మనం ఏ తేదీన పుట్టాం అనే అంశం మన వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తును నిర్ణయిస్తుందని సంఖ్యా శాస్త్రం నిపుణులు చెబుతుంటారు. కొందరు పుట్టుకతోనే అపారమైన మేధాశక్తిని కలిగి ఉంటారు. చిన్నప్పటి నుంచే వీరి ఆలోచనలు మిగతా వారితో పోలిస్తే ఎంతో భిన్నంగా, చురుగ్గా ఉంటాయి. వీరిని ఎవరూ వెనక్కి నెట్టలేరు. ఏ రంగంలో అడుగుపెట్టినా అక్కడ తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. 1, 5, 9 మూలాంకాలు కలిగిన వారిలో ఇలాంటి అద్భుత లక్షణాలు కనిపిస్తాయి. వారి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు లోతుగా చూద్దాం.
రాజసం ఉట్టిపడే మూలాంకం 1

ఏ నెలలోనైనా 1, 10, 19 లేదా 28వ తేదీల్లో మీరు జన్మించి ఉంటే, మీ మూలాంకం 1 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి సూర్య భగవానుడు. గ్రహాలకు రాజు సూర్యుడు కాబట్టి, ఈ తేదీల్లో పుట్టిన వారిలో ఆ రాజసం, నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి.
వీరు ఎవరి కింద పని చేయడానికి ఇష్టపడరు. సొంతంగా ఎదగాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరి ఆత్మవిశ్వాసమే వీరిని గెలుపు తీరాలకు చేరుస్తుంది. ఏ ఆఫీసులో ఉన్నా వీరు బాస్ లాగే పని చేస్తారు. సమస్య ఏదైనా సరే, ధైర్యంగా ముందుండి నడిపిస్తారు.
తెలివితేటలకు మారుపేరు మూలాంకం 5
5, 14 లేదా 23వ తేదీల్లో పుట్టిన వారి మూలాంకం 5. ఈ సంఖ్యకు బుధ గ్రహం అధిపతి. జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని బుద్ధికి, వ్యాపారానికి కారకుడిగా భావిస్తారు. అందుకే ఈ తేదీల్లో పుట్టిన వారు అద్భుతమైన తెలివితేటలు కలిగి ఉంటారు. ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా చిటికెలో పరిష్కరించగల చతురత వీరి సొంతం.
వీరి మాట్లాడే తీరు, ఎదుటివారిని ఆకట్టుకునే గుణం చాలా గొప్పగా ఉంటాయి. ముఖ్యంగా బిజినెస్ రంగంలో వీరికి తిరుగుండదు. డబ్బును ఎలా సంపాదించాలి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అనే విషయంలో వీరి తర్వాతే ఎవరైనా. పరిస్థితులు ఎలా ఉన్నా తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వీరు దిట్ట.
ధైర్య సాహసాల మూలాంకం 9
ఏ నెలలోనైనా 9, 18 లేదంటే 27వ తేదీల్లో పుట్టిన వారిది మూలాంకం 9. ఈ సంఖ్యకు కుజుడు అధిపతి. కుజుడు అంటేనే శక్తికి, ధైర్యానికి ప్రతీక. ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా కనిపిస్తారు. ఏ సవాలునైనా, రిస్క్‌నైనా స్వీకరించడానికి వీరు అస్సలు వెనుకాడరు.
{{/usCountry}}ఏ నెలలోనైనా 9, 18 లేదంటే 27వ తేదీల్లో పుట్టిన వారిది మూలాంకం 9. ఈ సంఖ్యకు కుజుడు అధిపతి. కుజుడు అంటేనే శక్తికి, ధైర్యానికి ప్రతీక. ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా కనిపిస్తారు. ఏ సవాలునైనా, రిస్క్‌నైనా స్వీకరించడానికి వీరు అస్సలు వెనుకాడరు.
{{/usCountry}}ఏదైనా ఒక పనిని మొదలుపెడితే అది పూర్తయ్యే వరకు నిద్రపోరు. వీరిలో ఉండే పట్టుదల చూసి శత్రువులు కూడా ఆశ్చర్యపోతారు. క్రీడలు, డిఫెన్స్ లేదా ఏదైనా పోటీ రంగాల్లో వీరు ఎప్పుడూ టాప్ పొజిషన్‌లోనే ఉంటారు. వీరిలో ఉండే పోరాట పటిమ ఎందరికో స్ఫూర్తినిస్తుంది.
గమనిక: పైన తెలిపిన వివరాలు అంకశాస్త్ర నిపుణుల అభిప్రాయాలు, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించాం. వీటిని పూర్తిగా విశ్వసించే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం ఉత్తమం.