పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన భాగం. పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. అయితే, పెళ్లి చేసుకోవడానికి కచ్చితంగా ఒక మంచి ముహూర్తం ఉండేటట్టు చూసుకుంటారు. శుభ ముహూర్తంలో పెళ్లి జరిగితే జీవితాంతం సంతోషంగా ఉండొచ్చని నమ్మకం.

హిందూ సంప్రదాయంలో దేవుత్థాన ఏకాదశి చాలా విశేషమైనది. ఆ రోజు విష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొంటాడు. మళ్లీ చాతుర్మాసం పూర్తయిన తర్వాతే శుభకార్యాలు జరుపుతారు. పెళ్లిళ్లు అయినా, గృహప్రవేశాలు, ఉపనయనాలు ఏమైనా సరే, చాతుర్మాసం పూర్తయ్యాక మొదలవుతాయి. నవంబర్ 20న దేవుత్థాన ఏకాదశి తర్వాత నుంచి మళ్లీ ముహూర్తాలు ఉన్నాయి. అలాగే, డిసెంబర్లో కూడా కొన్ని పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నవంబర్ 25 నుంచి డిసెంబర్ 2026 వరకు ఉన్న పెళ్లి ముహూర్తాల వివరాలు
నవంబర్ నెలలో కొన్ని పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే, డిసెంబర్లో కూడా కొన్ని పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి.
నవంబర్ 25, బుధవారం
నవంబర్ 26, 2026 గురువారం
డిసెంబర్ 2, 2026 బుధవారం
డిసెంబర్ 3, 2026 గురువారం
డిసెంబర్ 4, 2026 శుక్రవారం
డిసెంబర్ 5, 2026 శనివారం
డిసెంబర్ 6, 2026 ఆదివారం
డిసెంబర్ 11, 2026 శుక్రవారం
డిసెంబర్ 12, 2026 శనివారం
ఈ రోజుల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు వంటి వాటికి అనుకూలంగా ఉంది. ఈ తేదీల్లో పెళ్లిళ్లు జరుపుకోవాలని భావిస్తే, పంచాంగం, పురోహితుల సలహా మేరకు పెళ్లి ముహూర్తాన్ని నిర్ణయించుకోవడం మంచిది.
డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభం
డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. కాబట్టి, ఆ రోజు నుంచి మళ్లీ శుభకార్యాలకు బ్రేక్ పడుతుంది. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ ధనుర్మాసం అనేది మొదలవుతుంది. డిసెంబర్ 16, బుధవారం ఉదయం 10:20 నుంచి ధనుర్మాసం ప్రారంభం కాబోతోంది. జనవరి 14న సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఈ ధనుర్మాసం ముగుస్తుంది. మకర సంక్రాంతి పండుగ జనవరి 15న వచ్చింది.
ధనుర్మాసంలో ఏం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి?
{{/usCountry}}డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. కాబట్టి, ఆ రోజు నుంచి మళ్లీ శుభకార్యాలకు బ్రేక్ పడుతుంది. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ ధనుర్మాసం అనేది మొదలవుతుంది. డిసెంబర్ 16, బుధవారం ఉదయం 10:20 నుంచి ధనుర్మాసం ప్రారంభం కాబోతోంది. జనవరి 14న సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఈ ధనుర్మాసం ముగుస్తుంది. మకర సంక్రాంతి పండుగ జనవరి 15న వచ్చింది.
ధనుర్మాసంలో ఏం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి?
{{/usCountry}}ధనుర్మాసంలో పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు జరపకూడదు. కానీ కొన్నింటికి ధనుర్మాసం చాలా మంచిదే. ధనుర్మాసంలో చేసే పూజలు, దానాలు, జపాలు వంటివి అనేక రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. అలాగే, ధనుర్మాసంలో సూర్యుడిని ఆరాధించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. విష్ణువును కూడా పూజించచ్చు. మంత్రాలను జపిస్తే కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కీర్తనలు, భజనలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే కూడా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ధనుర్మాసంలో ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, సత్యనారాయణ స్వామి వ్రత కథను పారాయణం చేస్తే కూడా విశేషమైన ఫలితాన్ని పొందడానికి వీలవుతుంది.
ABOUT THE AUTHOR
పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు