చాలామంది న్యూమరాలజీ ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. న్యూమరాలజీ ద్వారా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. పుట్టిన తేదీ ఆధారంగా మూలాంకాలను తెలుసుకొని, ఆ ప్రకారం భవిష్యత్తు గురించి, వారి వ్యక్తిత్వం గురించి అనేక విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ప్రేమ, పెళ్లి గురించి కూడా అనేక విషయాలను తెలుసుకోవడానికి వీలవుతుంది. కొన్ని తేదీల్లో పుట్టిన వారు లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంఖ్యల వారికి ప్రేమ వివాహం జరిగే అవకాశాలు ఎక్కువని న్యూమరాలజీ చెబుతోంది. మరి ఇందులో మీ పుట్టిన తేదీ ఉందేమో చూసుకోండి.

ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆనందం మించినది మరొకటి ఉండదు. కోరుకున్న వ్యక్తితో కలిసి జీవితాంతం ప్రయాణం చేయాలని అందరూ అనుకుంటారు. కానీ, అందరికీ అది సాధ్యం కాదు. ఈ తేదీల్లో పుట్టిన వారు అదృష్టవంతులని చెప్పచ్చు. ఈ తేదీల్లో పుట్టిన వారికి వివాహం ప్రేమ వివాహం జరిగే అవకాశాలు ఎక్కువ. న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తుల ప్రేమ స్వభావం, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే తీరు, భాగస్వామితో ఉండే అనుబంధం వంటి అంశాలను విశ్లేషిస్తారు. కొన్ని సంఖ్యలు వారు స్వతంత్ర ఆలోచనలు, కమ్యూనికేషన్, ప్రేమ విషయంలో చొరవ వంటి లక్షణాలను కలిగి ఉంటారని సూచిస్తాయి.
ఈ తేదీల్లో పుట్టిన వారు లవ్ మ్యారేజ్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ
మూలాంకం 1
ఏదైనా నెలలో 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి మూలాంకం ఒకటే అవుతుంది. ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమ విషయంలో కూడా మనసుకు నచ్చిన వ్యక్తిని ఎంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అలాగే, వారి అభిప్రాయాలను స్పష్టంగా చెప్తారు. ఒకరిని ప్రేమిస్తే ఆ బంధాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. సక్సెస్ అయ్యే వరకు ఊరుకోరు.
మూలాంకం 5
ఏదైనా నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టినట్లయితే వారి మూలాంకం ఐదో అవుతుంది. స్వేచ్ఛను, కొత్త అనుభవాలను ఈ తేదీల్లో పుట్టిన వారు ఎక్కువగా ఇష్టపడతారు. ప్రేమ విషయంలో నచ్చిన వ్యక్తిని స్వయంగా ఎంచుకుంటారు. భాగస్వామితో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు. వారి ఆలోచనలను కూడా బాగా అర్థం చేసుకోగలరు. ప్రేమ వివాహం పట్ల ఆసక్తి కూడా ఈ తేదీల్లో పుట్టిన వారికి ఎక్కువ.
మూలాంకం 3
{{/usCountry}}ఏదైనా నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టినట్లయితే వారి మూలాంకం ఐదో అవుతుంది. స్వేచ్ఛను, కొత్త అనుభవాలను ఈ తేదీల్లో పుట్టిన వారు ఎక్కువగా ఇష్టపడతారు. ప్రేమ విషయంలో నచ్చిన వ్యక్తిని స్వయంగా ఎంచుకుంటారు. భాగస్వామితో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు. వారి ఆలోచనలను కూడా బాగా అర్థం చేసుకోగలరు. ప్రేమ వివాహం పట్ల ఆసక్తి కూడా ఈ తేదీల్లో పుట్టిన వారికి ఎక్కువ.
మూలాంకం 3
{{/usCountry}}ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినట్లయితే వారి మూలాంకం మూడో అవుతుంది. ఉత్సాహంగా, స్నేహపూర్వకంగా ఉంటారు. ఇతరులతో సులువుగా కలిసిపోతారు. మనసులో భావాలను భాగస్వామితో పంచుకోవడాన్ని ఇష్టపడతారు. ఎక్కువగా ప్రేమలో సంతోషానికి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే, స్వేచ్ఛ, పరస్పర అవగాహన వంటి అంశాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. వీరు కూడా ప్రేమ వివాహం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది.
మూలాంకం 6
ఏదైనా నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టినట్లయితే వీరి మూలాంకం ఆరు అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. భాగస్వామిని ఎంతో ఇష్టపడతారు, బాగా చూసుకుంటారు. జీవితంలో ప్రేమకు ప్రత్యేక స్థానాన్ని ఇస్తారు. పెళ్లి తర్వాత కూడా భాగస్వామి సంతోషం కోసం కృషి చేస్తారు.
మూలాంకం 9
ఏదైనా నెలలో 9, 18, 27 తేదీల్లో పుట్టినట్లయితే వారి మూలాంకం 9 అవుతుంది. భావోద్వేగాలకు, ప్రేమకు ప్రాధాన్యత ఇస్తారు. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు కూడా లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
భాగస్వామి కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉంటారు. అలాగే, ఒకరిని మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులకు వారి ప్రేమను అర్థమయ్యేలా చెప్తారు. పెళ్లి చేసుకొని జీవిత భాగస్వామికి నిత్యం ఆనందాన్ని ఇస్తారు.
ABOUT THE AUTHOR
పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు