న్యూమరాలజీలో, సంఖ్య 3 (ఏదైనా నెల యొక్క పుట్టిన తేదీ 3, 12, 21 లేదా 30) కి అధిపతి గురువు. జ్ఞానం, తెలివితేటలు, అదృష్టానికి ప్రతీకగా గురువును పరిగణిస్తారు. నెంబరు 3 వ్యక్తులు సాధారణంగా సృజనాత్మకతో వుంటారు. ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది. గురువు అనుగ్రహం ఎల్లప్పుడూ వీరిపై ఉంటుంది. ఇది వారికి గొప్ప విజయం, గౌరవం, జీవితంలోని పురోగతిని ఇస్తుంది. అయితే, కొన్ని పోరాటాలు ప్రారంభ జీవితంలో కూడా కనిపించవచ్చు. మరి ఇక నెంబరు 3 వ్యక్తుల వ్యక్తిత్వం, బలాలు, బలహీనతలు గురించి మనం వివరంగా తెలుసుకుందాం.
నెంబర్ 3 వారు ఎలా ఉంటారు?

నెంబరు 3 ఉన్న వ్యక్తులు ఆత్మగౌరవం కలిగి ఉంటారు. వీరు ఎవరికీ అంత తేలికగా తల వంచరు. హుందాతనాన్ని కాపాడుకోవడానికి ఇష్టపడతారు. వీరికి సృజనాత్మకత, ఊహాశక్తి, కమ్యూనికేషన్ నైపుణ్యాలపై మంచి పట్టు ఉంటుంది. వారు ఉల్లాసమైన, ఉత్సాహభరితమైన, స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ప్రజలు వీరి సాంగత్యాన్ని ఆస్వాదిస్తారు.
ఈ రంగాల్లో బాగా రాణిస్తారు
గురువు దయతో, ఈ వ్యక్తులు జ్ఞానం వైపు ఆకర్షితులవుతారు. తరచుగా ఉపాధ్యాయులు, సలహాదారులు లేదా మార్గదర్శకులుగా వుంటారు. వీరు సానుకూల, ఆశావాద స్వభావాన్ని కలిగి ఉంటారు, కానీ కొన్ని సార్లు మొండిగా కూడా ఉంటారు. ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది.
బలాలు మరియు సానుకూల లక్షణాలు:
నెంబరు 3 ఉన్న వ్యక్తులు సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యాలలో ముందుంటారు. వీరు మంచి వక్తలు, రచయితలు, కళాకారులు కావచ్చు. ఉత్సాహంతో వుంటారు. టీమ్ వర్క్ బాగా తెలుసు. గురువు దయతో, వీరు జ్ఞానాన్ని సంపాదించడంలో, ఇతరులకు బోధించడంలో నిష్ణాతులు. వారి సానుకూల దృక్పథం క్లిష్ట సమయాల్లో కూడా ముందుకు సాగడానికి బలాన్ని ఇస్తుంది. చాలా సార్లు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కూడా విజయం సాధిస్తారు.
కెరీర్, ప్రొఫెషనల్ లైఫ్:
నెంబరు 3 వ్యక్తులు సృజనాత్మక రంగాలలో మెరుగ్గా రాణిస్తారు. రైటింగ్, ఆర్ట్, మీడియా, టీచింగ్, కౌన్సెలింగ్, జర్నలిజం, మార్కెటింగ్, మేనేజ్మెంట్ వంటి రంగాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. గురువు దయతో ముప్పై, నలభైల్లో అదృష్టం ప్రకాశిస్తుంది. వీరు తమ కెరీర్‌లో పురోగతిని సాధిస్తారు. వీరు మంచి టీచర్లు, మోటివేషనల్ స్పీకర్లు లేదా కన్సల్టెంట్లు కావచ్చు. సృజనాత్మక ఆలోచనలు వ్యాపారంలో విజయానికి దారితీస్తాయి. అయితే క్రమశిక్షణను పాటించడం ముఖ్యం.
ప్రేమ, వైవాహిక జీవితం:
{{/usCountry}}నెంబరు 3 వ్యక్తులు సృజనాత్మక రంగాలలో మెరుగ్గా రాణిస్తారు. రైటింగ్, ఆర్ట్, మీడియా, టీచింగ్, కౌన్సెలింగ్, జర్నలిజం, మార్కెటింగ్, మేనేజ్మెంట్ వంటి రంగాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. గురువు దయతో ముప్పై, నలభైల్లో అదృష్టం ప్రకాశిస్తుంది. వీరు తమ కెరీర్‌లో పురోగతిని సాధిస్తారు. వీరు మంచి టీచర్లు, మోటివేషనల్ స్పీకర్లు లేదా కన్సల్టెంట్లు కావచ్చు. సృజనాత్మక ఆలోచనలు వ్యాపారంలో విజయానికి దారితీస్తాయి. అయితే క్రమశిక్షణను పాటించడం ముఖ్యం.
ప్రేమ, వైవాహిక జీవితం:
{{/usCountry}}సంబంధాలలో స్థిరత్వాన్ని కాపాడుకోవడం వారికి సవాలుగా ఉంటుంది. వీరి ప్రేమ వ్యవహారాలు తరచూ హెచ్చు తగ్గులతో నిండి ఉంటాయి. వివాహం ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఉండవచ్చు. అయితే అవగాహన మరియు అంకితభావంతో వైవాహిక జీవితం సంతోషంగా మారుతుంది. బృహస్పతి దయతో తెలివైన, సహాయక భాగస్వామిని పొందే అవకాశం ఉంది.
ఆరోగ్యం, పరిహారాలు:
నెంబరు 3 ఉన్న వ్యక్తులు కొన్నిసార్లు తమ రూపం లేదా సామర్థ్యాల గురించి అభద్రతకు గురవుతారు, ఇది ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపుతుంది. వీరికి అతిగా ఆలోచించే అలవాటు ఉండవచ్చు. ఆరోగ్య పరంగా జీర్ణ సమస్యలు లేదా మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. గురువు దయతో ఈ బలహీనతలను అధిగమించవచ్చు, అయితే క్రమశిక్షణ, సానుకూల ఆలోచన చాలా ముఖ్యం.
ఇలా చేస్తే కలిసి వస్తుంది
సంఖ్య 3ను గురువు (బృహస్పతి) పరిపాలిస్తాడు. గురువారం ఉపవాసం ఉండటం, పసుపు రంగు దుస్తులు ధరించడం, అరటిపండ్లను దానం చేయడం మంచిది.
“ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః” అనే మంత్రాన్ని జపించడం వారి అదృష్టాన్ని ప్రకాశవంతం చేయడానికి సహాయపడుతుంది.
గురువు దయతో వీరి మేధస్సు పదునుగా మారుతుంది. వీరు జీవితంలో గౌరవం మరియు విజయాన్ని పొందుతారు. క్రమశిక్షణ మరియు సానుకూల దృక్పథాన్ని పాటిస్తే మంచిది.