నేటి నుంచే ధనుర్మాసం, ప్రతిరోజూ ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.. పూజా విధానం, పాటించాల్సిన నియమాలు తెలుసుకోండి!

ధనుర్మాసం నెల రోజులు కూడా విష్ణుమూర్తిని ప్రత్యేకించి ఆరాధించాలి. అలాగే పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు ధనుర్మాసం నెల రోజులు కూడా ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి, ఆవు పేడతో గొబ్బెమ్మలను పెట్టి, ప్రతిరోజు దీపారాధన చేసి పూజ చేస్తారు. భక్తిశ్రద్ధలతో ఇలా చేయడం వలన కోరిన వరుడు లభిస్తాడని నమ్ముతారు.

Published on: Dec 16, 2025 12:00 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈరోజు సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించాడు. ఈరోజు నుంచి జనవరి 14 వరకు ధనుర్మాసం ఉంటుంది. ధనుర్మాసం చాలా శుభప్రదమైనది. ఈ నెల రోజులు కూడా దేవతలకు బ్రహ్మ ముహూర్త కాలం కనుక, ధనుర్మాసంలో చేసే పూజలకు చాలా విశేషత ఉంటుంది. ధనుర్మాసంలో కొన్ని శుభకార్యాలు జరపరు. ధనుర్మాసంలో కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి. అలాగే ధనుర్మాసంలో ఏం చేయాలి అనే దాని గురించి కూడా ఈరోజు తెలుసుకుందాం.

నేటి నుంచే ధనుర్మాసం, ప్రతిరోజూ ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం (pinterest)
నేటి నుంచే ధనుర్మాసం, ప్రతిరోజూ ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం (pinterest)

నెల రోజులు విష్ణుమూర్తిని ప్రత్యేకించి ఆరాధించాలి

ధనుర్మాసం నెల రోజులు కూడా విష్ణుమూర్తిని ప్రత్యేకించి ఆరాధించాలి. అలాగే పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు ధనుర్మాసం నెల రోజులు కూడా ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి, ఆవు పేడతో గొబ్బెమ్మలను పెట్టి, ప్రతిరోజు దీపారాధన చేసి పూజ చేస్తారు. భక్తిశ్రద్ధలతో ఇలా చేయడం వలన కోరిన వరుడు లభిస్తాడని నమ్ముతారు.

ధనుర్మాసంలో వేటిని నైవేద్యంగా పెట్టాలి?

ధనుర్మాసంలో విష్ణువును ఆరాధించి మొదటి 15 రోజులు చక్కెర పొంగలి, పులగం నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత 15 రోజులు దద్దోజనాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇలా ధనుర్మాసంలో విష్ణుమూర్తికి ఈ నైవేద్యాలను సమర్పిస్తే విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు.

ధనుర్మాసంలో ఇలా పూజ చేయండి:

  1. ధనుర్మాసంలో ఉదయాన్నే నిద్ర లేచి దీపారాధన చేయండి. ఉదయం 6 గంటల కంటే ముందే దీపారాధన చేయండి. కనీసం 9 గంటల పైనే దీపారాధన చేసేటట్టు చూసుకోండి.
  2. ఆడవాళ్లు పూజ చేసేటప్పుడు కాళ్లకు పసుపు రాసుకుని, నుదిటిపై కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేసుకోవాలి.
  3. ఇల్లంతా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోండి.
  4. అలాగే ధనుర్మాసంలో నెల రోజులు కూడా నీళ్లలో పసుపు వేసుకుని స్నానం చేయడం మంచిది.
  5. ప్రతిరోజు సూర్యుడికి నీటితో అర్ఘ్యం సమర్పించండి. సూర్య నమస్కారాలు చేయండి. ప్రతి రోజు సూర్య నమస్కారాలు చేయలేకపోతే కనీసం ఆదివారం నాడు అయినా చేసేటట్టు చూసుకోండి.
  6. నెల రోజులు పూజ చేయలేని వారు ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం పూజ చేయడం మంచిది.
  7. ధనుర్మాసంలో పిండి దీపాలను వెలిగిస్తే కూడా విశేష ఫలితాన్ని పొందవచ్చు. ధనుర్మాసంలో నది స్నానం చేయడం వలన అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగుతుంది.
  8. ధనుర్మాసంలో వచ్చే సోమవారానికి కూడా ఎంతో విశిష్టత ఉంది. కాబట్టి ఆ రోజున శివుడిని ఆరాధిస్తే కటిక పేదరికం నుంచి బయటపడి ఐశ్వర్యవంతులు కావచ్చు.
  9. ధనుర్మాసంలో విష్ణు విగ్రహాన్ని ఇంట్లో పెట్టి అభిషేకం చేస్తే స్వామివారి అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చు.
  10. “ఓం కృష్ణ గోవిందా హరే మురారి”, “ఓం నమో భగవతే వాసుదేవాయ” వంటి మంత్రాలను పఠిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు.

తులసి పూజ

తులసి కోట ముందు దీపం వెలిగించి, తులసి మొక్కకు ప్రదక్షిణలు చేసి “తులసి నమః” అనే మంత్రాన్ని పఠిస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది.

ధనుర్మాసంలో సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకునేటట్టు చూసుకోండి. కుదిరితే దగ్గరలో ఉన్న గోశాలలకు వెళ్లి ఆవులకు ఆహారాన్ని పెట్టండి. ప్రతి శుక్రవారం సాయంత్రం ఇంటి ముందు రెండు దీపాలను వెలిగించేటట్టు చూసుకోండి. ఇలా ధనుర్మాసంలో వీటిని ఆచరించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More