణకు బంతిపూలను ఉపయోగించవచ్చు. వీటిని విరివిగా ఉపయోగిస్తారు.

గులాబీలు: భక్తి, ప్రేమ, సమర్పణకు ప్రత్యేకంగా గులాబీలను ఉపయోగిస్తారు.

ఎర్రటి మందారాలు: దుర్గాదేవి ఆరాధనలో ఎర్రటి మందారాలు విశేషంగా సమర్పించే పూలలో ఒకటి. కచ్చితంగా ఎర్రటి మందారాలను కూడా అమ్మవారికి సమర్పించేటట్టు చూసుకోవాలి.

నవరాత్రుల్లో ఏ స్తోత్రాలను చదివితే మంచిది?

నవరాత్రుల్లో కొన్ని స్తోత్రాలను పఠిస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. అవేంటో కూడా చూసేద్దాం.

దుర్గా చాలీసా: దుర్గాదేవి మహిమను స్మరించడానికి దుర్గా చాలీసా చదవడం వలన విశేషమైన ఫలితాలను చూడొచ్చు.

లలితా సహస్రనామం: లలితా పరమేశ్వరి సహస్రనామాల పఠనం చాలా విశేషమైనది. నవరాత్రుల్లో లలితా సహస్రనామం చదవడం మంచిది.

దేవీ కవచం: దుర్గా సప్తశతిలో భాగమైన రక్షా ప్రార్థనను కూడా కుదిరితే నవరాత్రుల్లో చదువుకోవడం మంచిది.

ప్రతిరోజూ అన్ని స్తోత్రాలు చదవాల్సిన అవసరం లేదు. మీకు తెలిసిన మంత్రాన్ని శ్రద్ధగా జపిస్తే కూడా విశేషమైన ఫలితాలు కనపడతాయి. అమ్మవారి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది.

నవరాత్రుల్లో ప్రతిరోజూ పాటించాల్సిన నియమాలు

ఉదయాన్నే స్నానం చేసి, పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. అమ్మవారికి దీపారాధన చేయాలి. పసుపు, కుంకుమలు, పూలు, అక్షతలను సమర్పించాలి.

ఆరోగ్యానికి, పరిస్థితులకు తగ్గట్టుగా సాత్విక ఆహారాన్ని తీసుకోవడం మంచిది. రోజూ కొంతసేపు మంత్రజపం, ప్రార్థన లేదా దేవీ స్తోత్రాలను పఠించండి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks