నవంబర్ నెలలో 12 రాశుల వారికి ఎలా ఉంటుంది? ఉద్యోగం, డబ్బు, ప్రేమ జీవితంపై ప్రభావం.. వారు నక్కతోక తొక్కినట్టే!
నవంబర్ 2026 నెలలో గ్రహాల గమనాన్ని ఆధారంగా చేసుకుని 12 రాశుల వారికి కెరీర్, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం, ప్రేమ, వైవాహిక జీవితానికి సంబంధించిన ఫలితాలను ఈ కథనం వివరిస్తోంది. నవంబర్ నెలలో 12 రాశుల వారికి ఎలా ఉంటుంది?
నవంబర్ నెలలోకి అడుగుపెట్టబోతున్నాము. వచ్చే నెలలో 12 రాశుల వారికి ఎలా ఉంటుంది? గ్రహాల గమనాన్ని ఆధారంగా 12 రాశుల వారి జీవితంలో ఎటువంటి మార్పులు కలుగుతాయి? ఏ రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి? ఎవరు ఎలాంటి ప్రయోజనాలను పొందుతారు? అనే వివరాలు తెలుసుకుందాం.

నవంబర్ 2026లో 12 రాశులకు ఎలా ఉంటుంది? మాస ఫలాలు తెలుసుకోండి
మేష రాశి
కెరీర్, ఆర్థిక ఫలితాలు: నవంబర్ నెలలో మేష రాశి వారికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, జాగ్రత్తగా బడ్జెట్‌ను చూసుకుని ఖర్చు పెట్టుకోవడం మంచిది. అలాగే, అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి.
ఆరోగ్య ఫలితాలు: ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. సరిపడా నిద్ర ఉండాలి. అలాగే, మంచి ఆహారాన్ని తీసుకోవాలి.
వైవాహిక జీవితం, ప్రేమ జీవితం: కమ్యూనికేషన్ ద్వారా మీ రిలేషన్‌షిప్‌ను బలపరచుకోవచ్చు. ముఖ్యమైన విషయాలను మీ భాగస్వామితో చెప్పడం మంచిది. అనవసరమైన టెన్షన్లు లేకుండా చూసుకోండి.
వృషభ రాశి
కెరీర్, వ్యాపారం: వృషభ రాశి వారికి కొత్త అగ్రిమెంట్లు వస్తాయి. వ్యాపార పరంగా కూడా బాగుంటుంది. ఆశతో వ్యవహరించడం మంచిదే.
ఆర్థిక ఫలితాలు: ఆర్థికపరంగా చూస్తే, ఈ రాశి వారు చిన్నచిన్న తప్పులు చేయడం వలన ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి, ఆదాయం, ఖర్చుల విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.
ఆరోగ్యం: ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి బాగానే ఉంటుంది. కాకపోతే, కొంచెం మానసికంగా ఇబ్బందిగా ఉంటుంది. మంచి ఆహారం తీసుకుని రెస్ట్ తీసుకోవడం మంచిది.
రిలేషన్షిప్: రిలేషన్షిప్ విషయానికి వస్తే, ఈ రాశి వారు ఎలాంటి సమస్యలు రాకుండా భాగస్వామితో అన్ని విషయాలను పంచుకుంటే ఏ విధమైన సమస్య ఉండదు.
మిథున రాశి
కెరీర్, వ్యాపారం: మిథున రాశి వారికి నవంబర్ నెలలో పాత ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తయి, కొత్త ప్రాజెక్టులు వస్తాయి. సరైన స్ట్రాటజీతో అడుగులు వేయడం మంచిది.
ఆర్థిక ఫలితాలు: ఆర్థికపరంగా బాగానే ఉంటుంది. జాగ్రత్తగా ఖర్చులను, సంపాదనను చూసుకోవడం వలన ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
ఆరోగ్యం: ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. కాకపోతే, చిన్నచిన్న టెన్షన్లు ఉంటాయి. జాగ్రత్తగా ఉండడం మంచిదే.
రిలేషన్షిప్, ప్రేమ జీవితం: ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది. భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
కర్కాటక రాశి
కెరీర్, వ్యాపారం: ఈ రాశి వారికి నవంబర్ నెలలో కొత్త బాధ్యతలు వస్తాయి. ఛాలెంజ్‌లను ధైర్యంగా ఎదుర్కొంటారు.
ఆర్థిక ఫలితాలు: ఆర్థికపరంగా బాగుంటుంది. కాకపోతే, చిన్నచిన్న ఒత్తిళ్లు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఆరోగ్యం: పనిని సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే ఒత్తిడి, నిరసనతో బాధపడాల్సి ఉంటుంది. రెగ్యులర్ రొటీన్‌ను కూడా ఫాలో అవ్వడం మంచిది.
రిలేషన్షిప్, ప్రేమ జీవితం: ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పెళ్లి కాని వారు తమ ప్రేమను మరో మెట్టు ఎక్కిస్తారు.
సింహ రాశి
కెరీర్, వ్యాపారం: సింహ రాశి వారు పని పట్ల, ఫ్యామిలీ పట్ల కాస్త బ్యాలెన్స్‌గా ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అది మీకు బాగా హెల్ప్ అవుతుంది.
ఆర్థిక ఫలితాలు: ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లయితే, అది విజయవంతంగా పూర్తవుతుంది. ఏ విషయంలోనూ తొందరపడటం మంచిది కాదు.
ఆరోగ్యం: మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ బాధ్యతలు పెరగడం వలన కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. డైలీ రొటీన్‌ను ఫాలో అవ్వడం మంచిది.
రిలేషన్షిప్: మాట్లాడేటప్పుడు కొత్త జాగ్రత్తగా మాట్లాడండి. లేకపోతే, రిలేషన్షిప్లో ఇబ్బందులు వస్తాయి. సరైన కమ్యూనికేషన్ ఉంటే రిలేషన్షిప్లో మాధుర్యం కూడా వస్తుంది.
కన్యా రాశి
కెరీర్, వ్యాపారం: కెరీర్, వ్యాపార పరంగా బాగుంటుంది. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తోటి వారి సపోర్ట్‌తో ముందుకు వెళ్తారు.
ఆర్థిక ఫలితాలు: ఆర్థికపరంగా బాగానే ఉంటుంది. అనవసరంగా సేవింగ్స్ చేయడం మానేయద్దు.
ఆరోగ్యం: ఆరోగ్యపరంగా బాగుంటుంది. వర్క్ చేసేటప్పుడు మధ్యమధ్యలో బ్రేక్ తీసుకోవడం మంచిది.
రిలేషన్షిప్: రిలేషన్షిప్ బాగుంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. భవిష్యత్తు ప్రణాళికలను భాగస్వామితో చర్చిస్తారు.
తులా రాశి
కెరీర్, వ్యాపారం: పాత సమస్యలన్నీ తొలగిపోతాయి. కొత్త పార్ట్నర్షిప్తో వ్యాపారంలో దూసుకువెళ్తారు. అన్ని విధాలుగా కలిసివస్తుంది.
ఆర్థిక ఫలితాలు: ఆర్థికపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి.
ఆరోగ్యం: ఆరోగ్యపరంగా బాగుంటుంది. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. సరైన నిద్ర కూడా ముఖ్యం.
రిలేషన్షిప్: భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. సహనంతో వ్యవహరిస్తే రిలేషన్షిప్ చాలా బాగుంటుంది.
వృశ్చిక రాశి
కెరీర్, వ్యాపారం: కెరీర్, వ్యాపార పరంగా బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారం ముందుకు వెళ్తుంది.
ఆర్థిక ఫలితాలు: ఒంటరిగా కూర్చుని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. నమ్మకమైన వారితో చర్చించి, ముందుకు వెళ్లడం మంచిది. అప్పుడే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.
ఆరోగ్యం: ఆరోగ్యపరంగా కాస్త ఒత్తిడి, ఆందోళన ఉండొచ్చు. అవసరమైతే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ఉండేటట్టు చూసుకోండి.
ప్రేమ జీవితం, రిలేషన్షిప్: రిలేషన్షిప్ బాగుంటుంది. చిన్న విషయాలకే కోప్పడడం మంచిది కాదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటే రిలేషన్షిప్ బ్రహ్మాండంగా ఉంటుంది.
ధనుస్సు రాశి
కెరీర్, వ్యాపారం: కెరీర్, వ్యాపార పరంగా ఈ రాశి వారికి బాగుంటుంది. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి.
ఆర్థిక ఫలితాలు: ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. ప్రాజెక్టులు పెరుగుతాయి. భవిష్యత్తు కోసం కొంత డబ్బును దాస్తారు.
ఆరోగ్యం: ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కాస్త నీరసంగా ఉండొచ్చు. డైలీ రొటీన్‌ను ఫాలో అవ్వండి.
రిలేషన్షిప్: చిన్నచిన్న అపార్థాలు వస్తూ ఉంటాయి. వాటిని పెద్దగా పట్టించుకోవద్దు. వాటంతట అవే పరిష్కారం అవుతాయి.
మకర రాశి
కెరీర్, వ్యాపారం: వ్యాపారస్తులకు బాగుంటుంది. కెరీర్లో ముందుకు వెళ్తారు. చిన్నచిన్న అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.
ఆర్థిక ఫలితాలు: ఆర్థికపరంగా బాగుంటుంది. కొత్త ప్రాజెక్టుల కారణంగా డబ్బు సమస్య ఉండదు. పురోగతి ఉంటుంది.
ఆరోగ్యం: ఆరోగ్యపరంగా బాగుంటుంది. కుటుంబ సభ్యుల కోసం ఎక్కువ శ్రమ పడడంతో పాటు, మీ ఆరోగ్యం విషయంలో కూడా కాస్త పట్టించుకోండి.
రిలేషన్షిప్: రిలేషన్షిప్ బాగుంటుంది. భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
కుంభ రాశి
కెరీర్, వ్యాపారం: కెరీర్, వ్యాపారంలో ఈ రాశి వారికి బాగుంటుంది. మీ గోల్స్‌పై దృష్టి పెట్టండి. పనిని జాగ్రత్తగా పూర్తి చేయండి.
ఆర్థిక ఫలితాలు: ఆర్థికపరంగా బాగుంటుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. సేవింగ్స్ చేస్తారు.
ఆరోగ్యం: ఆరోగ్యం బాగుంటుంది. కాకపోతే, కాస్త మానసిక ఒత్తిడి ఉండొచ్చు.
రిలేషన్షిప్: రిలేషన్షిప్ బాగుంటుంది. ప్రేమించిన వారితో సంతోషంగా ఉంటారు. చిన్నచిన్న మనస్పర్థలు వస్తాయి. కానీ, అవి పరిష్కారమైపోతాయి.
మీన రాశి
కెరీర్, వ్యాపారం: మీన రాశి వారికి కెరీర్, వ్యాపార పరంగా బాగుంటుంది. మీ స్కిల్స్‌ను సరిగ్గా వినియోగిస్తే బాగా కలిసివస్తుంది.
ఆర్థిక ఫలితాలు: ఆర్థికపరంగా బాగుంటుంది. కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి ఇది శుభ సమయం.
ఆరోగ్యం: ఆరోగ్యపరంగా బాగుంటుంది. రెగ్యులర్ రొటీన్‌ను ఫాలో అవ్వండి. చిన్నచిన్న సమస్యలు వస్తే నిపుణులను సంప్రదించడం మంచిది.
ప్రేమ జీవితం: ప్రేమ పరంగా బాగుంటుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే ప్రేమ జీవితం బాగా సాగుతుంది. సహనంతో ఉండండి. అనవసరంగా గొడవలు పడద్దు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


