న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడంతో పాటు ప్రవర్తన, తీరు గురించి కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది. న్యూమరాలజీ, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండి చంద్రుడికి సంబంధించినది. అదృష్టం, శ్రేయస్సు, మనసు ప్రశాంతత వంటి వాటికి కారకుడు చంద్రుడు. పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తుల స్వభావం ఉంటుంది. ఒకరి బలహీనతలు మరొకరి బలాలు కావచ్చు.

ఒకరి బలాలు మరొకరి బలహీనతలు కావచ్చు. ప్రతిొక్కరి స్వభావ తీరు మరొకరితో పోల్చుకుంటే భిన్నంగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ఏ రాడిక్స్, ఆ నెంబర్ వారికి వెండి బాగా కలిసి వస్తుంది? వెండి అదృష్టాన్ని తీసుకువస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ తేదీల్లో పుట్టిన వారికి వెండి అదృష్టాన్ని తీసుకు వస్తుంది:
న్యూమరాలజీ ప్రకారం చూసినట్లయితే కొన్ని తేదీల్లో పుట్టిన వారికి వెండి బాగా కలిసి వస్తుంది. వెండిని ధరించడం వలన ఆనందం, సౌకర్యం ఉంటాయి. అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. మరి మీకు కూడా వెండి కలిసి వస్తుందో లేదో ఇప్పుడే తెలుసుకోండి.
రాడిక్స్ నెంబర్ 6
ఏదైనా నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 6 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి శుక్రుడు. శుక్రుడికి వజ్రం, రాగి అదృష్టం తీసుకు వస్తాయి. శుక్రుడికి చంద్రుడికి మధ్య స్నేహ సంబంధం ఉంది. కాబట్టి ఈ సంఖ్యలు వారు వెండి ఆభరణాలు ధరిస్తే సానుకూల ఫలితాలను చూస్తారు. ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. అదృష్టాన్ని పెంచుకోవడానికి ఈ రాడిక్స్ సంఖ్యల వారు శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది.
రాడిక్స్ నెంబర్ 2
ఏదైనా నెలలో 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 2 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి వెండి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ సంఖ్యకు అధిపతి చంద్రుడు. ఈ తేదీల్లో పుట్టిన వారు వెండిని ధరించడం వలన మనసు ప్రశాంతంగా మారుతుంది, మానసిక స్పష్టత ఉంటుంది, అదృష్టం కూడా ఎక్కువవుతుంది. కుడి చేతికి ఈ తేదీల్లో పుట్టిన వారు వెండి ఉంగరాన్ని ధరిస్తే మంచిది. వెండి గొలుసు కూడా ధరించవచ్చు.
రాడిక్స్ నెంబర్ 4
{{/usCountry}}ఏదైనా నెలలో 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 2 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి వెండి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ సంఖ్యకు అధిపతి చంద్రుడు. ఈ తేదీల్లో పుట్టిన వారు వెండిని ధరించడం వలన మనసు ప్రశాంతంగా మారుతుంది, మానసిక స్పష్టత ఉంటుంది, అదృష్టం కూడా ఎక్కువవుతుంది. కుడి చేతికి ఈ తేదీల్లో పుట్టిన వారు వెండి ఉంగరాన్ని ధరిస్తే మంచిది. వెండి గొలుసు కూడా ధరించవచ్చు.
రాడిక్స్ నెంబర్ 4
{{/usCountry}}ఏదైనా నెలలో 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 4 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి రాహువు. ఈ తేదీల్లో పుట్టిన వారు గోమేధికాన్ని వెన్నుతో కలిపి ధరిస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. సమస్యలన్నీ తొలగిపోతాయి. శనివారం నాడు ఆంజనేయస్వామిని లేదా కాలభైరవుని ఆరాధిస్తే అదృష్టాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.