పుట్టిన తేదీ ఆధారంగా ఎలా అయితే ఒక మనిషి వ్యక్తిత్వం గురించి తెలుసుకుంటామో, పుట్టిన నెల ఆధారంగా కూడా అలాగే తెలుసుకోవచ్చు. మీరు అక్టోబర్ లేదా నవంబర్ నెలలో పుట్టారా? అయితే కచ్చితంగా మీ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి.

ప్రతి వ్యక్తిత్వం వారి అనుభవాలు, పెంపకం, పరిసరాలు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అలాగే జ్యోతిష్యం, నెలవారీ జన్మ విశ్లేషణ ప్రకారం అక్టోబర్, నవంబర్ నెలలో జన్మించిన వారికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. వారి ఆలోచనా విధానం, సంబంధాలను చూసే తీరు, నిర్ణయాలు తీసుకునే విధానం ఇతరుల కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. మీరు కూడా అక్టోబర్ లేదా నవంబర్ నెలలో పుట్టారా? అయితే కచ్చితంగా మీ గురించి ఇది తెలుసుకోవాలి.
అక్టోబర్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది?
అక్టోబర్ నెలలో పుట్టిన వారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో ఉంటారు. ఇతరులతో సులువుగా కలిసిపోతారు. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరిస్తారు. సులువుగా వారిని ఇట్టే మార్చేసుకోగలరు.
సామాజికంగా చురుకుగా ఉంటారు
అక్టోబర్ నెలలో పుట్టిన వారు సామాజికంగా చురుకుగా ఉంటారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తారు.
సమతుల్య ఆలోచనా విధానం
అక్టోబర్ నెలలో పుట్టిన వారు ఏదైనా విషయంపై వెంటనే నిర్ణయం తీసుకోరు. రెండు వైపుల నుంచి ఆలోచించే స్వభావంతో ఉంటారు. సమస్యల్ని ప్రశాంతంగా పరిష్కరించడానికి ఇష్టపడతారు.
అందం, కళలపై ఆసక్తి
అక్టోబర్లో పుట్టిన వారు అందం, కళలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. సంగీతం, కళలు, ఫ్యాషన్, సృజనాత్మక రంగాలపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
నిర్ణయాల్లో ఆలస్యం
{{/usCountry}}అక్టోబర్లో పుట్టిన వారు అందం, కళలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. సంగీతం, కళలు, ఫ్యాషన్, సృజనాత్మక రంగాలపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
నిర్ణయాల్లో ఆలస్యం
{{/usCountry}}ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు కాబట్టి కాస్త టైం పడుతుంది. వెంటనే నిర్ణయాలు తీసుకుని బాధపడడానికి ఇష్టపడరు.
సంబంధాలకు ఎక్కువ విలువ ఇస్తారు
అక్టోబర్ నెలలో పుట్టిన వారు వారి భాగస్వామిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వారిపై శ్రద్ధ పెడతారు. నమ్మకం, పరస్పర గౌరవం ఉన్న సంబంధాలను ఎక్కువగా కోరుకుంటారు.
నవంబర్ నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారు?
మీరు నవంబర్ నెలలో పుట్టారా? అయితే మీరు లోతైన ఆలోచనలను కలిగి ఉంటారు. అలాగే నవంబర్ నెలలో పుట్టిన వారు పట్టుదలతో ఉంటారు. ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత దానికోసం ఎంతగానో కష్టపడతారు.
బలమైన సంకల్పం
నవంబర్‌లో పుట్టిన వారు బలమైన సంకల్పంతో ఉంటారు. ఎదురయ్యే సమస్యలను సులువుగా పరిష్కరిస్తారు. వెనుకడుగు వేయరు. ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దానిని సాధించే వరకు నిద్రపోరు.
విషయాలను లోతుగా అర్థం చేసుకుంటారు
భావోద్వేగాలను బయటపడటంలో జాగ్రత్తగా ఉంటారు. మనసులో ప్రతి విషయాన్ని అందరితో షేర్ చేసుకోరు. ఎవరిని నమ్మాలో నిర్ణయించుకుని, ఆ తర్వాత మాత్రమే వ్యక్తిగత విషయాలను ఇతరులతో షేర్ చేసుకుంటారు.
విశ్వాసానికి ఎక్కువ ప్రాధాన్యత
సంబంధాల్లో నమ్మకం వీరికి చాలా ముఖ్యమైనది. ఒకసారి ఎవరినైనా నమ్మితే వారికి అండగా నిలబడడానికి ప్రయత్నం చేస్తారు.
లక్ష్యసాధనపై దృష్టి
నవంబర్ నెలలో పుట్టిన వారు కెరీర్, వ్యక్తిగత జీవితంలో, వ్యాపారంలో ఇలా ఏదైనా సరే స్పష్టమైన లక్ష్యాలు ఉంటే, వాటినే సాధించేదాకా క్రమశిక్షణతో పని చేస్తారు.