చంద్రుడి రాశి మార్పు.. ఈ 7 రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు!

జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం, అక్టోబర్ 29, 2026 రాత్రి చంద్రుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. నవంబర్ 1వ తేదీ రాత్రి వరకు మిథున రాశిలో సంచరించనున్న చంద్రుడి గోచారం వల్ల ఏడు రాశుల వారికి అనుకూల ఫలితాలు కలగవచ్చని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి.    

Published on: Oct 29, 2026, 10:36:27 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

గ్రహాల గమనం మానవ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మనస్సుకారకుడైన చంద్రుడు రాశి మారుతున్న వేళ కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. అక్టోబర్ 29వ తేదీ రాత్రి చంద్ర భగవానుడు వృషభ రాశి నుంచి బుధుడి ఆధిపత్యం ఉన్న మిథున రాశిలోకి ప్రవేశించనున్నారు.

చంద్రుడి రాశి మార్పు.. ఈ 7 రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు!
చంద్రుడి రాశి మార్పు.. ఈ 7 రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు!

నవంబర్ 1వ తేదీ రాత్రి వరకు చంద్రుడు ఇదే రాశిలో సంచరించనున్నారు. చంద్రుడి ఈ రాశి మార్పు వల్ల ఏకంగా ఏడు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ సంచార కాలంలో మేషం మొదలుకుని మీనం వరకు ఏయే రాశుల వారు ఎలాంటి లాభాలు అందుకుంటారో తెలుసుకుందాం.

మేష రాశి:

చంద్రుడి రాశి మార్పు మేష రాశివారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ 29 రాత్రి నుంచి ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. చేపట్టే ప్రతి పనిలోనూ పూర్తి పట్టుదలతో వ్యవహరించి సక్సెస్ సాధిస్తారు. గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ వేగవంతం అవుతాయి. పెట్టిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది.

మిథున రాశి:

చంద్రుడు నేరుగా మీ సొంత రాశిలోకి ప్రవేశిస్తుండటంతో మిథున రాశి వారికి రాబోయే కొన్ని రోజులు ఎంతో సానుకూలంగా ఉంటాయి. మనసు ప్రశాంతంగా, ఉల్లాసంగా మారుతుంది. ఇతరులతో మాట్లాడే తీరు ద్వారానే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు జరగడంతో పాటు కొత్త ప్రయాణాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం.

సింహ రాశి:

సూర్యుడి ఆధిపత్యం గల సింహ రాశి వారికి ఈ గోచార కాలంలో ఆర్థికపరమైన లాభాలు అందే బలమైన సూచనలున్నాయి. ఊహించని మార్గాల నుంచి ధనలాభం కలగడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన పనులన్నీ ఆర్థిక సహకారంతో పూర్తవుతాయి. ఈ కాలంలో చేసే చిన్నపాటి ప్రయాణాలు కూడా భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి.

కన్యా రాశి:

కన్యా రాశి వారికి చంద్రుడి సంచారం అదృష్టాన్ని తెచ్చిపెడుతోంది. ఉద్యోగస్తులకు ఆఫీస్‌లో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలతో పాటు అనుకూలమైన మార్పులు ఉంటాయి. ప్రభుత్వ రంగం నుంచి ఊహించని లబ్ధి చేకూరుతుంది. వ్యాపారస్తులకు నూతన లాభాలు అందడంతో పాటు, కొత్త ప్లానింగ్‌లు సమర్థవంతంగా అమలవుతాయి.

తులా రాశి:

తులా రాశి వారికి ఈ గోచార సమయంలో అదృష్టం పూర్తిగా వెన్నంటి ఉంటుంది. గత కొంతకాలంగా వివిధ కారణాల వల్ల ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా ముందుకు కదులుతాయి. సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారంతో మానసిక ఉత్సాహం పెరుగుతుంది.

ధనుస్సు రాశి:

మిథున రాశిలో చంద్రుడి సంచారం ధనుస్సు రాశి వారి వైవాహిక జీవితంలో కొత్త వెలుగులు నింపుతుంది. భాగస్వామితో గతంలో ఉన్న మనస్పర్థలు, పొరబాట్లు తొలగిపోయి బంధం మరింత బలపడుతుంది. ఇద్దరూ కలిసి సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఓపికతో వ్యవహరిస్తే సంసారంలో సంతోషం వెల్లివిరుస్తుంది.

మీన రాశి:

చంద్రుడి గమనం మీన రాశి వారికి మానసిక ప్రశాంతతను, ఆనందాన్ని ఇస్తుంది. ఆస్తి, భూములు లేదా నూతన వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి సమయం. దీనికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆర్థిక పరమైన ముందడుగు వేయడానికి ఈ కాలం ఎంతో అనుకూలంగా ఉంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More