సంఖ్యాశాస్త్రం (Numerology) ప్రకారం మీ పుట్టిన తేదీ కేవలం ఒక అంకె మాత్రమే కాదు, అది మీ భవిష్యత్తుకు దిక్సూచి. కొన్ని నిర్దిష్టమైన తేదీల్లో పుట్టిన వారికి అదృష్టం వరిస్తుంది, కానీ వారు చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆ అదృష్టం కాస్తా దురదృష్టంగా మారే ప్రమాదం ఉంది.

న్యూమరాలజీలో పుట్టిన తేదీల మొత్తం (మూలాంకం) ఆధారంగా ఒక వ్యక్తి స్వభావం, బలాలు, బలహీనతలు, కెరీర్ వృద్ధిని అంచనా వేయవచ్చు. ముఖ్యంగా మూడు మూలాంకాలకు చెందిన వ్యక్తులు తమ వృత్తిపరమైన జీవితంలో అద్భుతమైన వృద్ధిని సాధిస్తారు. అయితే, వీరు తమ పనితీరులో చేసే చిన్న చిన్న తప్పులే వీరి ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తాయి. వారు ఎవరు? వారు చేయకూడని తప్పులేంటో ఇప్పుడు చూద్దాం.
1. మూలాంకం 1 (ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినవారు)
కెరీర్ వృద్ధిలో మూలాంకం 1 ఉన్నవారు ఎప్పుడూ ముందంజలో ఉంటారు. ఈ సంఖ్యకు సూర్యుడు అధిపతి. సూర్యుని శక్తి వల్ల వీరిలో అపారమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది.
బలాలు: వీరు కష్టపడటానికి అస్సలు వెనుకాడరు. కొత్త బాధ్యతలు స్వీకరించడం వీరికి ఇష్టం. నాయకత్వ లక్షణాలు (Leadership qualities) వీరి సొంతం.
చేయకూడని తప్పు: మూలాంకం 1 వారు సహజంగానే మొండి పట్టుదలతో ఉంటారు. ఎదుటివారు ఇచ్చే సలహాలను లేదా సూచనలను అస్సలు పట్టించుకోరు. దీనివల్ల వృత్తిలో విరోధులు పెరుగుతారు. వీరు ఒంటరిగా కాకుండా టీమ్ వర్క్ చేస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు.
2. మూలాంకం 5 (ఏదైనా నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టినవారు)
ఈ మూలాంకానికి అధిపతి బుధుడు. బుధుని ప్రభావం వల్ల వీరి తెలివితేటలు చాలా వేగంగా ఉంటాయి. మార్కెటింగ్, బిజినెస్ రంగాల్లో వీరు రారాజులుగా వెలుగొందుతారు.
{{/usCountry}}ఈ మూలాంకానికి అధిపతి బుధుడు. బుధుని ప్రభావం వల్ల వీరి తెలివితేటలు చాలా వేగంగా ఉంటాయి. మార్కెటింగ్, బిజినెస్ రంగాల్లో వీరు రారాజులుగా వెలుగొందుతారు.
{{/usCountry}}బలాలు: వీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎప్పుడూ ఉత్సాహం చూపిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తమను తాము మార్చుకుంటారు.
చేయకూడని తప్పు: వీరికి నిలకడ తక్కువ. ఏదైనా ఒక పనిని ఎక్కువ కాలం ఏకాగ్రతతో చేయలేరు. త్వరగా బోర్ ఫీల్ అవుతుంటారు. ఒకే లక్ష్యంపై దృష్టి పెట్టి, కాస్త ఓర్పుతో (Patience) వ్యవహరిస్తే వీరికి విజయం వరిస్తుంది.
3. మూలాంకం 8 (ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టినవారు)
ఈ మూలాంకానికి అధిపతి శని దేవుడు. శని ప్రభావం వల్ల వీరు క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటారు. వీరికి విజయం ఆలస్యంగా లభించినా, అది చాలా స్థిరంగా ఉంటుంది.
బలాలు: వీరు అత్యంత కష్టజీవులు. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించరు. సమాజంలో గొప్ప పేరు సంపాదిస్తారు.
చేయకూడని తప్పు: ఎక్కువ పని ఒత్తిడి తెచ్చుకుంటారు. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరిగి ఆరోగ్య సమస్యలు రావచ్చు. పనికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యత (Balance) పాటించడం వీరికి చాలా ముఖ్యం.
సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ మూడు మూలాంకాల వారు అపారమైన కెరీర్ వృద్ధిని కలిగి ఉంటారు. అయితే పైన పేర్కొన్న చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకుంటే, విజయం వీరి వెంటే ఉంటుంది. మీ పుట్టిన తేదీని బట్టి మీ బలాన్ని గుర్తించి ముందుకు సాగండి.