ఈ తేదీల్లో పుట్టిన వారు తక్కువ మాట్లాడి పెద్ద విజయాలు సాధిస్తారు.. వాళ్ళల్లో ఉండే స్పెషల్ క్వాలిటీస్ చూస్తే షాక్ అవుతారు

న్యూమరాలజీ ప్రకారం, పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తుల స్వభావం, ఆలోచనా విధానం, ప్రవర్తనలోని ప్రత్యేకతలను తెలుసుకోవచ్చని నమ్ముతారు. ముఖ్యంగా మూల సంఖ్యలు 4, 7, 8 కలిగిన వారు తక్కువగా మాట్లాడి, తమ పనులు మరియు లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెడతారని చెబుతారు. 

Published on: Nov 28, 2026, 14:30:55 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

న్యూమరాలజీ అనేక విషయాలను చెబుతుంది. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయో చెప్పడంతో పాటుగా, భవిష్యత్తుకు సంబంధించినవి కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ఒక్కో సంఖ్య వారికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒక సంఖ్య వారితో పోల్చుకుంటే, మిగిలిన సంఖ్యల వారు విభిన్నంగా ఉంటారు. న్యూమరాలజీ ప్రకారం చూసినట్లయితే, ఈ తేదీల్లో పుట్టిన వారికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి.

ఈ తేదీల్లో పుట్టిన వారు తక్కువ మాట్లాడి పెద్ద విజయాలు సాధిస్తారు.. వాళ్ళల్లో ఉండే స్పెషల్ క్వాలిటీస్ చూస్తే షాక్ అవుతారు (AI)
ఈ తేదీల్లో పుట్టిన వారు తక్కువ మాట్లాడి పెద్ద విజయాలు సాధిస్తారు.. వాళ్ళల్లో ఉండే స్పెషల్ క్వాలిటీస్ చూస్తే షాక్ అవుతారు (AI)

ఈ తేదీల్లో పుట్టిన వారు తక్కువ మాట్లాడతారు, అలాగే మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. వీరిలో ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. మరి మీ మూల సంఖ్య ఏది? ఏ గ్రహం ఆ సంఖ్యకు అధిపతి? ప్రత్యేక లక్షణాలు కలిగిన సంఖ్యల వారి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ తేదీల్లో పుట్టిన వారు తక్కువ మాట్లాడతారు, పెద్ద విజయాన్ని అందుకుంటారు

మూలాంకం 4

ఏదైనా నెలలో 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినట్లయితే వారి మూలాంకం 4 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి రాహువు. ఈ సంఖ్య కలిగిన వారు గంభీరంగా ఉంటారు. అలాగే ఆచరణాత్మకంగా, స్వతంత్ర ఆలోచనలను కలిగి ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు ఏ పని చేసినా ముందుగానే జాగ్రత్త పడతారు. అవసరానికి తగ్గట్టుగానే మాట్లాడతారు. అనవసరంగా మాట్లాడడం వీరికి నచ్చదు. అలాగే ప్రణాళికలను ఇతరులతో పంచుకోవడం కూడా ఈ తేదీల్లో పుట్టిన వారికి ఏ మాత్రం నచ్చదు. పని పూర్తయ్యే వరకు వారి ప్రణాళిక గురించి ఎవరికీ చెప్పరు. పైగా పూర్తి దృష్టి పనిపైనే పెట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. అప్పటివరకు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉంటారు. ఒకసారి ఈ తేదీల్లో పుట్టిన వారు ఏదైనా టార్గెట్ ఫిక్స్ అయితే, దానిని పూర్తి చేసే వరకు కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గరు. పూర్తిగా కష్టపడి విజయవంతంగా వాటిని పూర్తి చేస్తారు.

మూలాంకం 8

ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టినట్లయితే వారి మూలాంకం 8 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి శని. క్రమశిక్షణ, కర్మ, న్యాయానికి ఈ గ్రహం ప్రత్యేకత. ఈ సంఖ్య కలిగిన వారు కష్టపడి పని చేస్తారు. ఓర్పు, బాధ్యతతో వ్యవహరిస్తారు. విజయాలను గొప్పగా చెప్పుకోవడం కంటే కృషిని నమ్ముతారు. ఎప్పుడూ కూడా విజయాలను అందుకోవడానికి కష్టపడి శ్రమిస్తారు. క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు వెళ్తారు. న్యూమరాలజీ ప్రకారం, ఈ సంఖ్యలో పుట్టిన వారు బాగా తక్కువ మాట్లాడి, వారి సక్సెస్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటారు. అలాగే ఏదైనా టార్గెట్ ఫిక్స్ అయితే, అది పూర్తయ్యే వరకు శ్రమిస్తారు. నిద్రపోరు. నిరంతరం కష్టాన్ని నమ్ముకుని పనిచేస్తూనే ఉంటారు.

మూలాంకం 7

ఏదైనా నెలలో 7, 16, 25 తేదీల్లో పుట్టినట్లయితే వీరి మూలాంకం 7 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి కేతువు. ఈ మూలాంకం వారు ప్రశాంతంగా ఉంటారు, లోతుగా ఆలోచిస్తారు. అలాగే ప్రతి విషయం పైన వారి అభిప్రాయాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు. పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత మాత్రమే స్పందిస్తారు. జ్ఞానం, ఆత్మపరిశీలన, ఏకాగ్రత వీరిలో ఉండే గొప్ప లక్షణాలు. అనవసరంగా పదేపదే మాట్లాడి వారు డిస్టర్బ్ అవ్వరు, ఇతరులను డిస్టర్బ్ అయ్యేలా చేయరు. అన్ని పూర్తయిన తర్వాత ఒక మాటలో మొత్తం చెప్పేస్తారు. ఎక్కువగా వీరి అభిప్రాయాలను మాత్రం పంచుకోవడానికి ఏమాత్రం ఆసక్తి చూపించరు.

ABOUT THE AUTHOR

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు