...
...
Next Story

నవంబర్ 19 నుంచి డిసెంబర్ 3 వరకు ఈ 6 రాశులకు మహర్దశ.. డబ్బు, ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేదు!

నవంబర్ 19, 2026న సూర్యుడు విశాఖ నక్షత్రం నుంచి శని అధిపత్యంలోని అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. డిసెంబర్ 3 వరకు ఇదే నక్షత్రంలో కొనసాగుతాడు. జ్యోతిష్య అంచనాల ప్రకారం, ఈ సంచారం వల్ల ఆరు రాశుల వారికి విశేషమైన శుభ ఫలితాలు కలగనున్నాయి.

Published on: Nov 11, 2026, 11:00:45 IST
Advertisement

సకల గ్రహాలకు ఆధిపత్యం వహిస్తున్న సూర్య భగవానుడు త్వరలో తన నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. ఆత్మవిశ్వాసం, కీర్తి ప్రతిష్టలు, అధికారానికి కారకుడైన సూర్యుడు ప్రస్తుతం విశాఖ నక్షత్రంలో సంచరిస్తుండగా, నవంబర్ 19, 2026న అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించనున్నారు. డిసెంబర్ 3, 2026 వరకు సూర్యుడు ఇదే నక్షత్రంలో కొనసాగుతారు.

నవంబర్ 19 నుంచి డిసెంబర్ 3 వరకు ఈ 6 రాశులకు మహర్దశ.. డబ్బు, ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేదు!
నవంబర్ 19 నుంచి డిసెంబర్ 3 వరకు ఈ 6 రాశులకు మహర్దశ.. డబ్బు, ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేదు!

జ్యోతిష్య నిపుణుల అంచనా ప్రకారం, అనురాధ నక్షత్రాధిపతి శని భగవానుడు. జ్యోతిష్య శాస్త్రంలో సూర్య, శనిల మధ్య తండ్రీకొడుకుల సంబంధం ఉన్నప్పటికీ, వీరిద్దరి మధ్య శతృత్వం ఉంటుందని చెబుతారు. అయినప్పటికీ, ఈ గోచార ప్రభావం వల్ల కొన్ని ప్రత్యేక రాశుల వారికి ఊహించని విధంగా ధనలాభం, కెరీర్ పరంగా గొప్ప పురోగతి లభించనుంది.

అనురాధ నక్షత్రంలోకి సూర్య సంచారం: ఎవరికి ఎలాంటి లాభం?

శని నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల అన్ని రాశులపై ప్రతికూల ప్రభావమే పడుతుందని అనుకోవడానికి వీలేదు. జాతకంలో సూర్యుని స్థానాన్ని బట్టి ఫలితాలు మారుతుంటాయి. వైదిక జ్యోతిష్య గణాంకాల ఆధారంగా, సూర్యుడి ఈ నక్షత్ర మార్పు దాదాపు 6 రాశుల వారికి అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. ఈ కాలంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభించడంతో పాటు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఉన్నత అవకాశాలు దక్కుతాయి.

1. మేష రాశి:

మేష రాశి వారికి ఈ గోచార కాలం ఎంతో శుభప్రదంగా ఉండబోతోంది. మీ జీవితంలో నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. పాత మార్గాల ద్వారా కూడా ధన ప్రాప్తి ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి పరిస్థితులు మరింత మెరుగ్గా మారుతాయి. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం లభించడం వల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఏదైనా శుభవార్త వినడం ద్వారా మీ మనస్సు ఎంతో సంతోషంగా ఉంటుంది.

2. మిథున రాశి:

కన్యా రాశి వారి జీవితంలో సానుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. మీరు చేపట్టబోయే నూతన కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆత్మీయుల అండదండలతో కష్టాలు తొలగిపోతాయి. గతంతో పోలిస్తే మీ ఆర్థిక పరిస్థితి ఎంతో బలపడుతుంది. కార్యాలయంలో మీ పనితీరుకు గుర్తింపు లభించి కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ అందనుంది.

4. తులా రాశి: పెట్టుబడుల నుంచి భారీ రాబడులు

తులా రాశి వారికి ఈ సూర్య గోచారం ఆర్థికంగా లాభదాయకంగా మారుతుంది. స్టాక్ మార్కెట్ లేదా ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలించి, కొత్త ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కి ఆర్థికంగా స్థిరపడతారు.

5. ధనుస్సు రాశి: లక్ష్యాలను సాధించే సమయం

ధనుస్సు రాశి వారికి సూర్యుడి ఈ సంచారం ద్వారా కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగంలో అద్భుతమైన విజయాలు సాధించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. మీ జీవితకాలపు కలలను లేదా ముఖ్యమైన లక్ష్యాలను సాధించడంలో సఫలమవుతారు. అనుకోని మార్గాల ద్వారా ధన లాభం కలుగుతుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. భౌతిక సుఖసౌకర్యాలు పెరుగుతాయి.

6. మీన రాశి: అప్పుల బాధల నుంచి విముక్తి

మీన రాశి వారికి ఈ కాలం ఆర్థికంగా తిరుగులేని పురోగతిని ఇస్తుంది. దీర్ఘకాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆఫీసులో మీపై ఉండే ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ పనితీరును చూసి పైఅధికారులు ప్రత్యేకంగా అభినందిస్తారు. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశాలు వస్తాయి. మీ ధైర్యసాహసాలు పెరగడం వల్ల ఆగిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks