నవపంచమ రాజయోగం: బుధ, గురువుల అనుగ్రహంతో గోల్డెన్ డేస్.. వివాహం, డబ్బు, ఉద్యోగాలు.. వీరిలో మీరూ ఉన్నారేమో చూసుకోండి!
జ్యోతిష లెక్కల ప్రకారం ఏప్రిల్ 3న బుధుడు, గురువు 120 డిగ్రీల వద్ద ఉంటారు. దీంతో నవపంచమ యోగం ఏర్పడుతుంది. ఇది రాశుల వారి అదృష్టాన్ని పెంచుతుంది. అలాగే అనేక విధాలుగా లాభాలను తీసుకు వస్తుంది. మరి ఏప్రిల్ 2 నుంచి అదృష్టాన్ని పొందబోయే రాశులు ఎవరు, నవ పంచమ రాజయోగంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అందరి పై ప్రభావాన్ని చూపిస్తుంది. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏప్రిల్ 3న బుధుడు, గురువు 120 డిగ్రీల కోణంలో ఉంటారు. దీంతో ఈ రెండు గ్రహాల కలయిక వలన నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఇది 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది, కానీ కొన్ని రాశుల వారు మాత్రమే ఎక్కువ లాభాలను పొందుతారు.

జ్యోతిష లెక్కల ప్రకారం ఏప్రిల్ 3న బుధుడు, గురువు 120 డిగ్రీల వద్ద ఉంటారు. దీంతో నవపంచమ యోగం ఏర్పడుతుంది. ఇది రాశుల వారి అదృష్టాన్ని పెంచుతుంది. అలాగే అనేక విధాలుగా లాభాలను తీసుకు వస్తుంది. మరి ఏప్రిల్ 2 నుంచి అదృష్టాన్ని పొందబోయే రాశులు ఎవరు, నవ పంచమ రాజయోగంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.
మరి కొన్ని రోజుల్లో నవపంచమ రాజయోగం.. ఈ రాశుల వారికి విపరీతమైన లాభాలు తీసుకు రానుంది
1.మేష రాశి:
మేష రాశి వారికి ఈ యోగం శుభ ఫలితాలను తీసుకు వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఉద్యోగ పరంగా అనేక లాభాలను పొందుతారు. ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. ప్రమోషన్లు రావచ్చు. కొత్త ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే బిజినెస్‌లో బాగా కలిసి వస్తుంది.
2.మిథున రాశి:
మిథున రాశికి కూడా ఈ నవపంచమ రాజయోగం అనేక విధాలుగా లాభాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు భారీగా లాభాలను పొందుతారు. పెద్ద పెద్ద డీల్స్‌ను పొందుతారు. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన గొడవలు తొలగిపోతాయి. ఆర్థికపరంగా లాభాలు కలుగుతాయి.
3.సింహ రాశి:
సింహ రాశి వారికి ఇది శుభ ఫలితాలను అందిస్తుంది. నవపంచమ రాజయోగంతో ఈ రాశి వారు కూడా భారీగా లాభాలను పొందుతారు. ఇది రాశి వారికి గోల్డెన్ సమయం అని చెప్పొచ్చు. విద్యార్థులు కాంపిటేటివ్ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. అలాగే ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి.
4.తులా రాశి:
తులా రాశి వారికి నవపంచమ రాజయోగం విపరీతమైన లాభాలను తీసుకు వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఎప్పటి నుంచో పెళ్లి కాక ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారంలో భారీగా లాభాలు వస్తాయి. ఉద్యోగంలో కూడా అనేక మార్పులు వస్తాయి.
5.ధనుస్సు రాశి:
ధనుస్సు రాశికి అధిపతి గురువు. ఈ రాశి వారు కూడా అనేక విధాలుగా లాభాలను పొందుతారు. నవపంచమ రాజయోగంతో దూర ప్రయాణాలు చేస్తారు. ప్లాన్ చేసిన పనులు అన్నిటిని కూడా అడ్డంకులు లేకుండా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


