...
...
Next Story

ఈ తేదీల్లో పుట్టిన వారికి కొంత కాలం కష్టపడిన తర్వాతే సక్సెస్ వస్తుంది.. కోటీశ్వరులు అయ్యిపోతారు!

జ్యోతిషశాస్త్రంలో న్యూమరాలజీ కూడా ఒక ముఖ్యమైన భాగం. న్యూమరాలజీలో రాడిక్స్ సంఖ్య ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటాయి. అయితే ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం చాలా కష్టాలను ఎదుర్కొని సక్సెస్‌ను అందుకుంటారు, కోటీశ్వరులు అవుతారు. మరి ఆ అదృష్ట సంఖ్యలు ఎవరు? ఈ సంఖ్యలో మీరు ఒకరేమో చూసుకోండి.

Published on: Jan 9, 2026, 14:00:48 IST
Advertisement

న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ప్రకారం చూసినట్లయితే ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయో చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలను తెలుసుకోవచ్చు. మనకు న్యూమరాలజీలో రాడిక్స్ సంఖ్య ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటాయి. ఈ సంఖ్యల ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవచ్చు.

ఈ తేదీల్లో పుట్టిన వారు కొంత కాలం కష్టపడిన తర్వాత సక్సెస్ వస్తుంది (pinterest)
ఈ తేదీల్లో పుట్టిన వారు కొంత కాలం కష్టపడిన తర్వాత సక్సెస్ వస్తుంది (pinterest)

జ్యోతిషశాస్త్రంలో న్యూమరాలజీ కూడా ఒక ముఖ్యమైన భాగం. అయితే ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం చాలా కష్టాలను ఎదుర్కొని సక్సెస్‌ను అందుకుంటారు, కోటీశ్వరులు అవుతారు. మరి ఆ అదృష్ట సంఖ్యలు ఎవరు? ఈ సంఖ్యలో మీరు ఒకరేమో చూసుకోండి.

రాడిక్స్ సంఖ్య 8

ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 8 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి శని న్యాయదేవుడు. మనం చేసే పనులను బట్టి ఫలితాలు ఇస్తాడు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలను, చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితాలను ఇస్తాడు. ఈ సంఖ్య వారు కష్టాలను ఎదుర్కొన్న తర్వాత సక్సెస్‌ను అందుకుంటారు. ఆ సక్సెస్ మామూలుగా ఉండదు.

ప్రశాంతంగా ఉంటారు

రాడిక్స్ సంఖ్య ఎనిమిది వారు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. అలాగే శని ప్రభావం వలన ఎప్పుడూ కూడా న్యాయం వైపే ఉంటారు. అన్యాయం తలపెట్టాలని అనుకోరు. కష్టపడి డబ్బు సంపాదిస్తారు నిజాయితీగా ఉంటారు.

సూటిగా చెప్పరు

ప్రేమ జీవితంలో కూడా చాలెంజ్లు ఉంటాయి. ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రేమ, వైవాహిక జీవితంలో నమ్మకంగా ఉంటారు. కానీ తిరిగి వారికి సమస్యలే వస్తాయి. విడిపోవడం వంటివి కూడా చూడచ్చు. అయితే రిలేషన్‌షిప్‌ను కాపాడుకోవడానికి ఎంతగానో కష్టపడతారు. కానీ ఆ కష్టాన్ని వారి భాగస్వామి గుర్తించకపోవచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe