న్యూమరాలజీ: 35 ఏళ్ల తర్వాత ఈ మూలాంకాల వారి అదృష్టమే మారుతుంది.. రాజయోగం వరిస్తుంది, కోటీశ్వరులు అవుతారు!
సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని నిర్దిష్ట తేదీల్లో జన్మించిన వ్యక్తుల జీవితం 35 ఏళ్ల వయసు దాటాక ఊహించని మలుపు తిరుగుతుంది. కెరీర్ పరంగా ప్రారంభంలో ఎత్తుపల్లాలను చవిచూసిన వీరు, ఆ తర్వాత కోటీశ్వరులుగా ఎదుగుతూ విలాసవంతమైన రాజభోగాలను అనుభవిస్తారు. ఆ అదృష్ట మూలాంకాలు ఏవో ఇక్కడ వివరంగా తెలుసుకోండి.
న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను న్యూమరాలజీ ఆధారంగా తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవడంతో పాటు, భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీలో రాడిక్స్ సంఖ్యలు ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటాయి. వాటి ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవడానికి వీలవుతుంది.

న్యూమరాలజీ ప్రకారం, ఏదైనా నెలలో ఈ తేదీల్లో పుట్టిన వారు 35 ఏళ్ల తర్వాత రాజయోగాన్ని పొందుతారు. 35 ఏళ్ల తర్వాత వారి అదృష్టమే మారిపోతుంది. అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి. విపరీతమైన రాజభోగాలను అనుభవిస్తారు. అప్పటివరకు కూడా ఈ తేదీల్లో పుట్టిన వారు శ్రమించాలి. కెరీర్లో గ్రోత్ కూడా 35 ఏళ్ల తర్వాత వస్తుంది. ఆర్థిక స్థిరత్వాన్ని కూడా చూస్తారు.
మరి ఆ అదృష్ట సంఖ్యలు ఏవి? 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగాన్ని అనుభవించే వారెవరు? అనే విషయాన్ని ఇప్పుడే చూసేద్దాం. ఈ సంఖ్యల్లో మీరు ఉన్నారేమో చూసుకోండి.
ఈ తేదీల్లో పుట్టిన వారికి 35 ఏళ్ల తర్వాత రాజయోగం వరిస్తుంది.. కోటీశ్వరులు కూడా అవుతారు!
మూలాంకం 4
ఏదైనా నెలలో 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినట్లయితే వారి మూలాంకం నాలుగు అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి రాహువు. రాహువు ప్రభావంతో ఈ తేదీల్లో పుట్టిన వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. 35 ఏళ్ల తర్వాత రాజయోగాన్ని కూడా అనుభవిస్తారు.
ఈ తేదీల్లో పుట్టిన వారు కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఏదైనా విషయం మీద ఆసక్తి కలిగితే లోతుగా తెలుసుకోవడమే ఇష్టపడతారు. యవ్వనంలో పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా, గందరగోళంగా ఉండొచ్చు. స్పష్టత కూడా ఉండకపోవచ్చు. అడ్డంకులు కూడా ఎదురవ్వచ్చు. కానీ 35 ఏళ్ల తర్వాత మాత్రం కెరీర్ పరంగా, వ్యక్తిగత జీవితం పరంగా అనేక విధాలుగా మార్పులు వస్తాయి. ఈ తేదీల్లో పుట్టిన వారు 35 ఏళ్ల తర్వాత కొత్త రికార్డులను కూడా సృష్టించగలరు. జీవితాంతం ఆనందంగా ఉంటారు. అన్నింటిలోనూ సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తారు.
మూలాంకం 3
ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినట్లయితే వారి మూలాంకం మూడు అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి గురువు. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా టాలెంటెడ్‌గా ఉంటారు. ఎల్లప్పుడూ పాజిటివ్‌గా ఉంటారు. అలాగే క్రియేటివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. కెరీర్లో అద్భుతంగా రాణిస్తారు.
అయితే కెరీర్ మొదట్లో కాస్త కష్టపడాల్సి ఉంటుంది. కానీ 35 ఏళ్ల తర్వాత విపరీతమైన గ్రోత్ చూస్తారు. సులువుగా విజయవంతులు అవుతారు. ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నాక ఈ తేదీల్లో పుట్టిన వారు మంచి గుర్తింపును పొందుతారు. చక్కటి పేరు ప్రతిష్ఠలను సంపాదిస్తారు.
మూలాంకం 8
ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టినట్లయితే వారి మూలాంకం 8 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి శని. శని అనుగ్రహంతో పుట్టిన వారు అద్భుతమైన మార్పులను చూస్తారు. అయితే యవ్వనంలో కాస్త కష్టపడాల్సి ఉంటుంది. కాకపోతే 35 ఏళ్ల తర్వాత అద్భుతమైన ఫలితాలను చూస్తారు.
ఈ తేదీల్లో పుట్టిన వారు క్రమశిక్షణతో ఉంటారు. విజయం కోసం కాస్త శ్రమించాల్సి ఉంటుంది. 35 ఏళ్ల తర్వాత ఈ తేదీల్లో పుట్టిన వారు మంచి గుర్తింపును పొందుతారు. కెరీర్లో కూడా బాగా రాణిస్తారు.
మూలాంకం 9
ఏదైనా నెలలో 9, 18, 27 తేదీల్లో పుట్టినట్లయితే వారి మూలాంకం 9 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి కుజుడు. కుజుడి అనుగ్రహంతో పుట్టిన వారు బాగా రాణిస్తారు. 35 ఏళ్ల తర్వాత అద్భుతమైన మార్పులను చూస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది. కెరీర్లో సక్సెస్ఫుల్ అవుతారు.
యవ్వనంలో కాస్త ఇబ్బందులు, ఎదుగుదల విషయంలో చిన్నచిన్న అడ్డంకులు, సమస్యలు ఉండొచ్చు. కానీ 35 ఏళ్ల తర్వాత మాత్రం అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. అద్భుతమైన మార్పులను చూస్తారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


