శివనామ స్మరణతో అద్భుత ఫలితాలు.. మంత్ర జపంలో ఈ తప్పులు అస్సలు చేయకండి!

మహాశివుడి అనుగ్రహం పొందడానికి 'ఓం నమః శివాయ' పంచాక్షరీ మంత్ర జపానికి విశేష ప్రాధాన్యం ఉంది. బ్రహ్మ ముహూర్తం లేదా ప్రదోష కాలంలో శుభ్రత, ఏకాగ్రతతో రుద్రాక్ష మాల ఉపయోగించి జపించడం ఉత్తమంగా భావిస్తారు. జపానికి ముందు శివుడిని ధ్యానించడం, ప్రార్థన చేయడం శ్రేయస్కరమని ఆధ్యాత్మిక గ్రంథాలు సూచిస్తున్నాయి. 

Published on: Jul 30, 2026, 12:30:47 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందూ సనాతన ధర్మంలో దేవుణ్ని ఆరాధించడానికి పూజా విధానాలతో పాటు మంత్ర జపానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. భగవంతుని నామాన్ని స్మరించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా లయకారకుడైన మహాశివుడు ఎంతో దయగలవాడని, భక్తులు చూపించే స్వచ్ఛమైన ప్రేమకు, భావానికి త్వరగా కరిగిపోతాడని పురాణాలు చెబుతున్నాయి. ఎలాంటి కఠినమైన పూజా విధానాలు లేకపోయినా, కేవలం శివనామ జపంతోనే ఆ స్వామి అనుగ్రహాన్ని సొంతం చేసుకోవచ్చు.

శివనామ స్మరణతో అద్భుత ఫలితాలు.. మంత్ర జపంలో ఈ తప్పులు అస్సలు చేయకండి!
శివనామ స్మరణతో అద్భుత ఫలితాలు.. మంత్ర జపంలో ఈ తప్పులు అస్సలు చేయకండి!

నిత్యం శివుడిని ఆరాధించడం వలన అనేక లాభాలు కలుగుతాయి. శ్రావణ, కార్తీక మాసాల్లో ప్రత్యేకించి శివుడిని ఆరాధిస్తారు. భక్తులు పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి రుద్రాక్ష మాలతో ప్రత్యేక జపాలు చేస్తుంటారు. అయితే, నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా మంత్రాలు జపించడం వల్ల సరైన ఫలితం దక్కదని ఆధ్యాత్మిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సరైన పద్ధతిలో శివనామ జపం చేయడం వల్ల సానుకూల శక్తి (Positive Energy) పెరిగి, ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది.

మంత్ర జపానికి సరైన సమయం, ముహూర్తం

శివ మంత్రాలను జపించడానికి బ్రహ్మ ముహూర్తం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. సాధారణంగా ఉదయం 4 గంటల నుంచి 6 గంటల మధ్య సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ సమయంలో చేసే జపం అత్యంత శక్తివంతమైన ఫలితాలను ఇస్తుంది.

ఉదయం కుదరని వారు సాయంత్రం ప్రదోష కాలంలో, అనగా సూర్యాస్తమయ వేళలో కూడా ఈ జపం చేయవచ్చు. ఎప్పుడైనా జపించడానికి వీలున్నప్పటికీ, బ్రహ్మ ముహూర్తం లేదా ప్రదోష కాలంలో చేసే సాధన త్వరగా సత్ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు

మంత్ర జపం ప్రారంభించడానికి ముందు తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి.

జపం చేసే సమయంలో మీ ముఖం తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ఉండేలా చూసుకోవడం మంచిది.

శివనామ జపానికి ఎప్పుడూ రుద్రాక్ష మాలనే ఉపయోగించాలి. ఇది శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.

ఇంట్లో లేదా గుడిలో ప్రశాంతమైన వాతావరణంలో, ఏకాగ్రతతో జపం చేయాలి. ఒకవేళ అలాంటి వాతావరణం కుదరకపోతే మనసులోనే మానసికంగా నామస్మరణ చేసుకోవచ్చు.

మంత్రాన్ని చెవులకు మాత్రమే స్పష్టంగా వినిపించేలా మితమైన స్వరంతో జపించాలి.

జపం ప్రారంభించే ముందు మహాశివుడిని మనసారా ధ్యానించాలి. అలాగే జపం పూర్తయిన తర్వాత దేవుడికి క్షమాపణ కోరుతూ ప్రార్థన చేయడం మరచిపోకూడదు.

శివ నామ జపంతో కలిగే అద్భుత ప్రయోజనాలు

శివ పురాణం, స్కంద పురాణం మరియు లింగ పురాణం ప్రకారం.. నిత్యం 'ఓం నమః శివాయ' పంచాక్షరీ మంత్రాన్ని జపించడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుంది. అలాగే అకాల మృత్యు భయం తొలగిపోతుందని నమ్ముతారు. ఈ మంత్ర జపం వల్ల శరీరంలోని పంచభూతాలు సమతుల్య స్థితికి వచ్చి, మానసిక ఒత్తిడి పూర్తిగా మాయమై అంతులేని ప్రశాంతత చేకూరుతుంది.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More