Lucky Day: పుట్టిన తేదీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. అలాగే పుట్టిన రోజు ప్రకారం కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. మనం పుట్టిన రోజును బట్టి భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పడంతో పాటుగా బలాలు, బలహీనతల గురించి కూడా ఎన్నో విషయాలు చెప్పవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం వారంలో కొన్ని రోజులు చాలా ప్రత్యేకమైనవిగా భావిస్తారు. ఈ రోజుల్లో పుట్టిన వారికి బాగా కలిసి వస్తుంది.

భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఈ రోజుల్లో పుట్టిన వారు అదృష్టవంతులని చెప్పచ్చు. డబ్బుకు కూడా లోటు ఉండదు, పేరు ప్రతిష్టలు పొందుతారు, ఆర్థికపరంగా ఎన్నో లాభాలను పొందుతారు. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి. కుటుంబానికి కూడా గౌరవం పెరుగుతుంది.
అదృష్టం అంటే వీరిదే
ముఖ్యంగా ఈ రోజుల్లో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు. ఈ రోజుల్లో పుట్టిన చిన్నారులు భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకుంటారు. చిన్న వయసులోనే డబ్బుని బాగా సంపాదిస్తారు, ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మరి ఏ రోజుల్లో పుట్టిన వారు అదృష్టవంతులు? ఇప్పుడే తెలుసుకుందాం. వీటిలో మీరు ఒకదాన్ని చూసుకోండి.
1.బుధవారం
బుధవారం పుట్టిన పిల్లలు చాలా అదృష్టవంతులని చెప్పచ్చు. బుధవారం పుట్టిన వారికి మెదడు బాగా పని చేస్తుంది. వ్యాపారంలో బాగా రాణిస్తారు. అలాగే ఈ రోజున పుట్టిన వారు చేసిన పనికి ఎక్కువ గుర్తింపును పొందుతారు. పేరు, ప్రతిష్టలు కూడా బాగా అందుతాయి.
2.గురువారం
గురువారం గురు గ్రహానికి సంబంధం ఉంటుంది. గురువారం పుట్టిన వారు చాలా అదృష్టవంతులు. ఈ రోజున పుట్టిన వారికి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. డబ్బులు కూడా బాగా సంపాదిస్తారు. తొందరగానే ఫేమస్ అయిపోతారు. చిన్నప్పటి నుంచి వీరికి గౌరవం దక్కుతుంది. అలాగే వీరి టాలెంట్ ని బట్టి అందరూ వీరికి ఫిదా అయిపోతారు. గుర్తింపుని కూడా బాగా సంపాదిస్తారు.
3.శుక్రవారం
శుక్రవారం పుట్టిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఈ రోజున పుట్టిన వారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆనందంగా ఉంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు, ఆనందంగా ఉంటారు.
4.ఆదివారం
{{/usCountry}}శుక్రవారం పుట్టిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఈ రోజున పుట్టిన వారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆనందంగా ఉంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు, ఆనందంగా ఉంటారు.
4.ఆదివారం
{{/usCountry}}ఆదివారం పుట్టిన వారు కూడా అదృష్టవంతులు. ఆదివారం పుట్టిన వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆదివారం పుట్టిన వారు ప్రతి అడుగు కూడా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని వేస్తూ ఉంటారు. అలా సక్సెస్ ని అందుకుంటారు. గుర్తింపుని కూడా బాగా సంపాదిస్తారు.