New Year 2026: ఈ ఏడాది మొదటి రోజే 9 శుభ యోగాలు, ఆ రోజు ఎంత శుభప్రదమో తెలుసుకోండి!

2026 ప్రారంభ రోజు అనగా న్యూ ఇయర్ నాడు తొమ్మిది శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ రోజు శుభత్వాన్ని ఈ తొమ్మిది యోగాలు మరింత పెంచబోతున్నాయి. సంవత్సరం ప్రారంభంలో గ్రహాల సంచారంలో కూడా మార్పు ఉండబోతోంది. మరి జనవరి 1న ఏర్పడే తొమ్మిది శుభయోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాం.

Published on: Dec 22, 2025, 16:30:23 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మరికొన్ని రోజుల్లో 2025 పూర్తవబోతోంది. 2026లోకి అడుగు పెట్టబోతున్నాము. 2025 బాగా కలిసి రావాలని అందరూ కోరుకుంటారు. 2026ను స్వాగతించడానికి అందరూ ఆసక్తిగా ఉన్నారు. 2026 మొదటి రోజు చాలా శుభప్రదమైనది. జ్యోతిష్యపరంగా, హిందూ మతపరంగా కూడా ఇది శుభ దినంగా పరిగణించబడుతోంది. జనవరి 1, 2026 ఎందుకు శుభదినం? ఆ రోజు విశిష్టత ఏమిటి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

New Year 2026: ఈ ఏడాది మొదటి రోజే 9 శుభ యోగాలు (pinterest)
New Year 2026: ఈ ఏడాది మొదటి రోజే 9 శుభ యోగాలు (pinterest)

2026 మొదటి రోజే తొమ్మిది శుభ యోగాలు

2026 ప్రారంభ రోజు అనగా న్యూ ఇయర్ నాడు తొమ్మిది శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ రోజు శుభత్వాన్ని ఈ తొమ్మిది యోగాలు మరింత పెంచబోతున్నాయి. సంవత్సరం ప్రారంభంలో గ్రహాల సంచారంలో కూడా మార్పు ఉండబోతోంది. మరి జనవరి 1న ఏర్పడే తొమ్మిది శుభయోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాం.

తొమ్మిది మహా సంయోగాలతో జనవరి 1, 2026

త్రయోదశి

జనవరి 1న పుష్య శుక్ల త్రయోదశి వచ్చింది. త్రయోదశి చాలా శుభప్రదమైనది. త్రయోదశి శివుని పూజకు అత్యంత విశిష్టమైనది. శివుని అనుగ్రహంతో జనవరి 1న సంవత్సరం ప్రారంభం కావడం శుభసూచకంగా భావించవచ్చు.

గురువారం విశేషం

హిందూ మతంలో గురువారాన్ని శుభదినంగా భావిస్తారు. గురువారం నాడు లక్ష్మీనారాయణులను ఆరాధిస్తారు. అలా వారిని ఆరాధించడం వలన చక్కటి ఫలితాలు లభిస్తాయి.

ప్రదోష వ్రతం

జనవరి 1 గురువారం, త్రయోదశి కావడంతో గురు ప్రదోష వ్రతం కూడా ఆ రోజే వచ్చింది. ఇది చాలా విశిష్టమైనది. 2026 సంవత్సరంలో మొదటి ప్రదోష వ్రతం ఆ రోజే కావడం విశేషం.

శుక్ల యోగం, శుభ నక్షత్రం, రవి యోగం, నందిపై శివవాసం

జనవరి 1న శుభయోగం ఏర్పడుతోంది. ఆ రోజున శుక్ల యోగం ఉదయం నుంచి సాయంత్రం 5:12 వరకు ఉంటుంది. శుక్ల యోగం సమయంలో కొత్త పనులు ప్రారంభించడం చాలా మంచిది. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది అనుకూలం. జనవరి 1న ఉదయం నుంచి రాత్రి వరకు రోహిణి నక్షత్రం ఉంటుంది. ఆ తర్వాత రాత్రి 10:48కి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది.

కొత్త సంవత్సరం మొదటి రోజున రవి యోగం ఏర్పడటం కూడా విశేషం. రవి యోగంలో సూర్యుడిని ఆరాధిస్తే అన్ని దోషాలు తొలగిపోతాయని నమ్మకం. న్యూ ఇయర్ నాడు నందిపై శివవాసం ఉండడం మరింత విశేషం. ఆ రోజున శివుడికి రుద్రాభిషేకం చేస్తే ఎంతో చక్కటి ఫలితాన్ని పొందవచ్చు.

చంద్రుని సంచారం

సంవత్సరం మొదటి రోజు, అంటే న్యూ ఇయర్ నాడు చంద్రుడు ఉన్నత రాశి అయిన వృషభ రాశిలో సంచారం చేస్తాడు. వృషభ రాశిలో చంద్రుడు ఉండడం వలన మానసిక శాంతి మరియు ఆనందం కలుగుతాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More